అమరావతి: విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నదేనని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కేవలం విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మాత్రమే ఈ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఆదివారం ఆయన వీడియో సందేశాన్ని ఆ పార్టీ మీడియాకు విడుదల చేసింది.
‘కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనలు విశాఖ ఉక్కు కర్మాగారాన్నీ తాకాయి. కేంద్ర నిర్ణయంతో పరిశ్రమపై ప్రభుత్వానికి నియంత్రణ ఉంటుంది కానీ వ్యాపారాలు చేయదు. 1970 నుంచి లైసెన్స్‌రాజ్ విధానం వల్ల అనుకున్న విధంగా పరిశ్రమలు నడవక మూతపడటం, పరిశ్రమల భూములను ఎవరికి వారు అమ్ముకోవడం వల్ల కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుంది’అని పేర్కొన్నారు.
చదవండి: భార్యను చంపేసి.. ఏమీ ఎరగనట్టు..!
Comments
Please login to add a commentAdd a comment