హైదరాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి అవార్డులు | Hyderabad Regional Passport Office Gets National Award | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి అవార్డులు

Jun 20 2018 5:46 PM | Updated on Sep 4 2018 5:44 PM

Hyderabad Regional Passport Office Gets National Award - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 2017-18 సంవత్సరానికిగాను తెలంగాణకు పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌, పాస్‌పోర్ట్‌ జారీలో అవార్డులు లభించాయని రీజనల్‌ పాస్‌పోర్ట్‌ అధికారి విష్ణువర్ధన్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే ఉత్తమ పోలీసు వెరిఫికేషన్‌గా తెలంగాణ గుర్తింపు పొందిదన్నారు. ఏ కేటగిరిలో పాస్‌పోర్ట్‌ జారీలో హైదరాబాద్‌ పాస్‌పోర్ట్‌ ఆఫీసుకు మొదటి స్థానం లభించిందని తెలిపారు. చాలా సంవత్సరాల తరువాత కేటగిరి పాస్‌పోర్ట్‌ జారీలో మొదటి అవార్డు వచ్చిందన్నారు. 

దేశంలో ఎక్కడాలేని విధంగా పాస్‌పోర్ట్‌ను తొందరలో జారీ చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా సగటున 21 రోజుల్లో పాస్‌పోర్ట్ జారీ చేస్తే.. తెలంగాణలో మాత్రం కేవలం నాలుగు రోజుల్లోనే వెరిఫికేషన్‌ పూర్తిచేసి పాస్‌పోర్ట్‌ జారీ చేస్తున్నామని తెలిపారు. పోలీసు వెరిఫికేషన్‌లో కొత్త రూల్స్‌ అమలులోకి వచ్చాయన్నారు. ఈ నెల 26న పాస్‌పోర్ట్‌ సేవా దివాస్‌ సందర్భంగా కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement