అసలుకు భరోసా.. భవిత కులాసా.. | - | Sakshi
Sakshi News home page

అసలుకు భరోసా.. భవిత కులాసా..

Published Sat, Dec 28 2024 3:18 AM | Last Updated on Sat, Dec 28 2024 12:14 PM

అసలుక

అసలుకు భరోసా.. భవిత కులాసా..

బాలిక, మహిళల కోసం పోస్టల్‌ పథకాలు

ఆకర్షణీయంగా సుకన్య సమృద్ధి యోజన

గడువు ముగియనున్న మహిళా సమ్మాన్‌

రాజమహేంద్రవరం సిటీ: బాలికల, మహిళల ఆర్థిక పురోభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం తపాలాశాఖ ద్వారా పొదుపు పథకాలను ప్రవేశ పెట్టింది. బాలికలకు సుకన్య సమృద్ధి యోజన, మహిళలకు మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ పథకాన్ని అమలు చేస్తోంది. పొదుపు చేసిన సొమ్ముకు భద్రతతో పాటు ఈ రెండు పథకాలు బాలికలకు, మహిళలకు భరోసానిచ్చే విధంగా ఉన్నాయి. మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ పథకంలో అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి మహిళలందరూ ఈ పథకంలో చేరేందుకు అవకాశం కల్పించింది. 2025 మార్చి 31 మాత్రమే అమల్లో ఉండే ఈ స్కీమ్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు డ్రైవ్‌లు నిర్వహించేందుకు తపాలా శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ పథకంలో రూ.1,000 నుంచి రూ.2 లక్షల వరకు డిపాజిట్‌కు అవకాశం ఉంది.

వన్‌ టైమ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌
మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ పథకం వన్‌ టైమ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌గా కొనసాగుతుంది. గరిష్ట మొత్తానికి రూ.2లక్షల లోబడి ఎన్ని ఖాతాలైనా తెరిచే అవకాశాన్ని కల్పించింది. ఇప్పటికే ఖాతా ఉంటే కనీసం మూడు నెలల విరామంతో మళ్లీ ఖాతా తెరవవచ్చు. సేవింగ్స్‌ ఖాతా ప్రారంభించిన తేదీ నుంచి రెండేళ్లు పూర్తయిన తర్వాత మెచ్యూరిటీ కింద డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉంది. వడ్డీ రేటు మాత్రం ఏడాదికి 7.5 శాతం ఉంటుంది. ఒకరి పేరుతోనే ఖాతా తెరవాలి. జాయింట్‌ అకౌంట్‌ సౌకర్యం లేదు. మైనర్‌ అయితే గార్డియన్‌ ద్వారా డిపాజిట్‌ చేసుకునే వీలుంటుంది.

స్కీమ్‌లో చేరే విధానం
మహిళా సమ్మాన్‌ సేవింగ్‌ సర్టిఫికెట్‌ స్కీమ్‌లో చేరే లబ్ధిదారులు ఆధార్‌, పాన్‌ కార్డు, మూడు పాస్‌ పోర్టు సైజు ఫొటోలు తీసుకుని దగ్గరలోని పోస్టాఫీసుకు వెళ్లి ఖాతా ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ కింద డిపాజిట్‌ చేసిన వారు ఏడాది తర్వాత 40 శాతం డబ్బు ఉపసంహరించుకునే అవకాశముంది. ఒకవేళ డిపాజిట్‌దారులు మృతి చెందితే కారుణ్యం కింద ఖాతా మూసేయవచ్చు. ఎవరైనా మృతి చెందితే తదుపరి నామినీకి ఆ మొత్తాన్ని చెల్లిస్తారు. అవసరాన్ని బట్టి రెండు శాతం తగ్గించుకుని (5.5 శాతం వడ్డీతో)ఆరు నెలల తర్వాత ఎప్పుడైనా ఖాతాను మూసేయవచ్చు.

సుకన్య సమృద్ధి యోజన
ఈ పథకంలో చేరేందుకు 10 సంవత్సరాల లోపు బాలికలు అర్హులు, కనీసం రూ.250 డిపాజిట్‌తో ఆడపిల్ల పుట్టినప్పుడు ఖాతా తెరిచి, ప్రతీ నెలకు కనీసం వంద రూపాయలు పొదుపు చేస్తే, తల్లిదండ్రుల మొత్తం పెట్టుబడి రూ.18,000 (15 సంవత్సరాలకు) పెడితే వారికి మెచ్యూరిటీగా (21 సంవత్సరాల తర్వాత) రూ. 53,945 తపాలాశాఖ అందిస్తుంది.

మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌లో సొమ్ము పెరిగేది ఇలా (రూ.లలో) ..

అవగాహన కల్పిస్తున్నాం
రాజమహేంద్రవరం పోస్టల్‌ డివిజన్‌ పరిధిలో రెండు హెడ్‌ పోస్టాఫీసులు (రాజమహేంద్రవరం, రామచంద్రపురం) 63 సబ్‌ పోస్టాఫీసులు, 307 బ్రాంచి పోస్టాఫీసులు ఉన్నాయి. ఈ పోసాŠీట్ఫసుల పరిధిలో ఇప్పటి వరకూ 7000 మంది మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ పథకంలో చేరారు. 60,000 మంది సుకన్య సమృద్ధి యోజనలో చేరారు. ఈ రెండు పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సుకన్య సమృద్ధి యోజనను ఆడపిల్లల తల్లిదండ్రులు సది్వనియోగం చేసుకోవాలి 

– కే.శేషారావు, రాజమహేంద్రవరం, పోస్టల్‌ సూపరింటెండెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
అసలుకు భరోసా.. భవిత కులాసా..1
1/2

అసలుకు భరోసా.. భవిత కులాసా..

అసలుకు భరోసా.. భవిత కులాసా..2
2/2

అసలుకు భరోసా.. భవిత కులాసా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement