బెల్జియన్ కంటెంట్ క్రియేటర్ ఈడీ పీపుల్ వివిధ ప్రాంతాలలో లోకల్స్‌తో కలిసి చేసే డ్యాన్స్ వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా ఫేమ్ అయ్యాయి. ఏదైనా ప్రాంతానికి వెళ్లిన పీపుల్ స్థానికులను ‘మీకు ఇష్టమైన డ్యాన్స్ ఏమిటి?’ అని అడగడమే కాదు ‘నాకు నేర్పించగలరా?’ అని రిక్వెస్ట్ చేసి ఓపిగ్గా నేర్చుకుంటాడు. అలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలకు చెందిన డ్యాన్స్‌లను నేర్చుకుంటూ, స్థానికులతో పోటీ పడి డ్యాన్స్ చేస్తుంటాడు.
ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా మన దేశానికి సంబంధించి వివిధ ప్రాంతాలకు చెందిన డ్యాన్స్‌లు చేసి ‘వారేవా’ అనిపించుకున్నాడు. ‘మీ డ్యాన్స్ చూస్తుంటే భారతీయ పౌరసత్వం ఇవ్వాలనిపిస్తుంది’. ‘మా దేశంలోని కొన్ని అద్భుతమై డ్యాన్స్‌లను మిస్ అయ్యారు. వాటిని కూడా చేస్తే బాగుంటుంది’ అంటూ వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈడీ పీపుల్ షేర్ చేసిన డ్యాన్స్ వీడియోలపై నెటిజనులు స్పందించారు.
(చదవండి: ఏం చిక్కొచ్చి పడింది! అటు చూస్తే.. జవాన్!.. ఇటు చూస్తే.. ఆఫీస్..!)
Comments
Please login to add a commentAdd a comment