18 ఏళ్ల నర్తకి విశాఖ విజన్ 2020కి సహాయం చేయడానికి ఈ యేడాది నవంబర్ చివరిలో ఆస్ట్రేలియాలో భరతనాట్యాన్ని ప్రదర్శించింది. విశాఖ ప్రస్తుతం ప్రతిష్టాత్మక వాపా (వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్)లో బ్యాచిలర్ ఆఫ్ డ్యాన్స్ అభ్యసిస్తోంది. భారతదేశంలో చిదంబరం ఖసురేష్, షీజిత్ కృష్ణ, బ్రాగా బెస్సెల్‌ల వద్ద భరతనాట్యంలో శిక్షణ పొందింది.
ఆస్ట్రేలియాలో పుట్టిపెరిగిన విశాఖ భారతీయ నృత్యాన్ని జీవిత లక్ష్యంగా మార్చుకుంది. భారతీయ మూలాలుండటం వల్ల తనలో శాస్త్రీయ నృత్యం శ్వాసగా మారిపోయింది అంటోంది. ‘భావోద్వేగ మేల్కొలుపు – నవరస మోహన’ అనేది మన రోజువారీ పరస్పర చర్యలను ప్రభావితం చేసే, నిర్దేశించే భావోద్వేగాల తొమ్మిది వ్యక్తీకరణలపై ఆధారపడింది. వీటిని విశాఖ పుణికి పుచ్చుకుంది. సామాజిక మేల్కొలుపును కలిగించేలా ‘నిస్వార్ధ జీవి చెట్టు’ గురించి తన ప్రదర్శనలో వర్ణించింది.
113 ఏళ్ల వృద్ధురాలు తిమ్మక్క, చెట్లతో ఆమెకు ఉన్న అనుబంధం ఈ కథనంలో అల్లుకుపోయింది. కళా ప్రక్రియలలో విస్తరించిన అద్భుతమైన భాగంగా దీనిని చెప్పవచ్చు. ఇది సామాజిక సందేశాన్ని దాని ప్రధాన భాగంలో ప్రసారం చేయడంలో శైలులు, భాష, ఫార్మాట్‌లను మిళితం చేసింది. ఆహ్లాదకరంగా ఉండటంతోపాటు ఆలోచింపజేసేటటువంటి, ప్రక్రియలో సరిహద్దులను చెరిపేసింది.
‘భారతదేశంలో చెట్లను నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలనే అవగాహన, ప్రతి వ్యక్తి సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం.. ఎప్పుడూ మా ఇంట్లో ఒక మంత్రంగా ఉంటుంది. అందువల్ల ఈ నృత్యం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది’ అని చెబుతుంది విశాఖ. భారతీయ–ఆస్ట్రేలియన్ యువ కళాకారిణిగా ఆమె జీవితంలో భరతనాట్యానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో ఈ సందర్భంగా వివరించింది.
పాశ్చాత్య నృత్య సమాజంలో భరతనాట్య నర్తకిగా నన్ను బయటి వ్యక్తిగానే చూసేవారు. కానీ ఇప్పుడు అందరిచేత ‘నృత్యం ఆత్మ ప్రదర్శించే భాష, ఇది కేవలం సమకాలీనమైనది కాదు, ఇది శరీరం, ఆత్మ కదలిక’ అని చెబుతుంది విశాఖ.
(చదవండి: అత్యంత అరుదైన పెంగ్విన్..!)
Comments
Please login to add a commentAdd a comment