నార్సింగి కేసులో కీలక మలుపు.. 50 మంది సెలబ్రిటీల గుర్తింపు! | Narsingi Case: Cyberabad Police Identify 30 More Celebrities | Sakshi
Sakshi News home page

నార్సింగి కేసులో కీలక మలుపు.. 50 మంది సెలబ్రిటీల గుర్తింపు!

Published Tue, Jul 30 2024 11:06 AM | Last Updated on Wed, Jul 31 2024 4:10 PM

Narsingi Case: Cyberabad Police Identify 30 More Celebrities

హైదరాబాద్‌, సాక్షి: నార్సింగి డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో మరికొందరు ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాళ్లందరికీ నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని భావిస్తున్నారు. ఈ కేసులో ప్రముఖ నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సోదరుడు అమన్‌ సైతం అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. 

నార్సింగి డ్రగ్స్‌ కేసులో అమన్‌ సహా పలువురిని జులై 15వ తేదీన జాయింట్‌ ఆపరేషన్‌తో అరెస్ట్‌ చేశారు. వాళ్లు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ టైంలో 19 మంది ప్రముఖులకు పోలీసులు నోటీసులు పంపించారు. తాజాగా.. నిందితులు మరో 30 మంది సెలబ్రిటీల పేర్లు వెల్లడించారు. ఇందులో ప్రముఖ కంపెనీల యాజమానులు సైతం ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ కేసులో సెలబ్రిటీల సంఖ్య 50కి చేరినట్లయ్యింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement