సాక్షి,హైదరాబాద్:ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ టీమ్‌తో విచారణ చేస్తున్నామని,కోర్టు పరిధిలో ఉన్నందున ఈ విషయంపై తాను కామెంట్ చేయలేనని డీజీపీ జితేందర్ అన్నారు. ట్యాపింగ్ కేసుపై మంగళవారం(సెప్టెంబర్24) జితేందర్ మీడియాతో మాట్లాడారు.
‘ట్యాపింగ్ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున నేను కామెంట్ చేయలేను.ప్రభాకర్ రావు,శ్రవణ్ రావుకు రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వడానికి కొంత సమయం పట్టింది.రెడ్ కార్నర్ నోటీసుల కోసం ఇంటర్ పోల్‌కి లేఖ రాశాం.సీబీఐకి రాగానే రెడ్ కార్నర్ నోటీస్ జారీ అవుతుంది’అని తెలిపారు.
గణేష్ ఉత్సవాల్లో డీజే సౌండ్స్ ఇబ్బంది పెట్టాయి.. డీజీపీ
నగరంలో ఇటీవల గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి ఉత్సవాలు విజయవంతంగా పూర్తిచేశామని డీజీపీ జితేందర్ తెలిపారు. పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు చెప్పారు. నిమజ్జనం కోసం అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేశాయన్నారు.ట్రైనీ ఎస్సైలు , కానిస్టేబుళ్లు 12వేల మంది సిబ్బంది పాల్గొన్నారని చెప్పారు.
గణేష్ ఉత్సవాల్లో డీజేల ఏర్పాటు, శబ్ద కాలుష్యం కొంత నగర వాసులను ఇబ్బంది పెట్టిందన్నారు. డీజేల విషయంలో త్వరలో మార్గదర్శకాలు విడుదలచేస్తామని చెప్పారు. వినికిడి సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నందున జాగ్రత్త వహించాలని డీజీపీ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment