జిల్లాలోని రెండు ఫ్యాక్టరీల పరిధిలో రైతులకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.26 కోట్లు ఏళ్ల తరబడి పేరుకుపోయాయి. ఈ పరిణామాలతో జిల్లాలో చెరకు సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. నిధుల కొరతతో ఫ్యాక్టరీలు అప్పులు ఊబిలో కూరుకుపోయాయి. ఈ నేపథ్యంలో వడ్డీ లేని రుణాలు అందించాలని రెండు రోజుల క్రితం సీసీఈఏ నిర్ణయం తీసుకోవడంతో చక్కెర కర్మాగారాలకు మహర్దశ పట్టనుంది.
సాక్షి, నెల్లూరు : ద్రవ్య సంక్షోభం నుంచి చక్కెర మిల్లులు గట్టెక్కించడానికి కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శరద్‌పవార్ సారథ్యంలో ఏర్పాటైన మంత్రుల బృందం చేసిన సిఫార్సుల మేరకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చక్కె ర మిల్లులకు బ్యాంకులు రుణాలు అందిస్తా యి.
ఇందుకు అయ్యే వడ్డీని కేంద్రమే భరించనుంది. అయితే కేవలం రైతుల బకాయిలు చెల్లించేందుకు మాత్రమే చక్కెర మిల్లులు ఈ నిధులు వినియోగించాల్సి ఉంది. మూడేళ్లలో చక్కెర మిల్లులు చెల్లించిన ఎక్సైజ్ సుంకానికి సమాన స్థాయిలో రుణాలిస్తారు. ఈ రుణ మొత్తాన్ని ఐదేళ్లలో తిరిగి చెల్లించాలి. పంచదార ఎగుమతులు సైతం కొనసాగించాలన్న ప్రతిపాదనకు సీసీఈఏ ఆమోద ముద్ర వేసింది. జిల్లాలోని చక్కెర కర్మాగారాలు రైతులకు చెల్లిం చాల్సిన బకాయిలు చెల్లించే అవకాశం ఏర్పడింది.
బకాయిలు చెల్లించని ఫ్యాక్టరీలు
చెరకు రైతులకు చక్కెర కర్మాగారాలు తరచూ బకాయిలు సక్రమంగా అందించడంలేదు. సాధారణంగా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో రైతులు చెరకును ఫ్యాక్టరీలకు ఇస్తారు. నిబంధనల మేరకు పంటను ఇచ్చిన నెలలోపే యాజ మాన్యం రైతులకు డబ్బులు చెల్లించాల్సి ఉంది. కానీ ఫ్యాక్టరీలు రైతులకు నెలలు, ఏళ్ల తరబడి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. బకాయిల కోసం రైతులు కాల్లరిగేలా తిరిగి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఐదారేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ప్ర స్తుతం కోవూరు షుగర్ ఫ్యాక్టరీ రైతులకు, కార్మికులకు కలిపి రూ. 12 కోట్ల బకాయిలు చెల్లిం చాల్సి ఉంది. ప్రభగిరిపట్నం ఫ్యాక్టరీ రూ.14 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది.
రైతుల సొమ్ముతో ఫ్యాక్టరీలు జల్సా
షుగర్ ఫ్యాక్టరీల యాజమాన్యం రైతులకు బకాయిలు చెల్లించకుండా ఆ సొమ్ముతో జల్సాలు చే స్తున్నాయి. రైతులు చెరకు తొలితే పైసా చెల్లించకుండా ఆ చెరకుతో చేసిన షగర్‌ను మాత్రం ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే అమ్ముకున్నట్లు సమాచారం. అయితే సంబంధిత షగర్ కేన్ కమిషనర్, రిజియన్ అసిస్టెంట్ కమిషనర్‌తో పాటు వ్యవసాయ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు.
తగ్గుతున్న సాగు విస్తీర్ణం
2000 సంవత్సరానికి ముందు జిల్లా పరిధిలోనే 50 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సాగైన చెర కు, 2011-12లో 25 వేల ఎకరాలలో మాత్రమే సాగైంది. ఈ ఏడాది 15 వేల ఎకరాల్లో కూడా చె రకు పంట సాగు కాలేదు. దీన్ని బట్టి చూస్తే ఏడాదికేడాదికి చెరకు సాగు విస్తీర్ణం గణనీయం గా పడిపోతున్నట్లు స్పష్టమౌతోంది. చెరకుపై ఆసక్తి ఉన్నా ఫ్యాక్టరీలు సకాలంలో బకాయిలు చెల్లించడం లేదని, ఏళ్ల తరబడి తిరిగితే తప్ప డబ్బులు ఇవ్వడంలేదని రైతులు చెబుతున్నారు.
గతమెంతో వైభవం
జిల్లా వ్యవసాయ రంగానికి ప్రసిద్ధి. వరి తరువాత చెరకు పంటను రైతులు అత్యధికంగా సాగు చేస్తారు. 1973లో ప్రభుత్వ రంగ కోవూ రు చక్కెర కర్మాగారం ఏర్పాటైంది. 4.5 లక్షల టన్నుల కెపాసిటీతో నిర్మించారు. జిల్లాలోని పొ దలకూరు, నాయుడుపేటల్లో మరో రెండు ప్రైవే టు చెక్కర కర్మాగాలు నిర్మితమయ్యాయి.
నాయుడుపేట ఎంపీ షుగర్స్ 1990లో ఏర్పాటైం ది. పొదలకూరు మండలం ప్రభగిరిపట్నం వద్ద 5 లక్షల టన్నుల కెపాసిటీతో వీడీబి షుగర్ ఫ్యాక్టరీ నిర్మించారు. జిల్లాలో మూడు చెక్కర కర్మాగారాలు నెలకొనడంతో రైతులు చెరకు సాగుపై మొగ్గు చూపారు. బుచ్చిరెడ్డిపాళెం, ఆత్మకూరు, సంగం,పొదలకూరు, కలువాయి, అనంతసాగరం, ఉదయగిరి, వింజ మూరు, ఏఎస్‌పేట, కలిగిరి, మర్రిపాడుతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల పరిధిలో 1,400 మందికి పైగా రైతులు 50 వేలకు పైగా విస్తీర్ణంలో రైతులు చెరకు పంటను సాగు చేసేవారు.
ఇక నాన్‌జోన్‌గా ఉన్న జిల్లాలోని మిగిలిన ప్రాంతాలతో పాటు వైఎస్సార్ కడప జిల్లాలోని బద్వేలు, పోరుమామిళ్ల, కాశినాయన, బి.కోడూరు, మైదుకూరు, చెన్నూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో 15 వేల ఎకరాలు, కర్నూలు జిల్లాలోని నంద్యాల, చిత్తూరు జిల్లాతో పాటు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో 10 వేల ఎకరాల్లో సాగు చేసిన చెరకు పంటను జిల్లాలోని మూడు ఫ్యాక్టరీలకు తరలించేవారు. అయితే బకాయిల నేపథ్యంలో ప్రస్తుతం కోవూరు షుగర్ ఫ్యాక్టరీ దాదాపు మూతపడే పరిస్థితికి చేరింది. మిగిలిన రెండు ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీలు మాత్రం ఒడిదుడుకులతో కొనసాగుతున్నాయి.
షుగర్ ఫ్యాక్టరీలకు మహర్దశ
Published Sun, Dec 22 2013 4:47 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement