ఏసీసీ మెన్స్ టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024 టోర్నీలో భాగంగా పసికూన యూఏఈతో ఇవాళ (అక్టోబర్ 21) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. యూఏఈని 107 పరుగులకే (16.5 ఓవర్లలో) కుప్పకూల్చింది. టీమిండియా పేసర్ రసిఖ్ సలామ్ ఐదు బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీసి యూఏఈని చావుదెబ్బ కొట్టాడు. అనంతరం రమణ్‌దీప్ సింగ్ రెండు ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టాడు.
అన్షుల్ కంబోజ్, వైభవ్ అరోరా, అభిషేక్ శర్మ, నేహల్ వధేరా తలో వికెట్ దక్కించుకున్నారు. యూఏఈ ఇన్నింగ్స్‌లో రాహుల్ చోప్రా ఒక్కడే ఒంటరిపోరాటం చేశాడు. రాహుల్ 50 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. యూఏఈ ఇన్నింగ్స్‌లో రాహుల్‌తో పాటు కెప్టెన్ బాసిల్ హమీద్ (12 బంతుల్లో 22; ఫోర్, 2 సిక్సర్లు), మయాంక్ రాజేశ్ కుమార్ (5 బంతుల్లో 10; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ఒమిద్ రెహ్మాన్ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (8; సిక్స్) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 100 పరుగులు చేయాల్సి ఉంది. కాగా, భారత్ ఈ టోర్నీలో జరిగిన తమ ఓపెనింగ్ మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌పై ఏడు పరుగుల తేడాతో గెలుపొందింది.
చదవండి: ఇంగ్లండ్ కెప్టెన్‌గా లియామ్ లివింగ్‌స్టోన్
Comments
Please login to add a commentAdd a comment