లండన్: దేశంలో ద్రవ్యోల్బణం రెండంకెలకు ఎగబాకిందని, ధరలు పెరిగిపోతున్నాయని, తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)లో పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది సోమవారం సమ్మె ప్రారంభించారు. ఐదు రోజులపాటు ఈ సమ్మె కొనసాగనుంది. దీంతో విదేశాలకు వెళ్లాల్సినవారు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
పాస్‌పోర్ట్‌లు సకాలంలో అందకపోతే ప్రయాణాలు మానుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. యూకేలో ద్రవ్యోల్బణం 10.4 శాతానికి చేరుకుంది. ఆహారం, ఇంధనం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. జీవన వ్యయం భారీగా పెరిగిపోయింది. తక్షణమే వేతనాలు పెంచాలన్న డిమాండ్‌తో వైద్యులు, ఉపాధ్యాయులు, రైళ్లు, బస్సుల డ్రైవర్లు, ఎయిర్‌పోర్టుల్లో పనిచేసి సిబ్బంది, పోస్టల్ సిబ్బంది ఇదివరకే సమ్మెకు దిగారు.
మళ్లీ టీచర్ల సమ్మెబాట
యూకే ప్రభుత్వం ఆఫర్ చేసిన వేతన 4.5 శాతం పెంపు, 1,000 పౌండ్ల వన్‌టైమ్ చెల్లింపును టీచర్లు తిరస్కరించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 27, మే 2న సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్లు నేషనల్ ఎడ్యుకేషన్ యూనియన్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment