Snooker World Cup
-
మహిళల స్నూకర్ ప్రపంచకప్ విజేత భారత్
బ్యాంకాక్: మహిళల స్నూకర్ ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత జట్టుకు టైటిల్ లభించింది. అమీ కమాని–అనుపమ రామచంద్రన్లతో కూడిన భారత ‘ఎ’ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో అమీ కమాని–అనుపమ జోడీ 56–26, 67–27, 41–61, 27–52, 68–11, 55–64, 78–39తో ఇంగ్లండ్ ‘ఎ’ జట్టుకు చెందిన రీని ఇవాన్స్–రెబెకా కెన్నా ద్వయంపై విజయం సాధించింది. -
వారెవ్వా పంకజ్.. పాక్ ఆటగాడిపై నెగ్గి.. 24వ టైటిల్!
Pankaj Advani Wins 6 Red Snooker World Cup In Doha: భారత స్టార్ పంకజ్ అద్వానీ వారం రోజుల వ్యవధిలో మరో అంతర్జాతీయ టైటిల్ సాధించాడు. గత గురువారం ఆసియా స్నూకర్ టైటిల్‌ను నిలబెట్టుకున్న పంకజ్ దోహాలో మంగళవారం ముగిసిన 6 రెడ్స్ వరల్డ్‌కప్ స్నూకర్ టోర్నీలో విజేతగా నిలిచాడు. ఫైనల్లో పంకజ్ 7–5 (42–13, 14–38, 53–0, 42–19, 1–53, 47–17, 44–0, 36–3, 0–43, 12–46, 15–59, 53–5) ఫ్రేమ్‌ల తేడాతో బాబర్ మసీ (పాకిస్తాన్)పై నెగ్గాడు. పంకజ్‌కు 12 వేల డాలర్ల (రూ. 8 లక్షల 84 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది. కాగా అతడి కెరీర్లో ఇది 24 వ వరల్డ్ టైటిల్ కావడం విశేషం. చదవండి: PBKS vs RR: పరాజయానికి పంజాబ్ పిలుపు -
భారత్ ముందంజ
జుయ్ (చైనా): స్టార్ ఆటగాడు పంకజ్ అద్వానీ, ఆదిత్య మెహతాలతో కూడిన భారత జట్టు... స్నూకర్ ప్రపంచ కప్‌లో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. గ్రూప్ ‘ఎ’లో జరిగిన చివరి రౌండ్ మ్యాచ్‌లో భారత్ 4-1తో సింగపూర్‌పై విజయం సాధించింది. దీంతో గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచింది. నాలుగు గ్రూప్‌ల్లో టాప్-2లో నిలిచిన జట్లు... క్వార్టర్ఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 5-0తో ఓడించిన భారత్... నార్వేను కూడా 5-0తోనే చిత్తు చేసింది. అయితే మూడో మ్యాచ్‌లో మాల్టా నుంచి గట్టిపోటీ ఎదురైనా.. 3-2తో నెగ్గింది. నాకౌట్లో భారత్.. బెల్జియంతో తలపడుతుంది.