ACC Men's T20 Emerging Teams Asia Cup 2024
-
ఆసియా కప్ 2024 విజేతగా ఆఫ్ఘనిస్తాన్
ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టీ20 టోర్నీ విజేతగా ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్టు అవతరించింది. నిన్న (అక్టోబర్ 27) జరిగిన ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్-ఏ శ్రీలంక-ఏపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. బిలాల్ సమీ (4-0-22-3), అల్లా ఘజన్ఫర్ (4-0-14-2) అద్భుతంగా బౌలింగ్ చేసి శ్రీలంకను కట్టడి చేశారు.THE HISTORIC MOMENT. - Afghanistan wins the Emerging Asia Cup. 🥶pic.twitter.com/vwiX4xaE6o— Mufaddal Vohra (@mufaddal_vohra) October 27, 2024శ్రీలంక ఇన్నింగ్స్‌లో సహన్ అరచ్చిగే (64 నాటౌట్) అజేయ అర్ద సెంచరీతో రాణించగా.. పవన్ రత్నాయకే (20), నిమేశ్ విముక్తి (23) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. యశోధ లంక (1), లహీరు ఉదార (5), నువనిదు ఫెర్నాండో (4), అహన్ విక్రమసింఘే (4), రమేశ్ మెండిస్ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. దుషన్ హేమంత 6 పరుగులతో అజేయంగా నిలిచాడు. పవన్ రత్నాయకే, నిమేశ్ విముక్తి రనౌటయ్యారు. THE CELEBRATIONS OF AFGHANISTAN TEAM WITH EMERGING ASIA CUP TROPHY..!!! 🏆- A Historic Moments for Afghanistan Cricket History. 🇦🇫 pic.twitter.com/NctY2q9yvO— Tanuj Singh (@ImTanujSingh) October 27, 2024అనంతరం 134 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీయాలకు చేరింది. సెదికుల్లా అటల్ (55 నాటౌట్) అజేయ అర్ద సెంచరీతో ఆఫ్ఘనిస్తాన్‌ను గెలిపించాడు. అతనికి కరీం జనత్ (33), కెప్టెన్ దర్విష్ రసూలీ (24), మహ్మద్ ఇషాక్ (16 నాటౌట్) సహకరించారు. Happy team, Happy moments to cherish 👏pic.twitter.com/Cmhas0L9zY— CricTracker (@Cricketracker) October 27, 2024లంక బౌలర్లలో సహన్ అరచ్చిగే, దుషన్ హేమంత, ఎషాన్ మలింగ తలో వికెట్ పడగొట్టారు. ఫైనల్లో అద్భుతమైన స్పెల్‌తో (4-0-14-2) శ్రీలంకను కట్టడి చేసిన అల్లా ఘజన్ఫర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. టోర్నీ ఆధ్యంతం అద్భుతంగా రాణించిన సెదికుల్లా అటల్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా ఎంపికయ్యాడు. -
Asia Cup 2024 Final: ఆఫ్ఘనిస్తాన్ టార్గెట్ 134 రన్స్
ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టీ20 టోర్నీ ఫైనల్లో ఇవాళ (అక్టోబర్ 27) శ్రీలంక-ఏ, ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు బిలాల్ సమీ (4-0-22-3), అల్లా ఘజన్ఫర్ (4-0-14-2) సత్తా చాటడంతో శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేయగలిగింది.శ్రీలంక ఇన్నింగ్స్‌లో సహన్ అరచ్చిగే (64 నాటౌట్) అజేయ అర్ద సెంచరీతో రాణించగా.. పవన్ రత్నాయకే (20), నిమేశ్ విముక్తి (23) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. యశోధ లంక (1), లహీరు ఉదార (5), నువనిదు ఫెర్నాండో (4), అహన్ విక్రమసింఘే (4), రమేశ్ మెండిస్ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. దుషన్ హేమంత 6 పరుగులతో అజేయంగా నిలిచాడు. పవన్ రత్నాయకే, నిమేశ్ విముక్తి రనౌటయ్యారు. అనంతరం 134 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 8 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. జుబైద్ అక్బరీ (0), కెప్టెన్ దర్విష్ రసూలీ (24) ఔట్ కాగా.. సెదికుల్లా అటల్ (19), కరీం జనత్ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ గెలవాంటే మరో 72 బంతుల్లో 87 పరుగులు చేయాలి. -
రసిఖ్ సలాం.. టీమిండియా రైజింగ్ స్టార్
ఏసీసీ ఎమర్జింగ్ ఆసియా కప్ 2024తో టీమిండియాకు మరో ఆణిముత్యం లభించింది. రసిఖ్ సలాం అనే కుర్రాడి రూపంలో టీమిండియాకు మరో ఫాస్ట్ బౌలర్ దొరికాడు. ఈ టోర్నీలో టీమిండియా సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టినప్పటికీ రసిఖ్ ప్రదర్శనలను మాత్రం అభిమానులను ఆకట్టుకున్నాయి. రసిఖ్ ఈ టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సెమీఫైనల్లో మిగతా టీమిండియా బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటే రసిఖ్ మాత్రం పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా మూడు కీలకమైన వికెట్లు తీసి ప్రత్యర్థికి పగ్గాలు వేశాడు.24 ఏళ్ల రసిఖ్ తొలిసారి ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. రసిఖ్ 2019 ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేశాడు. గత ఐపీఎల్ సీజన్లో రసిఖ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాడు. రసిఖ్ జమ్మూ అండ్ కశ్మీర్ రాష్ట్రానికి చెందిన వాడు. ఈ ప్రాంతం నుంచి ఐపీఎల్ ఆడిన మూడో క్రికెటర్ రసిఖ్. రసిఖ్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలింగ్‌తో పాటు అడపాదడపా బ్యాటింగ్ కూడా చేయగలడు. ఎమర్జింగ్ ఆసియా కప్ ప్రదర్శనల అనంతరం భారత అభిమానులు రసిఖ్‌ను ఫ్యూచర్ స్టార్‌గా పిలుస్తున్నారు.కాగా, ఏసీసీ ఎమర్జింగ్ ఆసియా కప్ 2024 సెమీఫైనల్లో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ చేతిలో అనూహ్య ఓటమిని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. జుబైద్ అక్బరీ (64), సెదికుల్లా అటల్ (83) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రసిఖ్ 3, ఆకిబ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారత ఇన్నింగ్స్‌లో రమణ్‌దీప్ సింగ్ (64) అర్ద సెంచరీతో చెలరేగినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.ఏసీసీ ఎమర్జింగ్ ఆసియా కప్ 2024లో రసిఖ్ ప్రదర్శనలు..4-0-30-2 vs పాక్2-0-15-3 vs యూఏఈ3-0-23-1 vs ఒమన్4-0-25-3 vs ఆఫ్ఘనిస్తాన్చదవండి: IND VS SA T20 Series: శివమ్ దూబే, రియాన్ పరాగ్‌కు ఏమైంది..? -
Asia T20 Cup: సెమీస్‌లో పాక్‌ను చిత్తు చేసిన శ్రీలంక.. ఫైనల్లో ఎంట్రీ
వర్దమాన టీ20 క్రికెట్ జట్ల ఆసియా కప్-2024లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా శ్రీలంక నిలిచింది. తొలి సెమీ ఫైనల్లో పాకిస్తాన్‌ను చిత్తు చేసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. అల్ అమెరత్ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో శ్రీలంక-‘ఎ’ జట్టు పాకిస్తాన్-‘ఎ’తో తలపడింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ యాసిర్ ఖాన్ రెండు పరుగులకే పెవిలియన్ చేరగా.. మరో ఓపెనింగ్ బ్యాటర్ ఒమైర్ యూసఫ్ అర్ధ శతకంతో చెలరేగాడు. మొత్తంగా 46 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 68 పరుగులు చేశాడు.Omair Yousuf sits back and brings out the reverse sweep 6️⃣@TheRealPCB#MensT20EmergingTeamsAsiaCup2024 #SLvPAK #ACC pic.twitter.com/PTyFhDF7OJ— AsianCricketCouncil (@ACCMedia1) October 25, 2024దుషాన్ హేమంత తిప్పేశాడుఅయితే, యూసఫ్నకు మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. లంక బౌలర్లను ఎదుర్కోలేక వచ్చినవాళ్లు వచ్చినట్లుగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. వన్‌డౌన్ బ్యాటర్ కెప్టెన్ మహ్మద్ హ్యారిస్(6) పూర్తిగా విఫలం కాగా.. తర్వాతి స్థానాల్లో వచ్చిన కాసిం అక్రం(0), హైదర్ అలీ(14), అరాఫత్ మిన్హాస్(10), అబ్దుల్ సమద్(0), అబ్బాస్ ఆఫ్రిది(9), మహ్మద్ ఇమ్రాన్(13), సూఫియాన్ ముఖీం(4 నాటౌట్), షానవాజ్ దహానీ(0- నాటౌట్) చేతులెత్తేశారు.