సాక్షి, హైదరాబాద్: తత్కాల్ పథకం కింద పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త. ఇకపై ఐఏఎస్/ఐపీఎస్ అధికారుల అటెస్టేషన్ లేకుండానే పాస్‌పోర్టు పొందవచ్చు. ఆధార్/ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్, స్వీయ ధ్రువీకరణ పత్రంతో పాటు కేంద్రం సూచించి న 12 రకాల పత్రాల్లో ఏవైనా రెండు జత చేసి పాస్‌పోర్టు రుసుము రూ.1,500, అదనంగా తత్కాల్ రుసుము రూ.2 వేలు చెల్లిస్తే మరుసటి రోజు నుంచి గరిష్టంగా 3 రోజుల్లోగా పాస్‌పోర్టు జారీ కానుంది. ఈ మేరకు ‘తత్కాల్’ కింద పాస్ పోర్టుల జారీని సరళీకరిస్తూ విదేశాంగ శాఖ జనవరి 11న గెజిట్ ప్రకటన జారీ చేసిందని ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాధారణ పథకం కింద తక్కువ సమయంలో (ఔట్ ఆఫ్ టర్న్) పాస్‌పోర్టు జారీకి పై విధానంలో దరఖాస్తు చేసుకుంటే 3 నుంచి వారం రోజుల్లో పాస్‌పోర్టు జారీ చేస్తామన్నా రు. పై రెండు విధానాల కింద దరఖాస్తు అంది న వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తామని, పాస్‌పో ర్టు జారీ చేసిన తర్వాత పోలీస్ వెరిఫికేషన్ జరిపిస్తామని చెప్పారు. అటెస్టేషన్ పొందడం లో గ్రామీణ, చిన్న పట్టణాల ప్రజలు ఇబ్బం దులు ఎదుర్కొంటుండటంతో ఆ విధానాన్ని కేంద్రం తొలగిం చిందని పేర్కొన్నారు.
మరో 4 కేంద్రాలు..
తొలి విడత కింద వరంగల్, మహబూబ్‌నగర్ పట్టణాల్లో పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రా లు ఏర్పాటు చేశారని.. రెండో విడత కింద నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్, సిద్దిపేట, మెదక్ జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ చివరిలోగా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని విష్ణువ ర్ధన్‌రెడ్డి తెలిపారు. వరంగల్, మహబూబ్ నగర్‌లలోని కేంద్రాల ద్వారా గత ఏప్రిల్ నుం చి ఇప్పటివరకు 15,470 పాస్‌పోర్టులు జారీ చేశామని చెప్పారు. హైదరాబాద్‌లో విదేశీ భవన్ నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయిం చిన వెంటనే నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. భవన్ ద్వారా విదేశాంగ శాఖ ప్రాంతీయ కార్యాలయం సహా పాస్‌పోర్టు తదితర కార్యాలయాలు ఒకే గొడుగు కిందకొస్తాయన్నారు.
12 రకాల పత్రాలివే..
12 రకాల పత్రాల్లో ఓటరు గుర్తింపు కార్డు.. కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ, స్థానిక సంస్థలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసే ఉద్యోగుల గుర్తింపు కార్డు, ఎస్టీ/ఎస్సీ/ఓబీసీ సర్టిఫికెట్, ఆయుధ లైసెన్స్, పెన్షన్ పత్రాలు, సెల్ఫ్ పాస్‌పోర్టు, పాన్‌కార్డు, బ్యాంక్/కిసాన్/పోస్టాఫీస్ పాస్ బుక్, విద్యా సంస్థలు జారీ చేసే విద్యార్థి గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, జనన ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డులు ఉన్నాయి.
మళ్లీ అగ్రస్థానంలో..
పాస్‌పోర్టుల జారీలో హైదరాబాద్ లోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం వరుసగా మూడో ఏడాది దేశంలో నంబర్ వన్‌గా నిలిచిందని విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపా రు. దరఖాస్తుల పరిశీలన, పోలీస్ వెరిఫి కేషన్ తదితరాలు పూర్తి చేసి పాస్‌పోర్టు జారీ చేసేందుకు దేశంలో సగటున 23 రోజులు అవుతుండగా, రాష్ట్రంలో 4 రోజుల్లోనే జారీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 2017 లో 5.89 లక్షల దరఖాస్తులొస్తే 5.87 లక్షలు.. 2016లో 6.64 దరఖాస్తులకు 6.53 లక్షల పాస్‌పోర్టులు జారీ చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment