
6 రెడ్స్ వరల్డ్‌కప్ స్నూకర్ విజేత పంకజ్ అద్వానీ
Pankaj Advani Wins 6 Red Snooker World Cup In Doha: భారత స్టార్ పంకజ్ అద్వానీ వారం రోజుల వ్యవధిలో మరో అంతర్జాతీయ టైటిల్ సాధించాడు. గత గురువారం ఆసియా స్నూకర్ టైటిల్‌ను నిలబెట్టుకున్న పంకజ్ దోహాలో మంగళవారం ముగిసిన 6 రెడ్స్ వరల్డ్‌కప్ స్నూకర్ టోర్నీలో విజేతగా నిలిచాడు. ఫైనల్లో పంకజ్ 7–5 (42–13, 14–38, 53–0, 42–19, 1–53, 47–17, 44–0, 36–3, 0–43, 12–46, 15–59, 53–5) ఫ్రేమ్‌ల తేడాతో బాబర్ మసీ (పాకిస్తాన్)పై నెగ్గాడు. పంకజ్‌కు 12 వేల డాలర్ల (రూ. 8 లక్షల 84 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది. కాగా అతడి కెరీర్‌లో ఇది 24 వ వరల్డ్ టైటిల్ కావడం విశేషం.