
పోస్టాఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్‌ఎస్‌సీ) పథకాన్ని సురక్షితమైన, గ్యారెంటీ రాబడిని కోరుకునే వ్యక్తులు మంచి పెట్టుబడి ఎంపికగా చూస్తారు. ప్రభుత్వ పథకం కావడంతో రిస్క్ తక్కువగా ఉంటుందనే భావనే ఇందుకు కారణం. అయితే ఈ స్కీమ్‌లో ఎంత పెట్టుబడి పెడితే ఎంత మొత్తం సమకూరుతుందో చాలామందికి సరైన అవగాహన ఉండదు. దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడంతోపాటు ఈ పథకం కీలక అంశాలను కింద చూద్దాం.
పోస్టాఫీస్ ఎన్ఎస్‌సీ పథకం
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్‌సీ) అనేది భారతీయ తపాలా కార్యాలయం అందించే స్థిర ఆదాయ పెట్టుబడి పథకం. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద స్థిరమైన రాబడులు, పన్ను ప్రయోజనాల హామీతో చిన్న, మధ్యతరహా పెట్టుబడిదారులను పొదుపు చేయడానికి ప్రోత్సహించడానికి దీన్ని రూపొందించారు.
కీలక ఫీచర్లు..
రిస్క్‌లేని పెట్టుబడి: భారత ప్రభుత్వ మద్దతు ఉండడంతో ఎన్ఎస్‌సీను సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా పరిగణిస్తున్నారు.
ఫిక్స్‌డ్ వడ్డీ రేటు: వడ్డీ రేటును ఏటా ఫిక్స్ చేసి కాంపౌండ్ చేస్తారు. 2024 మొదటి త్రైమాసిక కాలం నాటికి వడ్డీ రేటు ఏడాదికి 7.7 శాతంగా ఉంది.
పన్ను ప్రయోజనాలు: రూ.1.5 లక్షల వరకు పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.
గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు: పెట్టుబడిదారులు ఎన్ఎస్‌సీలో చేసే ఇన్వెస్ట్‌మెంట్‌కు గరిష్ట పరిమితి లేదు. ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు.
చక్రవడ్డీ: వడ్డీని ఏటా తిరిగి పెట్టుబడిగా పెడతారు. ఇది మెచ్యూరిటీ సమయంలో అధిక రాబడిని అందిస్తుంది.
కనీస పెట్టుబడి: కనీస పెట్టుబడి మొత్తం రూ.1,000.
ఇదీ చదవండి: పేరు మార్చుకుంటే రూ.8,400 కోట్లు ఆఫర్!
ఐదేళ్ల తరువాత ఎంత వస్తుంది?
ఐదేళ్ల కాలపరిమితికి ఎన్ఎస్‌సీ పథకంలో పెట్టుబడి చేస్తే రూ.80,000 ఇన్వెస్ట్‌మెంట్‌కు మెచ్యూరిటీ మొత్తం కింది విధంగా ఉంటుంది.(రూ.ల్లో)
ఏడాది | అసలు | వడ్డీ | మొత్తం |
1 | 80,000 | 6,160 | 86,160 |
2 | 86,160 | 6,633 | 92,793 |
3 | 92,793 | 7,145 | 99,938 |
4 | 99,938 | 7,695 | 1,07,633 |
5 | 1,07,633 | 8,286 | 1,15,919 |
Comments
Please login to add a commentAdd a comment