ఎట్టకేలకు భారతీయుడినని ఒప్పుకున్న గిలానీ | 'Not an Indian' Says Kashmiri Separatist Syed Ali Shah Geelani as He Applies for Passport | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు భారతీయుడినని ఒప్పుకున్న గిలానీ

Published Sat, Jun 6 2015 4:02 AM | Last Updated on Sun, Sep 3 2017 3:16 AM

ఎట్టకేలకు భారతీయుడినని ఒప్పుకున్న గిలానీ

ఎట్టకేలకు భారతీయుడినని ఒప్పుకున్న గిలానీ

శ్రీనగర్: వేర్పాటువాద నేత సయ్యద్ అలీషా గిలానీ ఎట్టకేలకు తాను భారతీయుడినని ఒప్పుకున్నారు. పాస్‌పోర్టుకోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆయన శుక్రవారం పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పాస్‌పోర్టు దరఖాస్తుపత్రంలో తాను భారతీయుడినని రాశారు. వేలిముద్రలు, ఐరిస్ వంటి బయోమెట్రిక్ వివరాలు అందజేశారు. ఈ హురియత్ నేత అస్వస్థతతో ఉన్న తన కుమార్తెను చూసేందుకు సౌదీఅరేబియా వెళ్లదలుచుకున్నారు.  

గిలానీ పాస్‌పోర్టు కార్యాలయం వెలుపల విలేకరులడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. తాను పుట్టుకతో భారతీయుడ్ని కాదని, కానీ తప్పడం లేదని, బలవంతంగా అయ్యానని అన్నారు. గిలానీ జాతీయత కాలమ్‌లో భారతీయుడినని రాయడాన్ని ఓ హురియత్ ప్రతినిధి సమర్థించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement