
సాక్షి,హైదరాబాద్: బంగ్లాదేశ్ పరిణామాలపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన హ్యాకథాన్-2024 కార్యక్రమాన్ని డీజీపీ శుక్రవారం ప్రారంభించారు.
‘బంగ్లాదేశ్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్‌లో కూడా నిఘా పెట్టాం. బంగ్లాదేశీయులు హైదరాబాద్‌కు అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటాం. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీసులు సిద్ధంగా ఉన్నారు’అని డీజీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment