ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. దోహాలో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన నాకౌట్ తొలి రౌండ్‌లో పంకజ్ 4–0 (79–13, 54–2, 139–0, 74–1) ఫ్రేమ్‌ల తేడాతో అహ్మద్ సలూమీ (యెమెన్)పై విజయం సాధించాడు. లీగ్ దశలో గ్రూప్ ‘బి’లో పోటీపడిన పంకజ్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి టాపర్‌గా నిలిచాడు. నాకౌట్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగాడు. భారత్‌కే చెందిన అలోక్ కుమార్, లక్ష్మణ్ రావత్ కూడా నాకౌట్ తొలి రౌండ్‌లో గెలిచి ముందంజ వేశారు.
Comments
Please login to add a commentAdd a comment