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ తొమ్మిది వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో స్పిన్నర్ దుషాన్ హేమంత అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టగా.. పేసర్లు నిపుణ్ రన్సిక, ఇషాన్ మలింగ రెండేసి వికెట్లు కూల్చారు.అహాన్ విక్రమసింఘే సూపర్ హాఫ్ సెంచరీఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ యశోద లంక (11- అబ్‌స్ట్రకింగ్ ది ఫీల్డ్) తక్కువ స్కోరుకే వెనుదిరగాల్సి వచ్చినా.. మరో ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ లాహిరు ఉదర 20 బంతుల్లో 43 పరుగులతో ఆకట్టుకున్నాడు.ఇక వన్‌డౌన్ బ్యాటర్ అహాన్ విక్రమసింఘే సూపర్ హాఫ్ సెంచరీతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. 46 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 52 పరుగులు చేశాడు. మిగతా వాళ్లలో కెప్టెన్ నువానిడు ఫెర్నాండో(9) విఫలం కాగా.. సహాన్ అరాచ్చిగె(16 బంతుల్లో 17)ఫోర్ బాది లంకను విజయతీరాలకు చేర్చాడు.ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్లోఈ క్రమంలో 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన శ్రీలంక పాకిస్తాన్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక రెండో సెమీ ఫైనల్లో తిలక్ వర్మ సారథ్యంలోని భారత-‘ఎ’ జట్టు అఫ్గనిస్తాన్‌తో తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టుతో శ్రీలంక టైటిల్ కోసం ఆదివారం(అక్టోబరు 27) తలపడుతుంది.చదవండి: ఇదేం కెప్టెన్సీ రోహిత్?.. మాజీ హెడ్‌కోచ్ ఘాటు విమర్శలు -
Asia Cup 2024: పాక్ భారీ విజయం.. భారత్‌తో పాటు సెమీస్‌లో!
ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా టీ20 కప్-2024లో పాకిస్తాన్-‘ఎ’ జట్టుకు వరుసగా రెండో విజయం లభించింది. అల్ అమెరత్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో పాక్ యూఏఈ టీమ్‌ను ఏకంగా 114 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ గెలుపుతో సెమీ ఫైనల్ బెర్తును కూడా ఖరారు చేసుకుంది.పాక్, యూఏఈలపై గెలిచిన భారత్‌కాగా ఒమన్ వేదికగా వర్ధమాన టీ20 జట్ల మధ్య ఆసియా కప్ ఈవెంట్ జరుగుతోంది. ఇందులో తిలక్ వర్మ సారథ్యంలోని భారత జట్టు సహా పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ గ్రూప్-బిలో ఉండగా.. హాంగ్‌కాంగ్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్ గ్రూప్-ఎలో ఉన్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే పాకిస్తాన్, యూఏఈలపై గెలుపొంది భారత్ గ్రూప్-బి నుంచి సెమీస్‌లో అడుగుపెట్టింది. తాజాగా పాక్ సైతం టాప్-4కు అర్హత సాధించింది. యూఏఈతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది.కెప్టెన్ ధనాధన్ ఇన్నింగ్స్‌ఓపెనర్లు ఒమైర్ యూసఫ్(11 బంతుల్లో 21), యాసిర్ ఖాన్(13 బంతుల్లో25) శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ మహ్మద్ హ్యారిస్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. మొత్తంగా 49 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 71 పరుగులు సాధించాడు.మిగతా వాళ్లలో కాసిం అక్రం 23 పరుగులు చేయగా.. హైదర్ అలీ మెరుపు ఇన్నింగ్స్(17 బంతుల్లో 32*) ఆడాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 179 పరుగులు చేసింది.65 పరుగులకే కుప్పకూలిన యూఏఈలక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే యూఏఈ తడబడింది. ఓపెనర్లు ఆయాన్ష్ శర్మ(8), మయాంక్ రాజేశ్ కుమార్(0) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ తానిశ్ సూరి 15 రన్స్ చేశాడు. మిగిలిన ఆటగాళ్లలో వికెట్ కీపర్ సయీద్ హైదర్ షా(12), ధ్రువ్ పరాషర్(1), బాసిల్ హమీద్(4), సంచిత్ శర్మ(0), ముహ్మద్ ఫారూక్(3), అకీఫ్ రాజా(0), ఒమిద్ రెహ్మాన్(0 నాటౌట్) దారుణ ప్రదర్శన కనబరిచారు.ఇక కెప్టెన్ రాహుల్ చోప్రా చేసిన ఇరవై పరుగులే యూఏఈ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు. ఈ క్రమంలో 16.3 ఓవర్లలో కేవలం 65 పరుగులకే యూఏఈ జట్టు కుప్పకూలింది. పాక్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షానవాజ్దహాని అత్యధికంగా ఐదు వికెట్లు పడగొట్టగా.. సూఫియాన్ ముఖీమ్ రెండు, అహ్మద్ దనియాల్, అబ్బాస్ ఆఫ్రిది, అరాఫత్ మిన్హాస్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా పాక్ అంతకుముందు ఒమన్‌పై విజయం సాధించింది.చదవండి: Ind vs NZ: అతడి ఆట తీరు బాగుంది.. అయినా..: గంభీర్ నువ్వేమైనా ‘హ్యాట్రిక్’ హీరోవా? బుద్ధిలేదా?: పాక్ మాజీ క్రికెటర్ ఫైర్ -
అభిషేక్ శర్మ ఊచకోత.. యూఏఈపై టీమిండియా ఘన విజయం
టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024 టోర్నీలో భాగంగా యూఏఈతో ఇవాళ (అక్టోబర్ 21) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. భారత బౌలర్ల ధాటికి 16.5 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా పేసర్ రసిఖ్ సలామ్ ఐదు బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీసి యూఏఈని చావుదెబ్బ కొట్టాడు. అనంతరం రమణ్‌దీప్ సింగ్ రెండు ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టాడు. అన్షుల్ కంబోజ్, వైభవ్ అరోరా, అభిషేక్ శర్మ, నేహల్ వధేరా తలో వికెట్ దక్కించుకున్నారు. యూఏఈ ఇన్నింగ్స్‌లో రాహుల్ చోప్రా ఒక్కడే ఒంటరిపోరాటం చేశాడు. రాహుల్ 50 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. యూఏఈ ఇన్నింగ్స్‌లో రాహుల్‌తో పాటు కెప్టెన్ బాసిల్ హమీద్ (12 బంతుల్లో 22; ఫోర్, 2 సిక్సర్లు), మయాంక్ రాజేశ్ కుమార్ (5 బంతుల్లో 10; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అభిషేక్ శర్మ ఊచకోత..స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. అభిషేక్ శర్మ (24 బంతుల్లో 58; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో 10.5 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. భారత ఇన్నింగ్స్‌లో తిలక్ వర్మ 21, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 8, అభిషేక్ 58 పరుగులు చేసి ఔట్ కాగా.. నేహల్ వధేరా 6, ఆయుశ్ బదోని 12 పరుగులతో అజేయంగా నిలిచారు. -
టీమిండియా బౌలర్ల విజృంభణ.. 107 పరుగులకే కుప్పకూలిన పసికూన
ఏసీసీ మెన్స్ టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024 టోర్నీలో భాగంగా పసికూన యూఏఈతో ఇవాళ (అక్టోబర్ 21) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. యూఏఈని 107 పరుగులకే (16.5 ఓవర్లలో) కుప్పకూల్చింది. టీమిండియా పేసర్ రసిఖ్ సలామ్ ఐదు బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీసి యూఏఈని చావుదెబ్బ కొట్టాడు. అనంతరం రమణ్‌దీప్ సింగ్ రెండు ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టాడు. అన్షుల్ కంబోజ్, వైభవ్ అరోరా, అభిషేక్ శర్మ, నేహల్ వధేరా తలో వికెట్ దక్కించుకున్నారు. యూఏఈ ఇన్నింగ్స్‌లో రాహుల్ చోప్రా ఒక్కడే ఒంటరిపోరాటం చేశాడు. రాహుల్ 50 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. యూఏఈ ఇన్నింగ్స్‌లో రాహుల్‌తో పాటు కెప్టెన్ బాసిల్ హమీద్ (12 బంతుల్లో 22; ఫోర్, 2 సిక్సర్లు), మయాంక్ రాజేశ్ కుమార్ (5 బంతుల్లో 10; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ఒమిద్ రెహ్మాన్ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (8; సిక్స్) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 100 పరుగులు చేయాల్సి ఉంది. కాగా, భారత్ ఈ టోర్నీలో జరిగిన తమ ఓపెనింగ్ మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌పై ఏడు పరుగుల తేడాతో గెలుపొందింది.చదవండి: ఇంగ్లండ్ కెప్టెన్‌గా లియామ్ లివింగ్‌స్టోన్ -
పాకిస్తాన్ తొలి విజయం
ఏసీసీ మెన్స్ టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఏసియా కప్ 2024 టోర్నీలో పాకిస్తాన్-ఏ జట్టు తొలి విజయం నమోదు చేసింది. అల్ అమీరట్ వేదికగా ఒమన్‌తో ఇవాళ (అక్టోబర్ 21) జరిగిన మ్యాచ్‌లో పాక్-ఏ జట్టు 74 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఖాసిమ్ అక్రమ్ (48), రొహైల్ నజీర్ (41 నాటౌట్), ఆరాఫత్ మిన్హాస్ (31 నాటౌట్), ఒమైర్ యూసఫ్ (25), అబ్దుల్ సమద్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఒమన్ బౌలరల్లో ముజాహిర్ రజా రెండు వికెట్లు పడగొట్టగా.. వసీం అలీ, సమయ్ శ్రీవత్సవ, సుఫ్యాన్ మెహమూద్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 186 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 111 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. పాక్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించి ఒమన్‌ను కట్టడి చేశారు. జమాన్ ఖాన్ 2, షానవాజ్ దహాని, మొహమ్మద్ ఇమ్రాన్, ఖాసిమ్ అక్రమ్, అరాఫత్ మిన్హాస్, సుఫియాన్ ముఖీమ్ తలో వికెట్ పడగొట్టారు. ఒమన్ బ్యాటర్లలో వసీం అలీ (28), జతిందర్ సింగ్ (24), హమ్మద్ మిర్జా (14), ఆమిర్ ఖలీమ్ (11) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. పాక్ ఈ టోర్నీలో తమ తదుపరి మ్యాచ్‌లో యూఏఈతో తలపడనుండగా.. భారత్ ఇవాళ సాయంత్రం అదే యూఏఈని ఢీకొట్టనుంది. చదవండి: పాక్ బౌలర్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన అభిషేక్ శర్మ -
Ind vs Pak: నువ్వేమైనా హీరోవా?: పాక్ మాజీ క్రికెటర్ ఫైర్
వర్దమాన ఆసియా టీ20 కప్-2024లో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఘటనపై పాక్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ స్పందించాడు. యువ ఆటగాళ్లకు ప్రత్యర్థి జట్టును గౌరవించే సంస్కారం నేర్పాలంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కు హితవు పలికాడు. అభిషేక్ శర్మ పట్ల సూఫియాన్ ముఖీమ్ ప్రవర్తన సరికాదంటూ మండిపడ్డాడు.కాగా ఏసీసీ మెన్స్ టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టోర్నీలో భారత్-‘ఎ’ జట్టు శుభారంభం చేసిన విషయం తెలిసిందే. ఒమన్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్-‘ఎ’పై తిలక్ వర్మ సేన ఏడు పరుగుల తేడాతో గెలుపొందింది. శనివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా.. భారత ఓపెనర్ అభిషేక్ శర్మను రెచ్చగొట్టేలా పాక్ యువ స్పిన్నర్ సూఫియాన్ ముఖీమ్ ప్రవర్తించాడు.అభిషేక్ ధనాధన్టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసిన క్రమంలో అభిషేక్.. 22 బంతులు ఎదుర్కొని 35 పరుగులు రాబట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఐదు బౌండరీలు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అయితే, దూకుడుగా ఆడుతున్న సమయంలో ఆరో ఓవర్ ఆఖరి బంతికి సూఫియాన్ బౌలింగ్‌లో అభిషేక్.. కాసిం అక్రంకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.సూఫియాన్ ఓవరాక్షన్దీంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అయితే, అభిషేక్ అవుట్ కాగానే సూఫియాన్ ఓవరాక్షన్ చేశాడు. ‘నోరు మూసుకుని.. ఇక దయచెయ్’’ అన్నట్లుగా ముక్కుమీద వేలు వేసి అభిషేక్‌కు సైగ చేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన అభిషేక్ సూఫియాన్ వైపునకు సీరియస్‌గా చూశాడు. ఈ క్రమంలో అంపైర్లు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.నువ్వేమైనా హ్యాట్రిక్ హీరోవా?ఈ ఘటనపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ స్పందిస్తూ.. ‘‘క్రికెట్ అంటేనే టాప్ క్లాస్. కానీ.. సూఫియాన్ ముఖీమ్- అభిషేక్ శర్మ మధ్య జరిగిన ఘటన నన్ను నిరాశకు గురిచేసింది. ఒకవేళ నేనే గనుక పాక్ జట్టు టీమ్ మేనేజర్‌గా డకౌట్లో ఉండి ఉంటే.. వెంటనే సూఫియాన్‌ను పిలిచి.. ‘‘బేటా.. ఇక బ్యాగు సర్దుకుని బయల్దేరు’ అని చెప్పేవాడిని.బుద్ధి నేర్పించాలినువ్వసలు పాకిస్తాన్ తరఫున ఇంకా పూర్తిస్థాయిలో క్రికెట్ ఆడనేలేదు. ఇప్పుడే ఇలా అసభ్యకరమైన రీతిలో ప్రత్యర్థి జట్టు ఆటగాడిని దూషిస్తావా? ఇదేం ప్రవర్తన? నువ్వేమైనా హ్యాట్రిక్ హీరోవా? ఇంకా నీ బౌలింగ్‌పై ఎవరికీ అవగాహనే లేదు. అప్పుడే ఇలాంటి ప్రవర్తనా? మేనేజ్మెంట్ యువ ఆటగాళ్లకు కాస్త బుద్ధి నేర్పించాలి.ప్రత్యర్థి జట్టును గౌరవించాలనే సంస్కారం నేర్పించండి’’ అని పీసీబీకి హితవు పలికాడు. కాగా పాకిస్తాన్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి.. భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించిన అన్షుల్ కాంబోజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.చదవండి: WTC 2023-25 Points Table: న్యూజిలాండ్ చేతిలో ఓటమి.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..?WATCH:SUFIYAN MUQEEM ASKED ABHISHEK SHARMA TO LEAVE THE GROUND#INDvPAK #EmergingAsiaCup2024 pic.twitter.com/RJHOLCULYc— Junaid (@ccricket713) October 19, 2024 -
పాక్‌పై విజయం.. భారత్ ‘ఎ’ శుభారంభం
అల్ అమ్రత్: ఎమర్జింగ్ కప్ ఆసియా టి20 క్రికెట్ టోర్నమెంట్లో భారత ‘ఎ’ జట్టు శుభారంభం చేసింది. ఒమన్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో దాయాది పాకిస్తాన్‌పై భారత్ విజయాన్ని అందుకుంది. గ్రూప్ ‘బి’లో భాగంగా శనివారం జరిగిన పోరులో ‘ఎ’జట్టు 7 పరుగుల తేడాతో పాకిస్తాన్ షహీన్స్ జట్టుపై గెలుపొందింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. యువ భారత జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ (35 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా... ఓపెనర్లు అభిషేక్ శర్మ (22 బంతుల్లో 35; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (19 బంతుల్లో 36; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. ఓపెనర్లు ఆకట్టుకోవడంతో పవర్‌ప్లే ముగిసేసరికి భారత జట్టు వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసింది. ఆ తర్వాత ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పరుగుల రాక మందగించినా... చివర్లో తిలిక్ వర్మ ధాటిగా ఆడి జట్టుకు మంచి స్కోరు అందించాడు. నేహల్ వధేరా (25; 2 ఫోర్లు, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. పాకిస్తాన్ షహీన్స్ బౌలర్లలో సూఫియన్ ముఖీమ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అరాఫత్ మిన్హాస్ (29 బంతుల్లో 41; 5 ఫోర్లు, ఒక సిక్సర్), యాసిర్ ఖాన్ (22 బంతుల్లో 33; ఒక ఫోర్, 3 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. ఖాసిమ్ అక్రమ్ (27), అబ్దుల్ సమద్ (25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. విజయానికి చివరి రెండు ఓవర్లలో 24 పరుగులు అవసరమైన దశలో పాకిస్తాన్ షహీన్స్ జట్టు 16 పరుగులకే పరిమితమై పరాజయం వైపు నిలిచింది. భారత బౌలర్లలో అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లు పడగొట్టగా... రసిఖ్ సలామ్, నిషాంత్ సలామ్ చెరో రెండు వికెట్లు తీశారు. అన్షుల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. శనివారమే జరిగిన మరో మ్యాచ్‌లో యూఏఈ జట్టు 4 వికెట్ల తేడాతో ఒమన్‌పై గెలిచింది. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ తదుపరి మ్యాచ్‌లో భారత్ ‘ఎ’జట్టు సోమవారం యూఏఈతో తలపడనుంది. సంక్షిప్త స్కోర్లు భారత్ ‘ఎ’ఇన్నింగ్స్: 183/8 (తిలక్ వర్మ 44, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 36, అభిషేక్ శర్మ 35; సూఫియాన్ ముఖీమ్ 2/28), పాకిస్తాన్ షహీన్స్ ఇన్నింగ్స్: 176/7 (అరాఫత్ మిన్హాస్ 41, యాసిర్ ఖాన్ 33; అన్షుల్ కంబోజ్ 3/33, నిషాంత్ సింధు 2/15). -
Ind vs Pak: భారత్‌దే విజయం
ఏసీసీ మెన్స్ ట్వంటీ 20 ఎమర్జింగ్ ఆసియా కప్ 2024 టోర్నీలో భారత -A. జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ విసిరిన 184 పరుగుల లక్ష్య చేదనలో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులకే పరిమితమైంది. అంతకముందు భారత్- ‘ఎ’ మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రన్‌సింగ్ శుభారంభం అందించగా.. తిలక్ వర్మ కెప్టెన్ ఇన్నింగ్స్‌లో అలరించాడు.ఏసీసీ మెన్స్ టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2024లో భాగంగా భారత్- పాక్ యువ జట్టు ఒమన్‌లోని అల్ అమెరట్ వేదికగా శనివారం మ్యాచ్ ఆడుతున్నాయి. ఓపెనర్లు అభిషేక్ శర్మ 22 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 35 పరుగులు చేయగా.. ప్రభ్‌సిమ్రన్ సింగ్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు.ప్రభ్‌సిమ్రన్ ధనాధన్.. తిలక్ కెప్టెన్ ఇన్నింగ్స్కేవలం 19 బంతుల్లోనే 3 ఫోర్లు ,3 సిక్సర్ల సాయంతో 36 పరుగులు సాధించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన తిలక్ వర్మ 35 బంతుల్లో 44 పరుగులతో రాణించగా.. నేహల్ వధేరా(22 బంతుల్లో 25) ఫర్వాలేదనిపించాడు. మిగిలిన వాళ్లలో రమణ్‌దీప్ సింగ్(17) ఒక్కడే సింగిల్ డిజిట్ స్కోరు దాటాడు. ఆయుశ్ బదోని(2), నిషాంత్ సంధు(6), అన్షుల్ కాంబోజ్(0), రాహుల్ చహర్(4*), రసిద్ దార్ సలాం(6*) కనీసం పోరాట పటిమ ప్రదర్శించలేదు.ఇక పాక్ బౌలర్లలో ఇమ్రాన్, జమాన్ ఖాన్, మిన్హాస్, కాసిం అక్రం ఒక్కో వికెట్ తీయగా.. సూఫియాన్ ముకీమ్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. కాగా భారత టాపార్డర్ రాణించిన కారణంగా పాకిస్తాన్‌కు తిలక్ సేన 184 పరుగుల లక్ష్యాన్ని విధించగలిగింది.భారత్- ‘ఎ’ వర్సెస్ పాకిస్తాన్- ‘ఎ’ప్లేయింగ్ ఎలెవన్ఇండియాఅభిషేక్ శర్మ, ప్రభ్ సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), రమణ్‌దీప్ సింగ్, అన్షుల్ కాంబోజ్, తిలక్ వర్మ(కెప్టెన్), ఆయుష్ బదోని, నేహాల్ వధేరా, నిశాంత్ సింధు, రాహుల్ చాహర్, రసిక్ దార్ సలామ్, వైభవ్ అరోరా.పాకిస్తాన్హైదర్ అలీ, మహ్మద్ హారిస్(కెప్టెన్), యాసిర్ ఖాన్, ఒమైర్ యూసుఫ్, ఖాసీం అక్రమ్, అబ్దుల్ సమద్, అరాఫత్ మిన్హాస్, అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ ఇమ్రాన్, జమాన్ ఖాన్, సూఫియాన్ ముకీమ్.చదవండి: Ind vs NZ: అయ్యో పంత్! .. నీకే ఎందుకిలా?