మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా డంబుల్లా వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంక 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. ఆఫ్ఘన్ బౌలర్లు ఫజల్ హక్ ఫారూకీ (4-0-25-3), నవీన్ ఉల్ హక్ (3-0-25-2), అజ్మతుల్లా (4-0-30-2) నూర్ అహ్మద్ (2-0-18-1), కరీం జనత్ (2-0-23-1) ధాటికి 19 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది.
లంక ఇన్నింగ్స్‌లో హసరంగ (32 బంతుల్లో 67; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. సమరవిక్రమ (25), ధనంజయ డిసిల్వ (24), కుశాల్ మెండిస్ (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. నిస్సంక (6), అసలంక (3), షనక (6), మాథ్యూస్ (6), తీక్షణ (2), ఫెర్నాండో (0) విఫలమయ్యారు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ చివరి వరకు పోరాడినప్పటికీ విజయం సాధించలేకపోయింది. ఆ జట్టు లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (67 నాటౌట్) చివరివరకు క్రీజ్‌లో ఉన్నప్పటికీ గెలిపించలేకపోయాడు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో జద్రాన్‌తో పాటు రహ్మానుల్లా గుర్బాజ్ (13), గుల్బదిన్ నైబ్ (16), కరీం జనత్ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.
అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (2), మొహమ్మద్ నబీ (9), నజీబుల్లా జద్రాన్ (0), కైస్ అహ్మద్ (7), నూర్ అహ్మద్ (9), నవీన్ ఉల్ హక్ (1) విఫలమయ్యారు. లంక బౌలర్లలో మతీశ పతిరణ (4-0-24-4) నిప్పులు చెరిగే బంతులు సంధించడంతో పాటు వికెట్లు తీసి ఆఫ్ఘన్ల పతనాన్ని శాశించాడు. దసున్ షనక (2/17), హసరంగ (1/20), తీక్షణ (1/31), మాథ్యూస్ (1/16) కూడా వికెట్లు తీశారు.
Comments
Please login to add a commentAdd a comment