అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్ దిగ్గజం యాపిల్ 185 మంది ఉద్యోగులను తొలగించిందన్న వార్త సంచలనంగా మారింది. ఇందులో భారతీయ ఉద్యోగులు, ముఖ్యంగా తెలుగువారు ఉన్నారంటూ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.
యాపిల్ మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రోగ్రామ్‌కు సంబంధించి నిధుల దుర్వినియోగం చేసి జీతాల్లో మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై కాలిఫోర్నియా కుపెర్టినో హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులపై వేటు వేసింది. వీరిలో ఆరుగురిపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఉద్యోగుల తొలగింపుపై యాపిల్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట సంచలనంగా మారింది.
యాపిల్ తొలగించిన ఉద్యోగులలో భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు కూడా ఉన్నారు. తొలగించిన ఆరుగురి ఉద్యోగులకు బే ఏరియాలోని అధికారులు వారెంట్లు కూడా జారీ చేశారు. ఈ ఆరుగురు ఇండియన్స్‌గా గుర్తించబడనప్పటికీ, గణనీయమైన సంఖ్యలో భారతీయులు ఉండవచ్చని సమాచారం. వీరంతా ఆమెరికాలోని కొన్ని తెలుగు స్వచ్ఛంద సంస్థలతో కలిపి ఈ దుర్వినియోగం పాల్పడినట్టు తెలుస్తోంది.
అక్రమాలు తెరలేచింది ఎలా?
ఉద్యోగుల్లో సామాజిక బాధ్యత పెంచేందుకు, లాభేతర సంస్థల సేవాకార్యక్రమాలకు విరాళాలిచ్చేందుకు సంస్థ ఉద్యోగులను ప్రోత్సహిస్తుంది. అంటే తమ ఉద్యోగులు ఏదైనా స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తే, దానికి కొంత మ్యాచింగ్ గ్రాంట్ కలిపి ఆ సంస్థకు విరాళంగా ఇస్తుంది యాపిల్. ఇక్కడే ఉద్యోగులు అక్రమాలకు తెరలేపారు. ఆయా సంస్థలతో కుమ్మక్కై స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చిన సొమ్మును తమ ఖాతాలో వేసుకునేవారు.
ఇవీ చదవండి: గర్భసంచి తీసివేత ఆపరేషన్లు, షాకింగ్ సర్వే: మహిళలూ ఇది విన్నారా?
పార్కింగ్ స్థలంలో కంపెనీ : కట్ చేస్తే..యూకే ప్రధానికంటే మూడువేల రెట్లు ఎక్కువ జీతం
అమెరికన్ చైనీస్ ఇంటర్నేషనల్ కల్చరల్ ఎక్స్ఛేంజ్ (ACICE) , Hop4Kids అనే రెండు లాభాపేక్షలేని సంస్థలకు విరాళాల ఇచ్చినట్టుగా తప్పుగా చూపించారు.ఇలా మూడు సంవత్సరాల వ్యవధిలో ఆరుగురు వ్యక్తులు సుమారు 152వేల డాలర్ల అక్రమాలనకు పాల్పడ్డారని శాంటా క్లారా కౌంటీ జిల్లా అటార్నీ కార్యాలయం పేర్కొంది. అభియోగాలు మోపబడిన వారిలో సియు కీ (అలెక్స్) క్వాన్, యథీ (హేసన్) యుయెన్, యాట్ సి (సన్నీ) ఎన్జి, వెంటావో (విక్టర్) లి, లిచావో నీ మరియు జెంగ్ చాంగ్ ఉన్నారు.
తానాపై ఎఫ్‌బీఐ కన్ను
టైమ్స్‌ఆఫ్ ఇండియా నివేదికలప్రకారం ఈ సంఘటనలతో పాటు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) వివిధ కార్పొరేషన్‌ల నుండి మ్యాచింగ్ గ్రాంట్‌ల దుర్వినియోగానికి సంబంధించి FBI విచారిస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా యూఎస్ జిల్లా కోర్టు గ్రాండ్ జ్యూరీ తానాకు సబ్‌పోనా జారీ చేసింది. డిసెంబర్ 26న హాజరు కావాల్సిందిగా డిసెంబర్ 12న జారీ చేసింది.దీనిపై తానాకు ఒక నెల పొడిగింపు లభించినట్టు కూడా తెలుస్తోంది. అలాగే 2019 నుండి 2024 వరకు వివిధ స్థానాల్లో ఉన్న తానా ప్రతినిధులందరికీ అందిన విరాళాలు, ఖర్చులు , సమాచారాన్ని డాక్యుమెంటేషన్‌గా ఉంచాలని కోర్టు ఆదేశించింది.
మరోవైపు ఈ ఆరోపణలపై అటు యాపిల్ నుంచిగానీ, ఇటు తానా నుంచి గానీ ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.
Comments
Please login to add a commentAdd a comment