న్యూఢిల్లీ : పాకిస్తాన్.. ఉగ్రవాదుల కార్ఖానా అని ఫ్రీడమ్ ఆఫ్ బలూచిస్తాన్ వైస్ ఛైర్మన్ మామా ఖదీర్ స్పష్టం చేశారు. బలూచిస్తాన్ స్వతంత్ర పోరాటాన్ని ఉగ్రవాదుల సహకారంతో అణిచేందుకు ఆ దేశం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. పాకిస్తాన్‌లో అడుగడుగునా ఉగ్రవాదులను తయారు చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయని ఆయన చెప్పారు. పాక్ ఆక్రమణ నాటినుంచి బలూచ్‌లో మానవహక్కుల ఉల్లంఘన యధేచ్చగా జరుగుతోందని అన్నారు. భారత్‌కు చెందిన కులభూషణ్ జాదవ్‌ను ఇరాన్‌నుంచి పాకిస్తాన్ నిఘాసంస్థ ఐఎస్‌ఐ కిడ్నాప్ చేయించిందని ఖదీర్ పేర్కొన్నారు. ఈ కిడ్నాప్ కోసం కోట్లరూపాయలను పాకిస్తాన్ ఖర్చు చేసిందని అన్నారు.
హఫీజ్ సయీద్, ముల్లా ఒమర్ వంటి రక్తపిపాసులైన ఉగ్రవాదులను తయారు చేసిందని మండిపడ్డారు. వారే నేడు పాక్‌లో ఉగ్రవాదులను తయారు చేసే కార్ఖానాలను ఏర్పాటు చేశారుని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులభూషణ్ జాదవ్‌ను అడ్డం పెట్టుకుని బలూచ్ విషయంలో భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు పాకిస్తాన్ ప్రయత్నం చేస్తోందని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
బలూచిస్తాన్‌లో 2004 నుంచి 45 వేల మంది ప్రజలు కనిపించకుండా పోయారని.. ఇందుకు ఐఎస్‌ఐ, ఎంఐ, ఎఫ్‌సీ కారణమని ఆయన చెప్పారు. స్వతంత్ర పోరాటం ఉధృతం అయ్యే సమయంలో.. ఐఎస్‌ఐ ఇతర సంస్థలు.. కీలక వ్యక్తులను మాయం చేస్తున్నాయని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment