Vishakha
-
నృత్యంతో సేవ చేస్తున్న భారత సంతతి యువ కళాకారిణి
18 ఏళ్ల నర్తకి విశాఖ విజన్ 2020కి సహాయం చేయడానికి ఈ యేడాది నవంబర్ చివరిలో ఆస్ట్రేలియాలో భరతనాట్యాన్ని ప్రదర్శించింది. విశాఖ ప్రస్తుతం ప్రతిష్టాత్మక వాపా (వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్)లో బ్యాచిలర్ ఆఫ్ డ్యాన్స్ అభ్యసిస్తోంది. భారతదేశంలో చిదంబరం ఖసురేష్, షీజిత్ కృష్ణ, బ్రాగా బెస్సెల్ల వద్ద భరతనాట్యంలో శిక్షణ పొందింది.ఆస్ట్రేలియాలో పుట్టిపెరిగిన విశాఖ భారతీయ నృత్యాన్ని జీవిత లక్ష్యంగా మార్చుకుంది. భారతీయ మూలాలుండటం వల్ల తనలో శాస్త్రీయ నృత్యం శ్వాసగా మారిపోయింది అంటోంది. ‘భావోద్వేగ మేల్కొలుపు – నవరస మోహన’ అనేది మన రోజువారీ పరస్పర చర్యలను ప్రభావితం చేసే, నిర్దేశించే భావోద్వేగాల తొమ్మిది వ్యక్తీకరణలపై ఆధారపడింది. వీటిని విశాఖ పుణికి పుచ్చుకుంది. సామాజిక మేల్కొలుపును కలిగించేలా ‘నిస్వార్ధ జీవి చెట్టు’ గురించి తన ప్రదర్శనలో వర్ణించింది.113 ఏళ్ల వృద్ధురాలు తిమ్మక్క, చెట్లతో ఆమెకు ఉన్న అనుబంధం ఈ కథనంలో అల్లుకుపోయింది. కళా ప్రక్రియలలో విస్తరించిన అద్భుతమైన భాగంగా దీనిని చెప్పవచ్చు. ఇది సామాజిక సందేశాన్ని దాని ప్రధాన భాగంలో ప్రసారం చేయడంలో శైలులు, భాష, ఫార్మాట్లను మిళితం చేసింది. ఆహ్లాదకరంగా ఉండటంతోపాటు ఆలోచింపజేసేటటువంటి, ప్రక్రియలో సరిహద్దులను చెరిపేసింది.‘భారతదేశంలో చెట్లను నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలనే అవగాహన, ప్రతి వ్యక్తి సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం.. ఎప్పుడూ మా ఇంట్లో ఒక మంత్రంగా ఉంటుంది. అందువల్ల ఈ నృత్యం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది’ అని చెబుతుంది విశాఖ. భారతీయ–ఆస్ట్రేలియన్ యువ కళాకారిణిగా ఆమె జీవితంలో భరతనాట్యానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో ఈ సందర్భంగా వివరించింది. పాశ్చాత్య నృత్య సమాజంలో భరతనాట్య నర్తకిగా నన్ను బయటి వ్యక్తిగానే చూసేవారు. కానీ ఇప్పుడు అందరిచేత ‘నృత్యం ఆత్మ ప్రదర్శించే భాష, ఇది కేవలం సమకాలీనమైనది కాదు, ఇది శరీరం, ఆత్మ కదలిక’ అని చెబుతుంది విశాఖ. (చదవండి: అత్యంత అరుదైన పెంగ్విన్..!) -
విశాఖ విమ్స్ ను సందర్శించిన మంత్రి ఆళ్ల నాని
-
ఎంత ఖర్చైనా వెనుకాడకుండా ప్రభుత్వం వైద్యం అందిస్తోంది
-
ఆక్సిజన్ పంపిణీలో విశేష సేవలు అందిస్తున్న కార్మికులు
-
అది దేశం కోసం తీసుకున్న నిర్ణయం: పవన్ కల్యాణ్
అమరావతి: విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నదేనని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కేవలం విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మాత్రమే ఈ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఆదివారం ఆయన వీడియో సందేశాన్ని ఆ పార్టీ మీడియాకు విడుదల చేసింది. ‘కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనలు విశాఖ ఉక్కు కర్మాగారాన్నీ తాకాయి. కేంద్ర నిర్ణయంతో పరిశ్రమపై ప్రభుత్వానికి నియంత్రణ ఉంటుంది కానీ వ్యాపారాలు చేయదు. 1970 నుంచి లైసెన్స్‌రాజ్ విధానం వల్ల అనుకున్న విధంగా పరిశ్రమలు నడవక మూతపడటం, పరిశ్రమల భూములను ఎవరికి వారు అమ్ముకోవడం వల్ల కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుంది’అని పేర్కొన్నారు. చదవండి: భార్యను చంపేసి.. ఏమీ ఎరగనట్టు..! -
చంద్రబాబు అవినీతిపై సీబీఐ ఈడీలతో దర్యాప్తు చేయాలి
-
ఆలోచింపజేసే 14
‘కుమారి 21 ఎఫ్’ నోయల్ ప్రధాన పాత్రలో రతన్, విశాఖ జంటగా నటించిన చిత్రం ‘14’. లక్ష్మి శ్రీనివాస్ దర్శకత్వంలో రాయల్ పిక్చర్స్ పతాకంపై సుబ్బారావ్ రాయన, శివకృష్ణ నిచ్చెన మెట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ని ‘బిగ్ బాస్’ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఈ మోషన్ పోస్టర్ చాలా కొత్తగా, ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంది. ఈ పోస్టర్‌లాగే సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. నోయల్‌కి ‘కుమారి 21ఎఫ్’ సినిమాకన్నా ‘14’ చిత్రంతో ఎక్కువ పేరు రావాలి’’ అన్నారు. ‘‘వైవిద్యభరితమైన కథతో రూపొందిన చిత్రమిది. కొత్త పాయింట్‌ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకంతో మీ ముందుకు వస్తున్నాం’’ అన్నారు లక్ష్మి శ్రీనివాస్. ఈ చిత్రానికి కెమెరా: సాయినాథ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కామిరెడ్డి బాబురెడ్డి. -
రాజా వస్తున్నాడహో...
మమ్ముట్టి హీరోగా వైశాఖ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మధుర రాజా’. జై, మహిమా నంబియార్ కీలక పాత్రలు చేశారు. జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలై ఘనవిజయం సాధించిన ఈ మలయాళ చిత్రం ‘రాజా నరసింహా’ పేరుతో తెలుగులో అనువాదమవుతోంది. జై చెన్నకేశవ పిక్చర్స్ పతాకంపై సాధుశేఖర్ ఈ నెల 22న ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ని దర్శకుడు వీవీ వినాయక్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘రాజా నరసింహా’ ట్రైలర్ పవర్‌ఫుల్‌గా ఉంది. టైటిల్ యాప్ట్‌గా ఉంది. మలయాళంలో విజయవంతమైన ఈ చిత్రం తెలుగులో కూడా పెద్ద హిట్ అయ్యి, నిర్మాతకు మంచి పేరు, లాభాలు రావాలి’’ అన్నారు. సాధు శేఖర్ మాట్లాడుతూ– ‘‘చక్కని సందేశంతో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. మమ్ముట్టి పవర్ఫుల్ యాక్షన్, జగపతిబాబు విలనిజం, గోపీ సుందర్ సంగీతం, సన్నీ లియోన్ ప్రత్యేక గీతం ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. మలయాళంలో వంద కోట్లు వసూలు చేసిన ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: నూల అశోక్, నిర్మాణ సారధ్యం: వడ్డీ రామానుజం, పురం రాధాకృష్ణ. -
విశాఖ శ్రీకృష్ణపురంలో నాటు బాంబు పేలుడు
-
దాచేస్తే దాగని బంధం!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/గాజువాక: పెకి ఎన్ని మాటలు చెప్పినా.. ఎంత బొంకినా.. దాచేస్తే దాగని బంధం టీడీపీ, జనసేన పార్టీలదనే విషయం జనసేన అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ ఘట్టం సాక్షిగా బహిర్గతమైంది. విశాఖ జిల్లా గాజువాక జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ జీవీఎంసీ జోనల్ కార్యాలయానికి గురువారం ఉదయం 11.45 గంటల సమయంలో అట్టహాసంగా ర్యాలీగా తరలివచ్చారు. తమ అభిమాన నటుడు అయిన పవన్ నామినేషన్ కార్యక్రమంలో ఆయన అభిమానులు జనసేన జెండాలతో సందడి చేయడం షరామామూలే అయినా ర్యాలీలో తెలుగుదేశం పార్టీ జెండాలు లెక్కకు మించి కనిపించడం విశేషం. జనసేన, టీడీపీ మధ్య ఉన్న రహస్య బంధాన్ని ఇది బహిర్గతం చేసింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా ఎన్నికల్లో అడ్డదారిలో ప్రయోజనం పొందాలని ఎత్తుగడ వేసిన చంద్రబాబు అందుకోసం జనసేనతో లోపాయికారీ పొత్తు పెట్టుకుని అంచెలంచెలుగా అమలు చేస్తుండడం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన పథకం ప్రకారమే జనసేన పొత్తుల వ్యవహారం సాగుతుండడంతోపాటు సీట్ల కేటాయింపు వ్యవహారంలోనూ రెండు పార్టీల మధ్య లోపాయికారీ అవగాహన నడవడం ఇప్పటికే తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో జనసేన, టీడీపీల మధ్య బంధాన్ని పవన్ నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొనడం బట్టబయలు చేసింది. అయితే టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నామినేషన్ ర్యాలీకి వచ్చిన శ్రేణులే పవన్ ర్యాలీలో కలిసిపోయారంటూ ‘కవర్’ చేయడానికి ప్రయత్నించడం గమనార్హం. నిజానికి నామినేషన్ వేసేందుకు పల్లాకు అధికారులిచ్చిన సమయం ఉదయం 10.30 గంటలు. కణితి రోడ్డు మీదుగా గాజువాక జోనల్ కమిషనర్ కార్యాలయానికి రావాలని అధికారులు స్పష్టం చేశారు. ఇక పవన్‌కు 11.30 గంటలకు సమయమిచ్చి.. నేషనల్ హైవే మీదుగా జోనల్ కమిషనర్ కార్యాలయానికి రావాలని సూచించారు. కానీ పవన్ రాకకోసం వేచిచూస్తూ.. జాప్యం చేస్తూ టీడీపీ శ్రేణులు సరిగ్గా పవన్ రాగానే ర్యాలీలో కలిసిపోయి.. టీడీపీ, జనసేన బంధాన్ని చాటిచెప్పాయి. పల్లా శ్రీనివాసరావు రాజకీయ అరంగేట్రం 2009లో పీఆర్పీతోనే మొదలైంది. ఆ ఎన్నికల్లో పల్లా విశాఖ లోక్‌సభ స్థానానికి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో పల్లా తరఫున పవన్ ప్రచారాన్ని కూడా చేశారు. జగన్ లక్ష్యంగా విమర్శలు.. చంద్రబాబు ఊసే లేదు.. నామినేషన్ దాఖలు అనంతరం పవన్ గాజువాక బహిరంగసభలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. అదే సమయంలో సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌బాబుపై పల్లెత్తుమాట అనలేదు. జగన్మోహన్రెడ్డిపై కేసులు దర్యాప్తు చేసినందుకే జేడీ లక్ష్మీనారాయణను విశాఖ ఎంపీ అభ్యర్థిగా నిలబెడుతున్నట్టు చెప్పారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే కబ్జాలు పెరిగిపోతాయని, రౌడీలు పెరిగిపోతారంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్రెడ్డి పోరాడటం లేదని, ఆయన హోదా మాటెత్తితే ప్రతిపక్ష నేత కేసులకు సంబంధించిన ఫైలును ప్రధానమంత్రి మోదీ బయటకు తీస్తున్నారని చెప్పుకొచ్చారు. మరోవైపు చంద్రబాబు కేసుల ఊసే పవన్ ఎత్తలేదు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు దొరికిపోయిన విషయంగానీ, డేటా స్కాం విషయంపైగానీ, దళితులపై జరిగిన దాడులనుగానీ కనీసం ప్రస్తావించలేదు. పెందుర్తిలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కబ్జాలు చేశారన్నారు.ఆయన్ని ఎదుర్కోవడానికి చింతలపూడి వెంకట్రామయ్యను అభ్యర్థిగా పెట్టామన్నారు. ప్రభుత్వంలో అవినీతి ఉన్నా మంత్రివర్గంలో ఉండి కూడా గంటా శ్రీనివాసరావు ఏమీ చేయలేకపోయారని, ఆయన ఎందుకు ఆగిపోయారో తనకు అర్థం కాలేదని, అందుకే వారిపై గట్టి అభ్యర్థులను పెట్టానని చెప్పారు. విజయనగరంలో బొత్సకు ధీటుగా తమ పార్టీ అభ్యర్థిని పెట్టానన్నారు. టీడీపీ, వైఎస్సార్సీపీలు మంచివారిని అభ్యర్థులుగా పెడితే తాను కూడా మంచివారినే పెడతానని, వారు ఎటువంటి వారిని పెడితే తాను అటువంటివారిని పెడతానని అన్నారు. తనకు మిత్రపక్షాలైన వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడటానికి ఆయన అవకాశమివ్వలేదు. ఇటీవల గాజువాకలో నిర్వహించిన ఒక బహిరంగసభలో సీపీఎం, సీపీఐ నాయకులు టీడీపీ అక్రమాలను కడిగి పారేశారు. ఈ సభలో తమకు మాట్లాడే అవకాశం కల్పిస్తే టీడీపీ అక్రమాల్ని బయటపెడతామనే ఉద్దేశంతోనే పవన్ అవకాశమిచ్చి ఉండకపోవచ్చని వామపక్ష పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు. -
రేపు బంద్‌కు సిద్ధమవుతున్న విశాఖ వైఎస్అర్సీపీ నేతలు
-
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
పాయకరావుపేట: మండలంలో జాతీయరహదారిపై తాండవబ్రిడ్జి సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరోవ్యక్తి తీవ్రగాయాల పాలయ్యాడు. ఎస్ఐ బాబూరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్.రాయవరం మండలం గెడ్డపాలెం గ్రామానికి చెందిన కర్రి గణేష్(45), కర్రి నానాజీలు బైక్‌పై తుని బయలుదేరారు. వీరు కోటనందూరు వద్ద ఉన్న జీడి పిక్కల పరిశ్రమలో పనిచేస్తున్నారు. తాండవ బ్రిడ్జిసమీపంలోకి రాగానే బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని అవతలవైపు( తుని నుంచి విశాఖ వెళ్లే) రోడ్డుపై పడ్డారు. ఇంతలో తుని నుంచి విశాఖ వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం వీరిని ఢీకొంది.ఈ ప్రమాదంలో గణేష్ అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడిన నానాజీని తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
విశాఖ యోగా గురువు హత్య కేసు: ఐదుగురు అరెస్ట్
-
ఏవోబీలో హెలికాప్టర్లతో కూంబింగ్
విశాఖ: మావోయిస్టులు గురువారం 5 రాష్ట్రాల బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీ ఏరియాతో పాటు ఏవోబీ పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. మన్యంలో భారీగా మొహరించిన పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అదే విధంగా హెలికాప్టర్లతో ఏవోబీలో కూంబింగ్ ను నిర్వహిస్తున్నారు. కాగా బంద్ ను విజయవంతం చేయాలని మావోయిస్టుల పేరుతో పోస్టర్లు వెలిశాయి. బంద్ నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు భద్రత ను పెంచారు. -
విశాఖ ప్రేమసమాజంలో పెళ్లిబాజాలు
-
గుడివాడ గుర్నాధరావు విగ్రహావిష్కరణ
-
విశాఖలో బాక్సైట్ తవ్వకాలకు పచ్చజెండా
-
విశాఖలో బాక్సైట్ తవ్వకాలకు పచ్చజెండా
3,030 ఎకరాల అభయారణ్యం బదలాయింపు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా చింతపల్లి, జెర్రెల అభయారణ్యాల్లో బాక్సైట్ తవ్వకాలకు చంద్రబాబు సర్కారు పచ్చజెండా ఊపింది. విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్ చింతపల్లి, జెర్రెల బ్లాకుల్లోని 3,030 ఎకరాల (1,212 హెక్టార్ల) అభయారణ్యాన్ని ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి బదలాయిస్తూ అక్కడి ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఇక్కడ బాక్సైట్ తవ్వకాలు జరపడానికి వీలులేదని, మైనింగ్ లీజులు రద్దు చేయాలంటూ గిరిజనులు ఉద్యమాలు జరుపుతున్న సమయంలో ప్రభుత్వం తుదిదశ పర్యావరణ అనుమతులు (స్టేజ్-2 క్లియరెన్స్) జారీ చేయడంతోపాటు అభయారణ్యాన్ని ఏపీఎండీసీకి బదలాయిస్తూ జీవో నంబరు 97 జారీ చేయడం గమనార్హం. మైనింగ్ లీజులున్న ప్రాంతాన్ని ఏపీఎండీసీకి బదలాయించేందుకు కేంద్ర అటవీ పర్యావరణశాఖ ఆగస్టు 17న అనుమతించిందని, దీనికనుగుణంగానే జీవో జారీ చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీఎండీసీకి అటవీ భూమిని బదలాయించడమంటే ఖనిజ తవ్వకాలకు అనుమతించడమేనని స్పష్టమవుతోంది. బాబు రెండు నాల్కల ధోరణి ఏపీఎండీసీకి ఈ మైనింగ్ లీజులు ఇవ్వడాన్ని చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా తీవ్రంగా తప్పుబట్టారు. ఇక్కడ ఖనిజ తవ్వకాలు జరుగనీయబోమని, గిరిజనులకు అండగా ఉంటూ లీజులు రద్దయ్యేవరకు పోరాటం సాగిస్తామని ప్రతిపక్షనేత హోదాలో చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు. బాక్సైట్ మైనింగ్ లీజులను రద్దు చేయాలంటూ అప్పట్లో గవర్నరుకు వినతిపత్రం కూడా సమర్పించారు. అదే చంద్రబాబు సీఎం కాగానే స్వరం మార్చారు. బాక్సైట్ తవ్వకాల ద్వారానే గిరిజనుల ప్రగతి సాధ్యమవుతందని ప్రకటించారు. బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాన్ని సహించేది లేదంటూ హెచ్చరికలు జారీచేశారు. వ్యక్తిగత స్వార్థంతో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా ఒకవిధంగా, అధికారంలో ఉండగా మరోరకంగా వ్యవహరిస్తారనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. ప్రతిపక్షంలో ఉండగా ఇక్కడ బాక్సైట్ తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లోను సమ్మతించేది లేదంటూ ఉద్యమం చేస్తామని ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే స్వయంగా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రిపై ఒత్తిడి తెచ్చి బాక్సైట్ తవ్వకాలకు వీలుగా తుదిదశ అటవీ క్లియరెన్స్, అభయారణ్యం బదలాయింపునకు ఉత్తర్వులు తెప్పించారు. వీటి ఆధారంగా విశాఖ జిల్లాలోని చింతపల్లి, జెర్రెల అభయారణ్యంలో 3,030 ఎకరాలను ఏపీఎండీసీకి బదలాయిస్తూ రాష్ట్ర అటవీ పర్యావరణశాఖ గురువారం జీవో జారీచేసింది. దీంతో చంద్రబాబు తీరుపై జిల్లాలోని గిరిజనులు, రాజకీయ పక్షాల ప్రతినిధులు మండిపడుతున్నారు. -
సంచలనం రేపుతున్న అనూష హత్యకేసు