జనన వివరాల నమోదుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ కీలక మార్పులు చేయనుంది. కొత్తగా పుట్టిన శిశువుల తల్లిదండ్రులు ప్రస్తుతం ఉన్న 'కుటుంబ మతం' డిక్లరేషన్‌కు భిన్నంగా ప్రతిపాదిత బర్త్ రిపోర్ట్‌లో తమ మతాన్ని వేరువేరుగా, వ్యక్తిగతంగా నమోదు చేయాల్సి ఉంటుందని ‘ది హిందూ’ నివేదించింది.
ఈ కథనం ప్రకారం.. కొత్త ఫారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మోడల్ రూల్స్‌కు అనుగుణంగా ఉంది. దీన్ని అమలులోకి తెచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలి. ఆయా ప్రభుత్వాలు దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. కాగా దత్తత తీసుకునే తల్లిదండ్రులకు కూడా ఇదే వర్తిస్తుంది. వారు కూడా తమ మతాన్ని వ్యక్తిగతంగా నమోదు చేయాలి.
జననాలు, మరణాల రికార్డుల భద్రత కోసం జాతీయ స్థాయి డేటాబేస్ ఏర్పాటు చేస్తారు. ఆధార్ నంబర్లు, ఆస్తి రిజిస్ట్రేషన్లు, రేషన్ కార్డ్‌లు, ఎలక్టోరల్ రోల్స్, పాస్‌పోర్ట్‌లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR) సహా అనేక ఇతర డేటాబేస్‌లను రిఫ్రెష్ చేయడానికి ఈ డేటాబేస్ ఉపయోగపడుతుంది.
జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు-2023ను పార్లమెంటు ఉభయ సభలు గతేడాది ఆగస్టులో ఆమోదించాయి. దీని ప్రకారం.. 2023 అక్టోబర్ నుండి విద్యా సంస్థలలో నమోదు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు, ఆధార్ నంబర్ పొందడం, వివాహాల నమోదు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు వంటి వివిధ ముఖ్యమైనవాటికి జనన ధ్రువీకరణ పత్రాన్నే ఏకైక పత్రంగా గుర్తిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment