
ఏవోబీలో హెలికాప్టర్లతో కూంబింగ్
విశాఖ: మావోయిస్టులు గురువారం 5 రాష్ట్రాల బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీ ఏరియాతో పాటు ఏవోబీ పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. మన్యంలో భారీగా మొహరించిన పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అదే విధంగా హెలికాప్టర్లతో ఏవోబీలో కూంబింగ్ ను నిర్వహిస్తున్నారు. కాగా బంద్ ను విజయవంతం చేయాలని మావోయిస్టుల పేరుతో పోస్టర్లు వెలిశాయి. బంద్ నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు భద్రత ను పెంచారు.