ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టీ20 టోర్నీ విజేతగా ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్టు అవతరించింది. నిన్న (అక్టోబర్ 27) జరిగిన ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్-ఏ శ్రీలంక-ఏపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. బిలాల్ సమీ (4-0-22-3), అల్లా ఘజన్‌ఫర్ (4-0-14-2) అద్భుతంగా బౌలింగ్ చేసి శ్రీలంకను కట్టడి చేశారు.
THE HISTORIC MOMENT.
- Afghanistan wins the Emerging Asia Cup. 🥶pic.twitter.com/vwiX4xaE6o— Mufaddal Vohra (@mufaddal_vohra) October 27, 2024
శ్రీలంక ఇన్నింగ్స్‌లో సహన్ అరచ్చిగే (64 నాటౌట్) అజేయ అర్ద సెంచరీతో రాణించగా.. పవన్ రత్నాయకే (20), నిమేశ్ విముక్తి (23) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. యశోధ లంక (1), లహీరు ఉదార (5), నువనిదు ఫెర్నాండో (4), అహన్ విక్రమసింఘే (4), రమేశ్ మెండిస్ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. దుషన్ హేమంత 6 పరుగులతో అజేయంగా నిలిచాడు. పవన్ రత్నాయకే, నిమేశ్ విముక్తి రనౌటయ్యారు.
THE CELEBRATIONS OF AFGHANISTAN TEAM WITH EMERGING ASIA CUP TROPHY..!!! 🏆
- A Historic Moments for Afghanistan Cricket History. 🇦🇫 pic.twitter.com/NctY2q9yvO— Tanuj Singh (@ImTanujSingh) October 27, 2024
అనంతరం 134 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీయాలకు చేరింది. సెదికుల్లా అటల్ (55 నాటౌట్) అజేయ అర్ద సెంచరీతో ఆఫ్ఘనిస్తాన్‌ను గెలిపించాడు. అతనికి కరీం జనత్ (33), కెప్టెన్ దర్విష్ రసూలీ (24), మహ్మద్ ఇషాక్ (16 నాటౌట్) సహకరించారు.
Happy team, Happy moments to cherish 👏pic.twitter.com/Cmhas0L9zY
— CricTracker (@Cricketracker) October 27, 2024
లంక బౌలర్లలో సహన్ అరచ్చిగే, దుషన్ హేమంత, ఎషాన్ మలింగ తలో వికెట్ పడగొట్టారు. ఫైనల్లో అద్భుతమైన స్పెల్‌తో (4-0-14-2) శ్రీలంకను కట్టడి చేసిన అల్లా ఘజన్‌ఫర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. టోర్నీ ఆధ్యంతం అద్భుతంగా రాణించిన సెదికుల్లా అటల్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా ఎంపికయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment