Filter Coffee: ఫిల్టర్‌ కాఫీ క్రేజ్‌ అలాంటిది మరి..అందుకే! | Indian Filter Coffee Ranks No.2 In The List Of Top 38 Coffees In The World | Sakshi
Sakshi News home page

Filter Coffee: ఫిల్టర్‌ కాఫీ క్రేజ్‌ అలాంటిది మరి..అందుకే!

Published Tue, Mar 11 2025 12:20 PM | Last Updated on Tue, Mar 11 2025 12:26 PM

Indian Filter Coffee Ranks No.2 In The List Of Top 38 Coffees In The World

ప్రపంచ టాప్‌ 38 కాఫీల జాబితాలో మన ఫిల్టర్‌ కాఫీకి రెండో స్థానం

ట్రావెల్ గైడ్ ప్లాట్‌ఫామ్ టేస్ట్ అట్లాస్ 'టాప్ 38 కాఫీస్ ఇన్ ది వరల్డ్'  లిస్ట్‌

ఉదయాన్నే గుక్కెడు కాఫీ  కడుపులో పడితే గానీ.. మనసు ప్రశాంతంగా ఉండదు. అసలా  ఆ వాసన  పీల్చగానే వచ్చే ఫీలింగే చాలా రిఫ్రెషింగ్​గా ఉంటుంది. మరి అలాంటి కాఫీ లవర్స్‌కు  గుడ్‌న్యూస్‌.  అదేంటంటే..ట్రావెల్ గైడ్ ప్లాట్‌ఫామ్ టేస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసిన 'టాప్ 38 కాఫీస్ ఇన్ ది వరల్డ్' జాబితాలో మన ఫిల్టర్‌ కాఫీ ట్యాప్‌ ప్లేస్‌లో చోటు దక్కించుకుంది.  ప్రపంచ టాప్‌ 38 కాఫీల జాబితాలో ఫిల్టర్‌ కాఫీకి రెండో స్థానం దక్కింది.  

ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల కాఫీ గింజలు,   పలురకాల కాఫీలు పలురకాలున్నప్పటికీ ఫిల్టర్‌ కాఫీ కున్నప్రత్యేకతే వేరు.  అందులోనూ భారతీయులు ఇష్టంగా తాగేది మాత్రం ఫిల్టర్‌ కాఫీనే. మరీ ముఖ్యంగా సౌతిండియాలో ఫిల్టర్‌ కాఫీకి ఉన్న డిమాండే వేరు.ఫుడ్‌ అండ్‌ ట్రావెల్‌  టావెల్‌ గైడ్‌ ప్లాట్‌ఫాం టేస్ట్‌ అట్లాస్‌ ఇటీవల విడుదల చేసిన ప్రపంచ టాప్‌ 38 కాఫీల జాబితాలో మన ఫిల్టర్‌ కాఫీ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నది.కాఫీ రుచి,వాసన, కాఫీ తయారీకి ఉపయోగించే సాంప్రదాయ , ప్రత్యేకమైన పద్ధతుల  ఆధారంగా  ఈ ర్యాంకింగ్‌లను ఇచ్చారు.

మొదటి ప్లేస్‌లో క్యూబాకు చెందిన ఎస్ప్రెస్సో నిలిచింది. దీన్ని డార్క్‌ రోస్టెడ్‌ గింజలతో  కాఫీ కాచేటప్పుడు చక్కెర కలుపుతారు. దీనిని స్టవ్‌టాప్ ఎస్ప్రెస్సో మేకర్‌లో లేదా ఎలక్ట్రిక్ ఎస్ప్రెస్సో మెషీన్‌లో తయారు చేస్తారు. ఇండియన్ ఫిల్టర్ కాఫీని ఇండియన్ కాఫీ ఫిల్టర్ మెషీన్‌ని ఉపయోగించి తయారు చేస్తారు. స్టెయిన్‌లెస్ స్టీల్‌ ఫిల్టర్‌ పైభాగంలో కాఫీ పౌడర్‌ వేసి, వేడి నీళ్లు పోస్తారు. దీని అడుగు భాగా ఉన్న చిన్న చిన్న రంధ్రాల ద్వారా, చుక్క చుక్కలుగా కింద వున్న  మరో గిన్నెలో పడతాయి. దీన్ని  పాలతో మరిగించి, చక్కెర కలుపుకొని తాగుతారు.ఘిక  మూడు, నాలుగు స్థానాల్లో గ్రీస్‌కు చెందిన రెండు రకాల కాఫీలు  చోటు దక్కించుకున్నాయి. ఇటలీకి చెందిన క్యాపచినో ఐదో స్థానంలో, తుర్కియేకు చెందిన టర్కిష్‌ కాఫీ ఆరోస్థానంలో, ఇటలీకే చెందిన కాఫీ రిస్ట్రెట్టో 7వ స్థానంలో, గ్రీస్‌కు చెందిన ఇంకో రకం ఫ్రాప్పె 8వ స్థానంలో, జర్మనీకి చెందిన ఐస్కాపీ 9వ స్థానంలో నిలువగా.. చివరిగా పదో స్థానంలో వియత్నాంకు చెందిన వియత్నాంకు చెందిన ఐస్‌డ్‌ కాఫీ నిలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement