factorys
-
అది దేశం కోసం తీసుకున్న నిర్ణయం: పవన్ కల్యాణ్
అమరావతి: విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నదేనని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కేవలం విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మాత్రమే ఈ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఆదివారం ఆయన వీడియో సందేశాన్ని ఆ పార్టీ మీడియాకు విడుదల చేసింది. ‘కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనలు విశాఖ ఉక్కు కర్మాగారాన్నీ తాకాయి. కేంద్ర నిర్ణయంతో పరిశ్రమపై ప్రభుత్వానికి నియంత్రణ ఉంటుంది కానీ వ్యాపారాలు చేయదు. 1970 నుంచి లైసెన్స్‌రాజ్ విధానం వల్ల అనుకున్న విధంగా పరిశ్రమలు నడవక మూతపడటం, పరిశ్రమల భూములను ఎవరికి వారు అమ్ముకోవడం వల్ల కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుంది’అని పేర్కొన్నారు. చదవండి: భార్యను చంపేసి.. ఏమీ ఎరగనట్టు..! -
గాడిన పడిన గ్రానైట్
చీమకుర్తి: జిల్లాలో గ్రానైట్ ఫ్యాక్టరీల సంఖ్య గణనీయంగా పెరిగింది. దానితో పాటు విదేశీ మార్కెట్‌కు డిమాండ్ వచ్చింది. ఇప్పటి వరకు ప్రధాన ఎగుమతి దేశంగా చైనా మాత్రమే ఉండేది. ఇటీవల ఈజిప్ట్, వియత్నాం, బంగ్లాదేశ్ దేశాలకు కూడా గ్రానైట్ ఎగుమతి చేస్తున్నారు. రెండేళ్ల కిందటి వరకు రూ.67 నుంచి రూ.68 ఉండే డాలర్ రేటు ఏడాదిగా రూ.71 నుంచి రూ.72 మధ్య ఉంటుంది. దాని వలన క్యూబిక్ మీటర్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ గ్రానైట్ రాయి 1000 డాలర్ల వరకు పలుకుతోంది. ఇది ఇండియన్ కరెన్సీలో సరాసరి రూ.72 వేల ధర పలుకుతోంది. లోకల్ గ్రానైట్ ఫ్యాక్టరీలు కూడా ఇటీవల అధికం కావడం, లోకల్ మార్కెట్ డిమాండ్ పెరిగింది. అదను కుదరటంతో ప్రభుత్వం కూడా గ్రానైట్ నుంచి రావలసిన రాయల్టీని ముక్కుపిండి వసూలు చేస్తోంది. దీంతో జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమ నుంచి ప్రభుత్వానికి ఏడాదికి రూ.200 కోట్లు పైనే ఆదాయం సమకూరుతోంది. ఏటా పెరుగుతున్న రాయల్టీ ఆదాయం.. బ్లాక్ గెలాక్సీ గ్రానైట్, బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్ నుంచి మూడేళ్లుగా తీసిన రాళ్ల పరిమాణం కూడా పెరుగుతున్నట్టు మైన్స్ కార్యాలయం నుంచి సేకరించిన గణాంకాలను పరిశీలిస్తే అవగతమవుతోంది. వాటి మీద వచ్చే రాయల్టీ ఆదాయం ఏటికేడు పెరుగుతున్నట్లు గణాంకాలు ధృవీకరిస్తున్నాయి. 2016–17లో బ్లాక్ గెలాక్సీ గ్రానైట్‌ను 4.09 లక్షల క్యూబిక్ మీటర్లు రాయిని క్వారీ నుంచి తీయగా, 2017–18లో 4.5 లక్షల క్యూబిక్ మీటర్లు రాయిని తీశారు. ఈ ఆర్ధిక సంవత్సరం అంటే 2018–19లో జనవరి నాటికే 3.9 లక్షల క్యూబిక్ మీటర్లు రాయి తీశారు. ఇంకా ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరో 80 వేల క్యూబిక్ మీటర్లు తీసే అవకాశం ఉంది. దానితో ఈ సంవత్సరం 4.71 లక్షల క్యూబిక్ మీటర్లు రాయి వస్తుంది. తీసిన రాయిపై ప్రభుత్వం వసూలు చేసే రాయల్టీ ప్రకారం 2016–17లో రూ.131 కోట్లు, 2017–18లో రూ.135 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది 2018–19లో ఇప్పటికే గడిచిన జనవరి నాటికి రూ.122 కోట్లు ఆదాయం వచ్చింది. నెలకు సరాసరిన రూ.14 కోట్లు ఆదాయం వస్తున్నందున మిగిలిన రెండు నెలలకు కలిపితే మొత్తం రూ.150 కోట్లు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన గత మూడేళ్లతో పోల్చుకుంటే ఒక్క బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ద్వారానే రూ.131 కోట్ల నుంచి ఏకంగా రూ.150 కోట్లకు ఆదాయం పెరిగింది. ఇక బ్లాక్ గ్రానైట్ ద్వారా రూ.17 కోట్లు, కలర్ గ్రానైట్ ద్వారా రూ.25 కోట్లు ఆదాయం వస్తోంది. మూడు రకాల గ్రానైట్ల నుంచి రూ.192 కోట్లు ఆదాయం సమకూరుతోంది. ఇక ఖాళీగా ఉన్న గ్రానైట్ భూములను లీజులకు ఇచ్చిన వాటి నుంచి డెడ్‌రెంట్ వసూలు చేస్తారు. క్వారీలకు ఇచ్చిన భూములు, రోడ్డు మెటల్, గ్రావెల్ నుంచి డెడ్‌రెంట్ ద్వారా కనీసం రూ.10 కోట్లు ఆదాయం వస్తున్నట్లు మైన్స్ అధికారుల ద్వారా గణాంకాలు ధృవీకరిస్తున్నాయి. అన్ని కలిపితే జిల్లాలోని గ్రానైట్ ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి రూ.200 కోట్లు పైనే ఆదాయం కేవలం రాయల్టీ ద్వారా వస్తున్నట్టు స్పష్టమవుతోంది. బ్లాకుల వారీగా రాయల్టీ రేట్లు.. గ్రానైట్ రాళ్లకు వాటి పరిమాణాన్ని బట్టి రాయల్టీని వసూలు చేస్తారు. సూపర్ గ్యాంగ్సా, మినీ గ్యాంగ్సా, కట్టర్‌సైజ్, ఖండాస్ అనే నాలుగు రకాలుగా విభజిస్తారు. బ్లాక్ గెలాక్సీ, బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్ రాళ్లకు వేర్వేరుగా రాయల్టీని చెల్లించాల్సి వుంటుంది. ఇప్పుడు వసూలు చేసే రాయల్టీ ధరలను 2015 నవంబర్ 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నారు. వాస్తవానికి రాయల్టీ ధరలను ప్రతి మూడేళ్లకు ఒకసారి సమీక్షించాల్సి ఉంటుంది. అమలు చేస్తున్న ధరలు మూడేళ్లయిలైనా వాటిని అలాగే అమలు చేస్తున్నారు. -
ఆ దేశం.. ఉగ్రవాదుల కార్ఖానా!
న్యూఢిల్లీ : పాకిస్తాన్.. ఉగ్రవాదుల కార్ఖానా అని ఫ్రీడమ్ ఆఫ్ బలూచిస్తాన్ వైస్ ఛైర్మన్ మామా ఖదీర్ స్పష్టం చేశారు. బలూచిస్తాన్ స్వతంత్ర పోరాటాన్ని ఉగ్రవాదుల సహకారంతో అణిచేందుకు ఆ దేశం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. పాకిస్తాన్లో అడుగడుగునా ఉగ్రవాదులను తయారు చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయని ఆయన చెప్పారు. పాక్ ఆక్రమణ నాటినుంచి బలూచ్‌లో మానవహక్కుల ఉల్లంఘన యధేచ్చగా జరుగుతోందని అన్నారు. భారత్‌కు చెందిన కులభూషణ్ జాదవ్‌ను ఇరాన్నుంచి పాకిస్తాన్ నిఘాసంస్థ ఐఎస్ఐ కిడ్నాప్ చేయించిందని ఖదీర్ పేర్కొన్నారు. ఈ కిడ్నాప్ కోసం కోట్లరూపాయలను పాకిస్తాన్ ఖర్చు చేసిందని అన్నారు. హఫీజ్ సయీద్, ముల్లా ఒమర్ వంటి రక్తపిపాసులైన ఉగ్రవాదులను తయారు చేసిందని మండిపడ్డారు. వారే నేడు పాక్‌లో ఉగ్రవాదులను తయారు చేసే కార్ఖానాలను ఏర్పాటు చేశారుని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులభూషణ్ జాదవ్‌ను అడ్డం పెట్టుకుని బలూచ్ విషయంలో భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు పాకిస్తాన్ ప్రయత్నం చేస్తోందని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బలూచిస్తాన్‌లో 2004 నుంచి 45 వేల మంది ప్రజలు కనిపించకుండా పోయారని.. ఇందుకు ఐఎస్ఐ, ఎంఐ, ఎఫ్‌సీ కారణమని ఆయన చెప్పారు. స్వతంత్ర పోరాటం ఉధృతం అయ్యే సమయంలో.. ఐఎస్ఐ ఇతర సంస్థలు.. కీలక వ్యక్తులను మాయం చేస్తున్నాయని ఆరోపించారు. -
పరిశ్రమలు కాలుష్య రహితంగా ఉండాలి
కాలుష్య నియంత్రణ బోర్డు చైర్మ¯ŒS ఫణికుమార్ సాక్షి, రాజమహేంద్రవరం : నానో టెక్నాలజీతో పరిశ్రమలను కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలని. లేకుంటే ప్రజాఉద్యమాలు తప్పవని రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి జీఎ¯ŒS ఫణికుమార్ హెచ్చరించారు. స్థానిక ఓ హోటల్లో సోమవారం ‘ఎన్విరా¯ŒSమెంటల్ క్లినిక్ ఆ¯ŒS పేపర్ ఇండస్ట్రీ’అంశంపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఉభయగోదావరి జిల్లాలలోని పేపర్ పరిశ్రమల యాజమాన్యాలతో సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే పరిశ్రమల కాలుష్యంపై ప్రజా ఉద్యమాలు ప్రారంభమైతే వాటిని ఎవ్వరూ ఆపలేరని అన్నారు. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్య నివారణకు అనుసరించాలి్సన పద్ధతులు, నీటిని తక్కువగా ఉపయోగించే విధానాలపై పరిశ్రమల యజమానులకు అవగాహన కల్పించారు. పేపర్ ఇండస్ట్రీ వల్ల వాయు, జల, భూమి కాలుష్యం అధికంగా ఉంటుందన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని, ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఇంటర్నేషనల్ పేపర్ మిల్లు కాలుష్య జలాలు గోదావరి లంకల్లోకి వదిలితే వరద వస్తే కాలుష్య జలాలు దిగువ ప్రాంతంలోని జలాలను కలుషితం చేస్తాయన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. శుద్ధి చేసిన జలాలనే గోదావరిలోకి వదలాలని ఆదేశించారు. గోదావరి కాలుష్యం కారాదు... రాజమహేంద్రవరంలోని పేపర్ మిల్లు కాలుష్య జలాలు, నగరంలో నుంచి కలుస్తున్న మురికి నీటితో గోదావరి కలుషితం అవుతోందని కాలుష్య నియంత్రణ బోర్డు విశాఖ జోనల్ అధికారి ఎ¯ŒSవీ భాçస్కరరావుకు తెలిపారు. పేపర్‌మిల్లు నుంచి కాలుష్య జలాలు గోదావరిలో కలుస్తున్న విషయంపై తనిఖీ చేసి చర్యలు చేపడతామని విలేకరుల ప్రశ్నకు సమాధానం చెప్పారు. గంగా ప్రక్షాళన విధంగా గోదావరి ప్రక్షాళన చేపట్టే విషయం పరిశీలిస్తామన్నారు. బోర్డు మెంబర్ బీఎస్ఎస్ ప్రసాద్, కాలుష్య నియంత్రణ నిపుణులు, పేపర్‌మిల్లుల యాజమాన్యాలు, ప్రతినిధులు పాల్గొన్నారు. -
షుగర్ ఫ్యాక్టరీలకు మహర్దశ
జిల్లాలోని రెండు ఫ్యాక్టరీల పరిధిలో రైతులకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.26 కోట్లు ఏళ్ల తరబడి పేరుకుపోయాయి. ఈ పరిణామాలతో జిల్లాలో చెరకు సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. నిధుల కొరతతో ఫ్యాక్టరీలు అప్పులు ఊబిలో కూరుకుపోయాయి. ఈ నేపథ్యంలో వడ్డీ లేని రుణాలు అందించాలని రెండు రోజుల క్రితం సీసీఈఏ నిర్ణయం తీసుకోవడంతో చక్కెర కర్మాగారాలకు మహర్దశ పట్టనుంది. సాక్షి, నెల్లూరు : ద్రవ్య సంక్షోభం నుంచి చక్కెర మిల్లులు గట్టెక్కించడానికి కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శరద్‌పవార్ సారథ్యంలో ఏర్పాటైన మంత్రుల బృందం చేసిన సిఫార్సుల మేరకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చక్కె ర మిల్లులకు బ్యాంకులు రుణాలు అందిస్తా యి. ఇందుకు అయ్యే వడ్డీని కేంద్రమే భరించనుంది. అయితే కేవలం రైతుల బకాయిలు చెల్లించేందుకు మాత్రమే చక్కెర మిల్లులు ఈ నిధులు వినియోగించాల్సి ఉంది. మూడేళ్లలో చక్కెర మిల్లులు చెల్లించిన ఎక్సైజ్ సుంకానికి సమాన స్థాయిలో రుణాలిస్తారు. ఈ రుణ మొత్తాన్ని ఐదేళ్లలో తిరిగి చెల్లించాలి. పంచదార ఎగుమతులు సైతం కొనసాగించాలన్న ప్రతిపాదనకు సీసీఈఏ ఆమోద ముద్ర వేసింది. జిల్లాలోని చక్కెర కర్మాగారాలు రైతులకు చెల్లిం చాల్సిన బకాయిలు చెల్లించే అవకాశం ఏర్పడింది. బకాయిలు చెల్లించని ఫ్యాక్టరీలు చెరకు రైతులకు చక్కెర కర్మాగారాలు తరచూ బకాయిలు సక్రమంగా అందించడంలేదు. సాధారణంగా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో రైతులు చెరకును ఫ్యాక్టరీలకు ఇస్తారు. నిబంధనల మేరకు పంటను ఇచ్చిన నెలలోపే యాజ మాన్యం రైతులకు డబ్బులు చెల్లించాల్సి ఉంది. కానీ ఫ్యాక్టరీలు రైతులకు నెలలు, ఏళ్ల తరబడి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. బకాయిల కోసం రైతులు కాల్లరిగేలా తిరిగి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఐదారేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ప్ర స్తుతం కోవూరు షుగర్ ఫ్యాక్టరీ రైతులకు, కార్మికులకు కలిపి రూ. 12 కోట్ల బకాయిలు చెల్లిం చాల్సి ఉంది. ప్రభగిరిపట్నం ఫ్యాక్టరీ రూ.14 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. రైతుల సొమ్ముతో ఫ్యాక్టరీలు జల్సా షుగర్ ఫ్యాక్టరీల యాజమాన్యం రైతులకు బకాయిలు చెల్లించకుండా ఆ సొమ్ముతో జల్సాలు చే స్తున్నాయి. రైతులు చెరకు తొలితే పైసా చెల్లించకుండా ఆ చెరకుతో చేసిన షగర్‌ను మాత్రం ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే అమ్ముకున్నట్లు సమాచారం. అయితే సంబంధిత షగర్ కేన్ కమిషనర్, రిజియన్ అసిస్టెంట్ కమిషనర్‌తో పాటు వ్యవసాయ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. తగ్గుతున్న సాగు విస్తీర్ణం 2000 సంవత్సరానికి ముందు జిల్లా పరిధిలోనే 50 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సాగైన చెర కు, 2011-12లో 25 వేల ఎకరాలలో మాత్రమే సాగైంది. ఈ ఏడాది 15 వేల ఎకరాల్లో కూడా చె రకు పంట సాగు కాలేదు. దీన్ని బట్టి చూస్తే ఏడాదికేడాదికి చెరకు సాగు విస్తీర్ణం గణనీయం గా పడిపోతున్నట్లు స్పష్టమౌతోంది. చెరకుపై ఆసక్తి ఉన్నా ఫ్యాక్టరీలు సకాలంలో బకాయిలు చెల్లించడం లేదని, ఏళ్ల తరబడి తిరిగితే తప్ప డబ్బులు ఇవ్వడంలేదని రైతులు చెబుతున్నారు. గతమెంతో వైభవం జిల్లా వ్యవసాయ రంగానికి ప్రసిద్ధి. వరి తరువాత చెరకు పంటను రైతులు అత్యధికంగా సాగు చేస్తారు. 1973లో ప్రభుత్వ రంగ కోవూ రు చక్కెర కర్మాగారం ఏర్పాటైంది. 4.5 లక్షల టన్నుల కెపాసిటీతో నిర్మించారు. జిల్లాలోని పొ దలకూరు, నాయుడుపేటల్లో మరో రెండు ప్రైవే టు చెక్కర కర్మాగాలు నిర్మితమయ్యాయి. నాయుడుపేట ఎంపీ షుగర్స్ 1990లో ఏర్పాటైం ది. పొదలకూరు మండలం ప్రభగిరిపట్నం వద్ద 5 లక్షల టన్నుల కెపాసిటీతో వీడీబి షుగర్ ఫ్యాక్టరీ నిర్మించారు. జిల్లాలో మూడు చెక్కర కర్మాగారాలు నెలకొనడంతో రైతులు చెరకు సాగుపై మొగ్గు చూపారు. బుచ్చిరెడ్డిపాళెం, ఆత్మకూరు, సంగం,పొదలకూరు, కలువాయి, అనంతసాగరం, ఉదయగిరి, వింజ మూరు, ఏఎస్‌పేట, కలిగిరి, మర్రిపాడుతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల పరిధిలో 1,400 మందికి పైగా రైతులు 50 వేలకు పైగా విస్తీర్ణంలో రైతులు చెరకు పంటను సాగు చేసేవారు. ఇక నాన్జోన్గా ఉన్న జిల్లాలోని మిగిలిన ప్రాంతాలతో పాటు వైఎస్సార్ కడప జిల్లాలోని బద్వేలు, పోరుమామిళ్ల, కాశినాయన, బి.కోడూరు, మైదుకూరు, చెన్నూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో 15 వేల ఎకరాలు, కర్నూలు జిల్లాలోని నంద్యాల, చిత్తూరు జిల్లాతో పాటు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో 10 వేల ఎకరాల్లో సాగు చేసిన చెరకు పంటను జిల్లాలోని మూడు ఫ్యాక్టరీలకు తరలించేవారు. అయితే బకాయిల నేపథ్యంలో ప్రస్తుతం కోవూరు షుగర్ ఫ్యాక్టరీ దాదాపు మూతపడే పరిస్థితికి చేరింది. మిగిలిన రెండు ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీలు మాత్రం ఒడిదుడుకులతో కొనసాగుతున్నాయి.