![Telangana Police Department Alert On Developments In Bangladesh](/styles/webp/s3/article_images/2024/08/10/Telangana-Police-Department.jpg.webp?itok=Xz_Z-XEK)
సాక్షి, హైదరాబాద్: బంగ్లాదేశ్ పరిణామాలపై తెలంగాణ పోలీస్‌శాఖ అలర్ట్ అయ్యింది. బంగ్లాదేశ్ ఉద్రిక్తత పరిస్థితులపై హైదరాబాద్‌లో పోలీసులు నిఘా ఉంచారు. హైదరాబాద్‌లో ఉన్న బంగ్లాదేశీయులపై నిఘా పెట్టారు. హైదరాబాద్‌కి అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల ప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీపీ జితేందర్ వెల్లడించారు.
ఎలాంటి పరిణామాలనైన ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సిద్ధంగా ఉందన్న డీజీపీ.. బాలాపూర్ పరిధిలో ఐదువేల మందికిపైగా రోహింగ్యాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో వారికి గుర్తింపు కార్డులు వచ్చాయని సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఇతర దేశాల నుండి వచ్చే వారిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని.. అలాగే, రాచకొండ కమిషనరేట్ పరిధిలో నివసిస్తున్న రోహింగ్యాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని సీపీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment