
నార్సింగి మున్సిపాలిటీ నుంచి జారీ
దీని ఆధారంగా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు
విచారణలో వెలుగు చూసిన వ్యవహారం
సిటీ టాస్‌్కపోర్స్ అదుపులో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి
మణికొండ: బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన ఓ యువకుడికి నార్సింగి మున్సిపాలిటీ నుంచి బర్త్ సర్టిఫికెట్ జారీ అయింది. దీని ఆధారంగా అతడు పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. వెరిఫికేషన్ నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి రావడంతో హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. నార్సింగి మున్సిపాలిటీలో పని చేస్తున్న ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగితో పాటు సదరు బంగ్లాదేశీయుడినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో ఇంకా ఎవరెవరు ఉన్నారనేదానిపై ఆరా తీస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నార్సింగి మున్సిపాలిటీ కార్యాలయంలో సుదీర్ అనే వ్యక్తి ఆరేళ్లుగా ఔట్‌సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నాడు.
దీనికి ముందు అతడు జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో పని చేశాడు. అధికారులు ఇతడికి జనన, మరణ ధ్రువీకరణ జారీ చేసే బాధ్యతలను అప్పగించారు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న సు«దీర్.. బంగ్లాదేశీయుడికి నార్సింగిలో జని్మంచిన వ్యక్తిగా జనన ధ్రువీకరణ పత్రం జారీ చేశాడు. దాదాపు రెండేళ్ల క్రితం ఈ పత్రం తీసుకున్న బంగ్లాదేశ్ యువకుడు ఇటీవల పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో జరిగిన పోలీసు వెరిఫికేషన్‌లో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన టాస్‌్కఫోర్స్ పోలీసులు సుదీర్‌తో పాటు సదరు బంగ్లాదేశీని అదుపులోకి తీసుకున్నారు.
మరింత లోతుగా విచారణ
మున్సిపల్ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న సు«దీర్ రెండు సంవత్సరాల క్రితం ఒకరికి అప్పటి కమిషనర్ సత్యబాబు డిజిటల్ సంతకంతో జనన ధ్రువీకరణ పత్రం జారీ చేసినట్టు తెలిసింది. అది నకిలీదని, దానిపై విచారణ చేస్తున్నామని, అతన్ని అదుపులోకి తీసుకుంటున్నామని టాస్‌్కఫోర్స్ పోలీసులు తెలిపారు. అతను చేసిన అక్రమాలన్నింటినీ వెలుగులోకి తేవాలని, విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని వారికి చెప్పాను. అవసరమైతే మరింత లోతుగా విచారణ చేయాలని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసే విషయాన్ని పరిశీలిస్తాం.
– టి. కృష్ణమోహన్‌రెడ్డి, కమిషనర్, నార్సింగి మున్సిపాలిటీ