తిలక్ వర్మ (PC: ACC/BCCI)
ఏసీసీ మెన్స్ ట్వంటీ 20 ఎమర్జింగ్ ఆసియా కప్ 2024 టోర్నీలో భారత -A. జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ విసిరిన 184 పరుగుల లక్ష్య చేదనలో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులకే పరిమితమైంది. అంతకముందు భారత్- ‘ఎ’ మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రన్‌సింగ్ శుభారంభం అందించగా.. తిలక్ వర్మ కెప్టెన్ ఇన్నింగ్స్‌లో అలరించాడు.
ఏసీసీ మెన్స్ టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2024లో భాగంగా భారత్- పాక్ యువ జట్టు ఒమన్‌లోని అల్ అమెరట్ వేదికగా శనివారం మ్యాచ్ ఆడుతున్నాయి. ఓపెనర్లు అభిషేక్ శర్మ 22 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 35 పరుగులు చేయగా.. ప్రభ్‌సిమ్రన్ సింగ్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు.
ప్రభ్‌సిమ్రన్ ధనాధన్.. తిలక్ కెప్టెన్ ఇన్నింగ్స్
కేవలం 19 బంతుల్లోనే 3 ఫోర్లు ,3 సిక్సర్ల సాయంతో 36 పరుగులు సాధించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన తిలక్ వర్మ 35 బంతుల్లో 44 పరుగులతో రాణించగా.. నేహల్ వధేరా(22 బంతుల్లో 25) ఫర్వాలేదనిపించాడు. మిగిలిన వాళ్లలో రమణ్‌దీప్ సింగ్(17) ఒక్కడే సింగిల్ డిజిట్ స్కోరు దాటాడు. ఆయుశ్ బదోని(2), నిషాంత్ సంధు(6), అన్షుల్ కాంబోజ్(0), రాహుల్ చహర్(4*), రసిద్ దార్ సలాం(6*) కనీసం పోరాట పటిమ ప్రదర్శించలేదు.
ఇక పాక్ బౌలర్లలో ఇమ్రాన్, జమాన్ ఖాన్, మిన్హాస్, కాసిం అక్రం ఒక్కో వికెట్ తీయగా.. సూఫియాన్ ముకీమ్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. కాగా భారత టాపార్డర్ రాణించిన కారణంగా పాకిస్తాన్‌కు తిలక్ సేన 184 పరుగుల లక్ష్యాన్ని విధించగలిగింది.
భారత్- ‘ఎ’ వర్సెస్ పాకిస్తాన్- ‘ఎ’ప్లేయింగ్ ఎలెవన్
ఇండియా
అభిషేక్ శర్మ, ప్రభ్ సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), రమణ్‌దీప్ సింగ్, అన్షుల్ కాంబోజ్, తిలక్ వర్మ(కెప్టెన్), ఆయుష్ బదోని, నేహాల్ వధేరా, నిశాంత్ సింధు, రాహుల్ చాహర్, రసిక్ దార్ సలామ్, వైభవ్ అరోరా.
పాకిస్తాన్
హైదర్ అలీ, మహ్మద్ హారిస్(కెప్టెన్), యాసిర్ ఖాన్, ఒమైర్ యూసుఫ్, ఖాసీం అక్రమ్, అబ్దుల్ సమద్, అరాఫత్ మిన్హాస్, అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ ఇమ్రాన్, జమాన్ ఖాన్, సూఫియాన్ ముకీమ్.
Comments
Please login to add a commentAdd a comment