
ఏసీసీ ఎమర్జింగ్ ఆసియా కప్ 2024తో టీమిండియాకు మరో ఆణిముత్యం లభించింది. రసిఖ్ సలాం అనే కుర్రాడి రూపంలో టీమిండియాకు మరో ఫాస్ట్ బౌలర్ దొరికాడు. ఈ టోర్నీలో టీమిండియా సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టినప్పటికీ రసిఖ్ ప్రదర్శనలను మాత్రం అభిమానులను ఆకట్టుకున్నాయి.
రసిఖ్ ఈ టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సెమీఫైనల్లో మిగతా టీమిండియా బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటే రసిఖ్ మాత్రం పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా మూడు కీలకమైన వికెట్లు తీసి ప్రత్యర్థికి పగ్గాలు వేశాడు.
24 ఏళ్ల రసిఖ్ తొలిసారి ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. రసిఖ్ 2019 ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేశాడు. గత ఐపీఎల్ సీజన్‌లో రసిఖ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాడు. రసిఖ్ జమ్మూ అండ్ కశ్మీర్ రాష్ట్రానికి చెందిన వాడు. ఈ ప్రాంతం నుంచి ఐపీఎల్ ఆడిన మూడో క్రికెటర్ రసిఖ్.
రసిఖ్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలింగ్‌తో పాటు అడపాదడపా బ్యాటింగ్ కూడా చేయగలడు. ఎమర్జింగ్ ఆసియా కప్ ప్రదర్శనల అనంతరం భారత అభిమానులు రసిఖ్‌ను ఫ్యూచర్ స్టార్‌గా పిలుస్తున్నారు.
కాగా, ఏసీసీ ఎమర్జింగ్ ఆసియా కప్ 2024 సెమీఫైనల్లో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ చేతిలో అనూహ్య ఓటమిని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. జుబైద్ అక్బరీ (64), సెదికుల్లా అటల్ (83) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రసిఖ్ 3, ఆకిబ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారత ఇన్నింగ్స్‌లో రమణ్‌దీప్ సింగ్ (64) అర్ద సెంచరీతో చెలరేగినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.
ఏసీసీ ఎమర్జింగ్ ఆసియా కప్ 2024లో రసిఖ్ ప్రదర్శనలు..
4-0-30-2 vs పాక్
2-0-15-3 vs యూఏఈ
3-0-23-1 vs ఒమన్
4-0-25-3 vs ఆఫ్ఘనిస్తాన్
చదవండి: IND VS SA T20 Series: శివమ్ దూబే, రియాన్ పరాగ్‌కు ఏమైంది..?