నెలాఖరు లోపు పాస్‌పోర్టు కార్యాలయం ప్రారంభించాలి | passport office should open within month end | Sakshi
Sakshi News home page

నెలాఖరు లోపు పాస్‌పోర్టు కార్యాలయం ప్రారంభించాలి

Published Mon, Mar 13 2017 11:41 PM | Last Updated on Thu, Aug 9 2018 8:15 PM

నెలాఖరు లోపు పాస్‌పోర్టు కార్యాలయం ప్రారంభించాలి - Sakshi

నెలాఖరు లోపు పాస్‌పోర్టు కార్యాలయం ప్రారంభించాలి

– పాస్‌పోర్టు అధికారులతో ఎంపీ బుట్టా రేణుక
 
కర్నూలు(ఓల్డ్‌సిటీ): ఈ నెలాఖరు లోపు అని​‍్న సదుపాయాలతో కర్నూలులో పాస్‌పోర్టు సేవా కేంద్రం ప్రారంభించాలని పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక సూచించారు. ఎంపీ సోమవారం తన క్యాంప్‌ కార్యాలయంలో పాస్‌పోర్టు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పాస్‌పోర్టు సేవా కేంద్రం మూడు జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని  ఏర్పాట్లను త్వరగా పూర్తిచేయాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ పాస్‌పోర్టు అధికారి ఎ.కె.మిశ్రా, వైజాగ్‌ పాస్‌పోర్టు కార్యాలయ సూపరింటెండెంట్‌ కల్యాణ్, కర్నూలు డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ కె.వి.సుబ్బారావు, అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ సి.హెచ్‌.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement