లండన్: నూతన సంవత్సరం సందర్భంగా బ్రిటన్ రాజు చార్లెస్–3 అందించే గౌరవ పురస్కారాల జాబితాలో 30 మందికి పైగా భారత సంతతి వారికి చోటు లభించింది. క్రీడలు, ఆరోగ్య సంరక్షణ, విద్యారంగం, స్వచ్ఛంద సేవ సహా పలు రంగాల్లో ఆదర్శంగా నిలిచిన 1,200 మందిని జాబితాలో చేర్చారు. ‘‘వీరంతా సాధారణ వ్యక్తులే. అయినా అసాధారణ రీతిలో ప్రజా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు’’అని బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ ప్రశంసించారు. వారి అద్భుత సేవలను గుర్తించడాన్ని గౌరవంగా తమ ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్పారు. ‘‘వీరిలో చాలామంది ఓవైపు ఉద్యోగాలు చేస్తూనే సంఘ సేవను కొనసాగిస్తున్నారు. వీరిలో 12 శాతం మందిది మైనారిటీ నేపథ్యం’’అంటూ కేబినెట్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
జాబితాలో పలు రంగాల వారు
శ్రీలంక, భారత మూలాలున్న బ్రిటన్ ఎంపీ రణిల్ మాల్కమ్ జయవర్ధనేకు రాజకీయ, ప్రజాసేవ రంగాల్లో నైట్‌హుడ్ దక్కనుంది. విద్యారంగంలో సేవలకు సత్వంత్ కౌర్ డియోల్ ‘కమాండర్స్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్’గౌరవం దక్కించుకున్నారు. న్యాయరంగంలో సేవలకు చార్లెస్ ప్రీతమ్ సింగ్ ధనోవా, ఆరోగ్యం, శాస్త్ర సాంకేతిక రంగాల నుంచి ప్రొఫెసర్ స్నేహ ఖేమ్కా కూడా గౌరవ పురస్కారాలు అందుకోనున్నారు.
జాబితాలో లీనా నాయర్, మయాంక్ ప్రకాశ్, పూరి్ణమ మూర్తి తణుకు, కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ సంజయ్ ఆర్య, ప్రొఫెసర్ నందినీ దాస్, తర్సేమ్ సింగ్ ధలీవాల్, జాస్మిన్ దోతీవాలా, మోనికా కోహ్లి, శౌర్య మజుందార్, సీమా మిశ్రా, ఉష్మా మన్‌హర్ పటేల్, గ్యాన్ సంగ్ పవర్, శ్రావ్యా రావ్, మన్‌దీప్ కౌర్ సంఘేరా, సౌరజ్ సింగ్ సిద్ధూ, స్మృతీ శ్రీరామ్, టెక్ నిపుణుడు దలీమ్ కుమార్ బసు, నర్సింగ్ చీఫ్ మారిమౌత్ కౌమరసామి, రుమటాలజిస్ట్ ప్రొఫెసర్ భాస్కర్ దాస్‌గుప్తా, పీడియాట్రిక్ హెమటాలజిస్ట్ ప్రొఫెసర్ అజయ్ జైకిషోర్ వోరా, కమ్యూనిటీ వర్కర్లు సంజీబ్ భట్టాచార్య, జగ్‌రూప్ బిన్నీ, పోస్టల్ వర్కర్ హేమంద్ర హిందోచా, స్వచ్ఛంద కార్యకర్త జస్వీందర్ కుమార్, సంగీతకారుడు బల్బీర్‌సింగ్ ఖాన్‌పూర్ భుజాంగీ తదితరులకూ జాబితాలో చోటు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment