Atlas
-
బెస్ట్ బీన్స్ డిషెస్‌లో.. మన భారతీయ వంటకం ఇదే..!
ప్రపంచంలోనే అత్యుత్తమ బీన్స్ రెసీపీల్లో మన భారతీయ వంటకం చోటు దక్కించుకుంది. ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన 50 అత్యుత్తమ బీన్స్ వంటకాల జాబితాలో మన భారతీయ వంటకం కూడా నిలిచింది. ఈసారి నవంబర్ 2024 విడుదల చేసిన 50 బెస్ట్ బీన్స్ ఆహార జాబితా ర్యాకింగ్‌లో మన భారతీయ వంటకం రాజ్మా 14వ స్థానంలో నిలవడం విశేషం. గతేడాది ఫుడ్ గైడ్ ఇచ్చిన బెస్ట్ రెసిపీల జాబితాలో రాజ్మా, రాజ్మా చావెల్ కూడా చోటు దక్కించుకున్నాయి. ఈ బెస్ట్ బీన్స్ వంటకాల్లో తొలిస్థానం మెక్సికోకు చెందిన ప్యూరీ బీన్ సూప్ సోపా తారాస్కా చోటు దక్కించుకుంది. ఆ తర్వాత హైతీకి చెందిన దిరి అక్ప్వా రెండో స్థానం కాగా, ఇక మూడో స్థానంలో బ్రెజిల్‌కు చెందిన ఫీజావో ట్రోపీ నిలిచింది. ఇంతకు ముందు టేస్ట్ అట్లాస్ 50 బెస్ట్ డిప్స్ జాబితా విడుదల చేయగా..అందులో రెండు భారతీయ చట్నీలు చోటుదక్కించుకున్నాయి. పైగా వాటిని ఇంట్లోనే మసాలాలతో తయారు చేసే రుచికరమైన చట్నీలుగా అభివర్ణించింది. కాగా, ఈ రాజ్మా కర్రీ వివిధ సుగంధ ద్రవ్యాలతో చేసిన చిక్కటి గ్రేవీలా ఉంటుంది. ఉత్తర భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన శాకాహార వంటకాల్లో ఇది ఒకటి. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) (చదవండి: స్ట్రిక్ట్ డైట్ పాటించకుండానే బరువు తగ్గొచ్చు..!) -
ది బెస్ట్ సీఫుడ్ డిష్‌గా ఈ భారతీయ కర్రీకి చోటు!..ఎన్నో స్థానం అంటే..?
భారతదేశంలోని తీర ప్రాంతాలు సీఫుడ్‌కి పేరుగాంచినవి. మన దేశంలో సముద్రపు ఆహారానికి సంబంధించిన అనేక ఐకానిక్ కూరలు ఉన్నాయి. ప్రముఖ ఫుడ్, ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ఇంత వరకు బెస్ట్ వెజ్ కర్రీ, బెస్ట్ స్వీట్స్,బెస్ట్ రెస్టారెంట్స్ వంటి జాబితాను అందించింది.అలానే తాజాగా ప్రపంచంలోని 50 ఉత్తమ సీఫుడ్స్ డిష్‌ల జాబితాను విడుదల చేసింది.భారతదేశంలోని తీరప్రాంతాలు మంచి రుచికరమైన సీఫుడ్లను అందించడంలో అపారమైన పాక నైపుణ్యం కలిగి ఉంది. ఇవి ఎల్లప్పుడు ది బెస్ట్ సముద్రపు ఆహార వంటకాలుగా నిలుస్తాయి. పైగా ప్రజల మనసును కూడా దోచుకుంటాయి. అయితే టేస్ట్ అట్లాస్ ఇచ్చిన ది బెస్ట్ సీ ఫుడ్ జాబితాలో మన భారతీయ సీఫుడ్ కర్రీకి స్థానం దక్కడం విశేషం. జూలై 2024న విడుదల చేసిన ర్యాంకింగ్‌లలో మన భారతదేశంలోని బెంగాలీ రుచికరమైన వంటకం చింగ్రి మలై కర్రీ 31వ స్థానంలో నిలిచింది. ఇది మంచి ఘుమఘమలాడే రొయ్యల కర్రీ. దీన్ని కొబ్బరిపాలు, రొయ్యలు, గరం మాసాలాలు, ఆవాల నూనెతో తయారు చేస్తారు. దీని తయారీలో వేడి మిరపకాయలు, వెల్లుల్లి వేయించాలి, అల్లం పేస్టు, దాల్చిన చెక్కె, చక్కెర, ఏలుకులు చేర్చి.. చిక్కటి గ్రేవితో సర్వ్ చేశారు. ఇది దశల వారీగా ఓపికతో తయారు చేయాల్సిన రుచికరమైన వంటకం. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) (చదవండి: అనంత్ అంబానీ వాచ్..వామ్మో..! అంత ఖరీదా?) -
ది బెస్ట్ మ్యాంగో రెసిపీల్లో మామిడి చట్నీ ఎన్నో స్థానం అంటే..!
పండ్లలో రారాజు మామిడి పండు. దీనితో చాలా చోట్ల పలు రకాల రెసీపీలు, స్వీట్లు చేస్తుంటారు. ముఖ్యంగా ఆంధ్రలో అయితే మామిడి తాండ్ర వంటి వివిధ రకా స్వీట్లను తయారు చేస్తారు. ఇక కొన్ని చోట్ల చట్నీలు, డిజర్ట్లు చేస్తుంటారు. అలాంటి భారతీయ వంటకాలన్నింటికి ప్రపంచ వేదికపై గుర్తింపు లభించింది. టేస్ట్ అట్లాస్ ఇంత వరకు బెస్ట్ కర్రీ, బెస్ట్ డిజార్ట్ వంటి ర్యాకింగ్‌లు ఇస్తున్న సంగతి తెలిసిందే. అలానే ఈసారి మ్యాంగోతో తయారు చేసే ఉత్తమ వంటకాల జాబితా ఇచ్చింది. వాటిలో రెండు భారతీయ వంటకాలు అగ్రస్థానంలో ఉన్నాయి. అవి రెండు తొలి టాప్ 10 జాబితాలోనే ర్యాంకులు పొందాయి. ముఖ్యంగా పశ్చిమ రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్‌లలో రుచికరమైన వంటకంగా పేరుగాంచిన ఆమ్రాస్ తొలి స్థానం నిలిచింది. ఇది ప్యూరీ విత్ మ్యాంగో జ్యూస్‌తో తయారు చేస్తారు. ఈ జ్యూస్‌ని పొడి అల్లం లేదా ఏలుకులతో జత చేసి కూడా తయారు చేస్తారు. ఈ జాబితాలోనే భారతీయ మామిడి చట్నీ కూడా ఐదో స్థానం దక్కించుకోవడం విశేషం. ఈ చట్నీని దాల్చిన చెక్కలు, యాలకులు, బ్రౌన్ షుగర్, వెనిగర్ వంటి వాటితో తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ చట్నీ తయారీలో కొద్దిపాటి వైవిధ్యాలు కూడా ఉన్నాయి. ఇక ది బెస్ట్ మ్యాంగో రెసీపీల జాబితాలో థాయిలాండ్‌కు చెందిన మ్యాంగో స్టిక్కీ రైస్ రెండో స్థానం దక్కించుకుంది. ఈసారి టేస్ట్ అట్లాస్ ఇచ్చిన వరల్డ్‌లోనే 50 బెస్ట్ మ్యాంగో రెసీపీలలో భారతీయ మామిడి వంటకాలే తొలి పది స్థానాల్లో నిలవడం విశేషం.(చదవండి: ఆ సమస్యలు ఉంటే.. పెరుగుతో ఈ ఆహారాలు జత చెయ్యొద్దు!) -
ప్రపంచంలోనే బెస్ట్ డెజర్ట్‌గా భారతీయ స్వీట్!
ప్రపంచంలోనే అత్యుత్తమ డెజర్ట్‌గా భారతీయ తీపి వంటకానికి చోటు దక్కింది. టాప్ 10 బెస్ట్ చీజ్ డెజర్ట్‌లో ఈ భారతీయ తీపి వంటకం ఒకటిగా నిలిచింది. ఇంతవరకు ప్రముఖ ఫుడ్ గైడ్ సంస్థ టేస్ట్ అట్లాస్ బెస్ట్ కూర, బెస్ట్ కాఫీ, బెస్ట్ అల్పహార జాబితాను విడుదల చేసింది. తాజాగా భోజనం తర్వాత హాయిగా ఆస్వాదించే డెజర్ట్(స్వీట్) రెసిపీల జాబితాను విడుదల చేసింది. టేస్ట్ అట్లాస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 10 బెస్ట్ చీజ్ డెజర్ట్‌ల జాబితాను విడుదల చేసింది. అందులో భారత్‌లోని పశ్చిమ బెంగాల్‌కు చెందిన 'రసమలై' రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఈ 'రసమలై' స్వీట్‌ని ఇష్టపడని వారుండరు. దీన్ని పాలు, పంచదార, కుంకుమ పువ్వు, నిమ్మరసం వంటి వాటితో తయారు చేస్తారు. దీన్ని తీసుకుంటే కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి. హోళీ, దీపావళి వంటి పండగల సమయాల్లో దీనిని ఎక్కువగా తయారు చేస్తారు. ప్రపంచంలోని అత్యుత్తమ చీజ్ డెజర్ట్‌లలో ఒకటిగా ఈ రసమలై గుర్తింపు పొందడం భారతదేశం గొప్ప పాక వారసత్వానికి ఈ తీపి వంటకంగా నిదర్శనంగా అని పలువురు పేర్కొన్నారు. ఇక ఈ జాబితాలో పోలాండ్‌కు చెందిన సెర్నిక్కి తొలి స్థానం దక్కించుకుంది. పోలాండ్‌కు చెందిన సెర్నిక్ అనేది గుడ్లు, చక్కెర ట్వరోగ్తో తయారు చేసే చీజ్ వంటకం. ఇది ఒక రకమైన పెరుగు చీజ్. ఈ చీజ్ సాధారణంగా చిన్న ముక్కలుగా ఉండే కేక్‌లా తయారు చేస్తారు. దీన్ని ఒక్కోసారి బేక్ చేస్తారు లేదా బేక్ చేయకుండానే కూడా చేయొచ్చు. ఇది చూడటానికి స్పాంజ్ కేక్‌లా జెల్లిలా ఉండి పైన ఫ్రూట్స్‌తో అలంకరించి ఉంటుంది. టేస్టీ అట్లాస్ విడుదల చేసిన ఈ చీజ్ డెజర్ట్‌ల జాబితాలో జపనీస్ చీజ్,బాస్క్ చీజ్ వంటి ఇతర ప్రసిద్ధ చీజ్ డెజర్ట్‌లు కూడా ఉన్నాయి. టేస్టీ అట్టాస్ విడుదల చేసిన ఉత్తమ చీజ్ డెజర్ట్ పూర్తి జాబితా సవివరంగా ఇదే.. 1. సెర్నిక్, పోలాండ్ 2. రసమలై, భారతదేశం 3 3. స్ఫకియానోపిటా, గ్రీస్ 4. న్యూయార్క్ తరహా చీజ్, USA 5. జపనీస్ చీజ్, జపాన్ 6. బాస్క్ చీజ్, స్పెయిన్ 7. రాకోజీ టురోస్, హంగరీ 8. మెలోపిటా, గ్రీస్ 9. కసెకుచెన్, జర్మనీ 10. మిసా రెజీ, చెక్ రిపబ్లిక్ View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) (చదవండి: బెస్ట్ శాండ్‌విచ్‌గా ఈ భారతీయ స్ట్రీట్ ఫుడ్‌కి చోటు! ఎన్నో ర్యాంకులో నిలిచిందంటే..) -
బెస్ట్ శాండ్‌విచ్‌గా ఈ భారతీయ స్ట్రీట్ ఫుడ్‌కి చోటు!
ప్రపంచంలోనే అత్యుత్తమ శాండ్‌విచ్‌గా ఈ భారతీయ స్ట్రీట్ ఫుడ్‌కి చోటు దక్కింది. టాప్ 20 బెస్ట్ శాండ్విచ్లో ఈ భారతీయ వంటకం ఒకటిగా నిలిచింది. ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ప్రపంచంలోని అత్యుత్తమ శాండ్విచ్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారతీయ స్ట్రీట్ ఫుడ్ అయిన వడ పావ్క చోటు దక్కింది. ఆ జాబితాలో ఈ రెసిపీ 19వ స్థానంలో నిలవడం విశేషం. టేస్ట్ అట్లాస్ ప్రకారం..ఈ ఐకానిక్ స్ట్రీట్ ఫుడ్ తయారీ ముంబైలోని ఓ వీధి వ్యాపారి నుంచి మొదలయ్యిందని పేర్కొంది. 1960-1970లలో దాదర్ రైలు స్టేషన్ సమీపంలో పనిచేసిన ఆశోక్ వైద్య అనే వీధి వ్యాపారీ ఈ వంటకాన్ని తయారు చేసినట్లు వెల్లడించింది. ఆయన అక్కడ పనిచేసే కార్మికుల ఆకలి తీర్చేలా మంచి వంటకాన్ని తయరు చేయాలని, అలాగే అది సులభంగా త్వరిగతిన చేయగలిగేలా ఉండాలని అనుకున్నారట. అప్పుడే ఈ రుచికరమైన వడాపావ్‌ని తయారు చేసినట్లు తెలిపింది. అలాఅలా ఇది వీధి స్టాల్స్ నుంచి ప్రుమఖ రెస్టారెంట్ల వరకు ప్రతి చోటా తయారయ్యే మంచి రుచికరమైన చిరుతిండిగా పేరుగాంచింది. ఈ జాబితాలో థంబిక్ డోనర్, బన్హమీ, షోర్మా వంటి చిరుతిండ్లు అగ్రస్థానంలో ఉన్నాయి. అందుకు సంబంధించిన పూర్తి జాబితాను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది టేస్టీ అట్లాస్. అలాగే ఇటీవల టేస్టీ అట్లాస్ విడుదల చేసి అత్యుతమ కాఫీ జాబితాలో భారతీయ ఫిల్టర్ కాఫీ రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) (చదవండి: మన దేశంలోని టాప్ మహిళా చెఫ్‌లు వీరే!) -
వరల్డ్ బెస్ట్ లిస్ట్‌లో భారత ఫిల్టర్ కాఫీ
కాఫీ గుమాళింపు ముక్కు పుటలకు తాకగానే హా! అని ఆస్వాదించేందుకు రెడీ అయిపోతాం. అలాంటి కాఫీలలో అత్యుత్తమమైన కాఫీల జాభితాను ఫుడ్ అండ్ ట్రామెల్ గైడ్ ఫ్లాట్‌ఫాం టేస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసింది. మొత్తం 38 అత్యుత్తమమైన కాఫీ జాబితాలను విడుదల చేయగా, అందులో భారతీయ ఫిల్టర్ కాఫీ రెండో స్థానం దక్కించుకుంది. తొలి స్థానంలో క్యూబాకి చెందిన క్యూబన్ ఎస్ప్రెస్సో కాఫీ నిలిచింది. ఈ క్యూబన్ ఎస్ప్రెసో అనేది డార్క్ రోస్ట్ కాఫీ. దీన్ని పంచదారను ఉపయోగించి తయారు చేసే షాట్స్‌లా ఉంటుంది. కాఫీ కాచేటప్పుడు కొద్దిగా చక్కెర స్టవ్ టాప్ ఎస్ర్పెస్సో మేకర్లో లేదా ఎలక్ట్రిక్ ఎస్ప్రెస్సో మెషిన్లో తయారు చేస్తారు. దీనిపై లేత గోధుమ రంగు నురుగ కూడా ఉంటుంది. ఇక భారతీయ ఫిల్టర్ కాఫీ స్టెయిన్లెస్ స్టీల్‌లో తయారు చేస్తారు. ఇందులో రెండు గదులుగా ఉంటుంది. పైభాగం చిల్లులగా ఉండి దిగువ భాగంలో కాఫీని ఉంచడానికి ఉపయోగాస్తారు. దిగువున ఉన్న గది నుంచి నెమ్మదిగా కాఫీ బయటకు రావడం జరగుతుంది. దక్షిణ భారతదేశంలో విస్తృత ప్రాచుర్యం పొందింది ఈ కాఫీ. చాలామంది వ్యక్తులు రాత్రిపూట ఈ ఫిల్టర్ కాఫీని ఏర్పాటు చేసుకుని ఉదయాన్నే ఈ తాజా కాఫీ మిశ్రమానికి వెచ్చని పాలు, చక్కెర కలుపుతారు. ఈ కాఫీ ఉక్కు లేదా ఇత్తడితో చేసిన చిన్న గ్లాస్లో సర్వ్ చేస్తారు. దీంతోపాటు దబారా అనే చిన్న గిన్నెలాంటి సాసర్ ఉంటుంది. సర్వ్ చేసే ముందు చక్కగా తిరగబోసి నురుగు వచ్చేలా అందంగా సర్వ్ చేయడం జరుగుతుంది. కాగా, టేస్లీ అట్లాస్ ప్రకటించిన ప్రపంచంలోని అత్యుత్తమ పది కాఫీల జాబితాలో ఏయే దేశాల కాఫీలు ఉన్నాయంటే.. 1. క్యూబన్ ఎస్ప్రెస్సో (క్యూబా) 2. సౌత్ ఇండియన్ కాఫీ (భారతదేశం) 3. ఎస్ప్రెస్సో ఫ్రెడ్డో (గ్రీస్) 4. ఫ్రెడ్డో కాపుచినో (గ్రీస్) 5. కాపుచినో (ఇటలీ) 6. టర్కిష్ కాఫీ (టర్కీయే) 7. రిస్ట్రెట్టో (ఇటలీ) 8. ఫ్రాప్పే (గ్రీస్) 9. ఐస్కాఫీ (జర్మనీ) 10. వియత్నామీస్ ఐస్డ్ కాఫీ (వియత్నాం) (చదవండి: అక్కడ మహిళలదే పైచేయి..అబ్బాయే అత్తారింటికి వస్తాడు..ఎక్కడంటే..!) -
పోయిన వాలెట్ ఏకంగా 65 ఏళ్ల తర్వాత యజమానికి చేరింది! ఎలాగంటే..?
కొన్ని వస్తువులు పోతే మళ్లీ మనకు చేరడం అసాధ్యం. ఎవరో కొంతమంది మంచివాళ్లు సదరు యజమానికి అందేలా చేయాలనకుంటే గానీ దొరకదు. అలా సహృదయంతో తిరిగే ఇచ్చివాళ్లు అరుదు. అలాంటిది ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం పోయిన వాలెట్ ఏకంగా 65 ఏళ్ల తర్వాత యజమాని తాలుకా కుటుంబసభ్యులను చేరుకుంటే ఆ వ్యక్తి జ్ఞాపకాలు కళ్ల ముందు ఒక్కసారిగా మెదులుతాయి. ఇలాంటి ఘటన ఎవ్వరికో గానీ జరగదు. అసలు ఆ వాలెట్ ఎలా పోయింది?. ఎవరు ఆ వాలెట్‌ని యజమాని కుటుంబసభ్యుల వద్దకు చేర్చారంటే.. అట్లాంటాలోని పురాతన ప్లాజా థియోటర్ ఒకటి ఉంది. దాన్ని మరమత్తు చేస్తుండగా ఆ థియోటర్ వెనుకవైపున ఉన్న బాత్రూం గోడ కూలిపోయింది. దీంతో వాలెట్ బయటపడింది. దానిలో కొన్ని మాగ్నటిక్ స్ట్రిప్లేని క్రెడిట్లు, సినిమా టిక్కెట్, ఫ్యామిలీకి సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఉన్నాయి. దీంతో ఆ ధియోటర్ యజమాని క్రిస్ ఎస్కోబార్ సదరు వ్యక్తి కుటుంబానికి ఇప్పటికైన అందేలా చేయాలనుకున్నాడు. అయితే 1959లో చేవ్రోలెట్ సినిమా చూడటాని వచ్చి పోగొట్టుకున్నట్లు వాలెట్లో ఉన్న టికెట్‌ని చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఆ వాలెట్ యజమాని లేదా అతడి కుటుంబ సభ్యులకు అయినా దీన్ని అందేలా చేయాలన అనుకుంటాడు క్రిస్. అయితే ఆ కుటుంబం మునుపు ఈ పరిసరాల్లోనే ఉండొచ్చేమో గానీ ఇప్పుడూ చాల ఏళ్లు అయ్యింది కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉంటుందనేది కనిపెట్టడం అసాధ్యంగా అనిపించింది క్రిస్ ఎస్కోబార్‌కి. దీంతో ఆ వ్యాలెట్‌లో ఉన్న లైసెన్స్ కార్డుల ఆధారంగా వ్యాలెట్ పోగొట్టుకున్న వ్యక్తి స్త్రీని అని కనుగొంటారు. ఆమె పేరు ఫ్లాయ్ కల్బ్రేత్గా గుర్తించారు. అయితే ఆ కాలంలో స్త్రీలు తమ భర్తల పేరుతో పిలిచేవారు. దీంతో ఆమె అడ్రస్ కనుగొనడం మరింత కష్టంగా మారింది. దీంతో క్రిస్ తన భార్య సాయం తీసుకుంటాడు. ఆమె ఇంటర్నెట్లో సోధించగా కల్‌బ్రెత్ మరణించినట్లు గుర్తిస్తుంది. దీన్ని బట్టి ఫ్లాయ్ ఆమె పేరు అని అర్థం చేసుకుంటారు ఆ దంపతులు. అంతేగాదు కల్‌బ్రెత్ పేరు మీద కల్‌బ్రెత్ కప్ అనే గోల్ఫ్ టోర్నమెంట్ వెబ్‌సైట్‌ను కనుగొంటారు. అతడి కుటుంబ చిన్నపిల్లలకు వచ్చే మస్తిష్క పక్షవాతం(Cerebral Palsy) అనే ఛారిటీ సంస్థ కోసం ఈ టోర్నమెంట్‌ని నిర్వహిస్తున్నట్లు తెలుసుకుంటారు. అలా ఫ్లాయ్ కుమార్తె థియా చాంబర్‌లైన్‌ను కనుగొంటారు. ఆమెకు ఈ వ్యాలెట్‌ని అందజేస్తాడు క్రిస్. దీంతో ఆమె ఒక్కసారిగా ఆ వ్యాలెట్‌ని తీసుకుంటూ తన తల్లి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది. ఆమె చాలా అందంగా ఉంటుందని, మంచి వ్యక్తిత్వం గలదంటూ ఉద్వేగం చెందుతుంది. ఆమె వ్యాలెట్‌లో భీమా కార్డులు, డాక్టర్ అపాయింట్మెంట్ నోట్లు కనుగొంటుంది. ట్విస్ట్ ఏంటంటే థియా చాంబర్‌లైన్‌కు ఇప్పుడు 71 ఏళ్లు. ఈ వ్యాలెట్ పోయినప్పుడు ఆమెకు ఆరేళ్లు. ఈ మేరకు ఆ థియోటర్ యజమాని క్రిస్ మాట్లాడుతూ..తమకు మనవళ్లు, మునివళ్లు, మనవరాళ్లు ఉన్నారు. కాబట్టి ఈ కల్బ్రేత్కు కూడా అలానే ఉంటారు కదా. ఈ వ్యాలెట్ కలెబ్రెత్ జ్ఞాపకాలను ఆ కుటంబంలోని తరతరాలకు తెలియజేస్తుంది కదా అంటూ భావోద్వేగానికి గురయ్యాడు క్రిస్. (చదవండి: మీకు తెలుసా? కుక్కలు కూడా రక్తదానం చేయగలవు!) -
Morocco earthquake: వణికిన మొరాకో
మర్రకేశ్: మొరాకోను భారీ భూకంపం వణికించింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక సంభవించిన భూప్రకంపనలతో గాఢ నిద్రలో ఉన్న జనం ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి, వీధుల్లోకి పరుగులు తీశారు. అట్లాస్ పర్వతాల్లోని గ్రామాలు మొదలుకొని చార్రితక మర్రకేశ్ నగరం వరకు వందలాదిగా భవనాలు ధ్వంసం కాగా 1,000 మందికి పైగా ప్రజలు మృతి చెందారు. సుమారు 45 లక్షల మంది నివసించే మర్రకేశ్–సఫి ప్రాంతంలోనే భూకంప నష్టం, మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంచనా. సుదూర ప్రాంతాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాలకు సహాయక బృందాలు చేరుకోవాల్సి ఉండగా మరణాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మర్రకేశ్లోని 12వ శతాబ్దం నాటి చారిత్రక కౌటౌబియా మసీదు భూకంప ధాటికి దెబ్బతింది. ఈ మసీదులోని 226 అడుగుల ఎత్తైన మినారెట్ ‘రూఫ్ ఆఫ్ మర్రకేశ్’గా ప్రసిద్ధి. అదేవిధంగా, నగరం చుట్టూతా ఉన్న ఎర్రటి గోడ అక్కడక్కడా దెబ్బతిన్న దృశ్యాలు స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ గోడను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. భూకంప కేంద్రానికి చుట్టుపక్కలున్న మర్రకేశ్, మరో అయిదు ప్రావిన్స్‌ల్లో వెయ్యి మందికి పైగా చనిపోయినట్లు అంచనా వేస్తున్నారు. మరో 672 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 205 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు మొరాకో ప్రభుత్వం తెలిపింది. భూకంప కేంద్రం సమీపంలోని ఓ పట్టణంలో చాలా వరకు ఇళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా కూలిపోయాయి. రహదారులు దెబ్బతిన్నాయి. పట్టణంలోని కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని స్థానికుడొకరు వెల్లడించారు. అట్లాస్ పర్వతప్రాంతంలోని అల్ హౌజ్ ప్రావిన్స్‌లోని తలత్ ఎన్ యాకూబ్ పట్టణంలో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో అంబులెన్సుల్లో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడం ఇబ్బందిగా మారిందని అధికారులు చెప్పారు. సహాయక చర్యల నిమిత్తం ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. పర్యాటకులను అక్కడి నుంచి సురక్షితంగా బయటకు పంపించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. రహదారులు దెబ్బతినడంతో నిలిచిపోయిన వాహనాల రాకపోకలను పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు. అత్యవసర బృందాలు భవనాల శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం గాలిస్తున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ ప్రాంతంలో చాలా అరుదు ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో భూకంపాలు చాలా అరుదు. మొరాకోలోని పర్వత ప్రాంతంలో ఇంతటి అత్యంత తీవ్ర భూకంపం గతంలో ఎన్నడూ సంభవించలేదని నిపుణులు చెబుతున్నారు. 1960లో 5.8 తీవ్రతతో మొరాకోలోని అగడిర్ నగరంలో సంభవించిన భూకంపంలో వేలాదిగా జనం చనిపోయారు. 2004లో తీరప్రాంత నగరం అల్ హొసైమాలో భూకంపంతో 600 మంది చనిపోయారు. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని దేశంలోని నగరాలు, పట్టణాల్లో భూకంపాలను తట్టుకునే విధంగా భవనాల నిర్మాణం జరిగింది. అయితే, పల్లెల్లో మాత్రం ఇలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. తాజా భూకంపం ప్రభావం పోర్చుగల్, అల్జీరియా వరకు ఉంది. ప్రమాదకర భూకంపం భూకంప తీవ్రత అర్ధరాత్రి 11.11 గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైందని, భూకంపం సంభవించిన 19 నిమిషాల తర్వాత తీవ్రత 4.9గా ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది. భూకంప కేంద్రం అల్ హౌజ్ ప్రావిన్స్‌లోని ఇఘిల్ పట్టణం సమీపంలో, మర్రకేశ్‌కు దక్షిణాన సుమారు 70 కిలోమీటర్ల దూరంలో భూమిలో 18 కిలోమీటర్ల లోతున ఉందని తెలిపింది. తక్కువ లోతులో సంభవించే ఇటువంటి భూకంపాలు అత్యంత ప్రమాదకరమని పేర్కొంది. ప్రపంచదేశాల ఆపన్న హస్తం సాయం కోసం మొరాకో ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి విజ్ఞాపన చేయనప్పటికీ..ఈ ఘోర ప్రకృతి విపత్తుపై ప్రపంచ దేశాల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొరుగునున్న యూరప్ దేశాలు, మధ్యప్రాచ్యం తమ వంతుగా సాయం అందజేస్తామని ప్రకటించాయి. భారత్‌తోపాటు తుర్కియే, ఫ్రాన్స్, జర్మనీ, రష్యాతోపాటు ఉక్రెయిన్ కూడా కష్టాల్లో ఉన్న మొరాకో ప్రజలను ఆదుకుంటామని ఇప్పటికే తెలిపాయి. సాధ్యమైనంత సాయం అందజేస్తాం: మోదీ మొరాకోలో భూకంపంతో పెద్ద సంఖ్యలో ప్రజలు మృతి చెందడంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో మొరాకోకు భారత్ సాధ్యమైనంత మేర ఆదుకుంటుందని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఢిల్లీలో శనివారం మొదలైన జీ20 భేటీ ప్రారంభ కార్యక్రమంలో ఆయన మొరాకో భూకంప మృతులకు సంతాపం ప్రకటించారు. ఈ కష్ట సమయంలో అంతర్జాతీయ సమాజం మొరాకోకు మద్దతుగా నిలవాలనీ, సాధ్యమైనంత మేర సాయం అందించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. -
25% ఓటర్లు 30 ఏళ్లలోపు వారే
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్లలో 18 నుంచి 29 ఏళ్ల వయస్సు వారు నాలుగో వంతు ఉన్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఆవిష్కరించిన అట్లాస్ వెల్లడించింది. 2019 లోక్‌సభ సాధారణ ఎన్నికల విశేషాలతో రూపొందించిన ఈ అట్లాస్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే ఈనెల 15న విడుదల చేశారు. 17వ లోక్‌సభ కోసం జరిగిన 2019 సాధారణ ఎన్నికలు ప్రపంచ చరిత్రలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామిక ప్రక్రియ. అట్లాస్‌లో పొందుపరిచిన ముఖ్యాంశాలు ► మొత్తం 543 నియోజకవర్గాల్లో 8,054 మంది పోటీ చేయగా, అందులో 726 మంది మాత్రమే మహిళా అభ్యర్థులు. 78 మంది మహిళా అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికయ్యారు. ► అత్యధికంగా 185మంది అభ్యర్థులు పోటీపడిన నియోజకవర్గం నిజామాబాద్. అత్యల్పంగా ముగ్గురు మాత్రమే పోటీ చేసిన నియోజకవర్గం తుర(మేఘాలయ). ► వయస్సు పరంగా చూస్తే 18–29 ఏళ్ల మధ్య 25.37 శాతం ఓటర్లు ఉన్నారు. ఈ విభాగంలో అత్యధికంగా మిజోరాంలో 39.77 శాతం, అత్యల్పంగా కేరళలో 20.16 శాతం, తెలంగాణలో 26.08% ఉన్నారు. ► 30–59 మధ్య వయస్సు వారు దేశవ్యాప్త ఓటర్లలో 59.77% ఉన్నారు. రాష్ట్రాల పరంగా చూస్తే ఏపీలో అత్యధికంగా ఈ కేటగిరీలో 62.14% కాగా, తెలంగాణలో 61.37% మంది ఉన్నారు. ► 60–79 ఏళ్ల మధ్య వారు మొత్తం ఓటర్లలో 13.15 శాతం ఉన్నారు. 80 ఏళ్లు పైబడిన వారు మొత్తం ఓటర్లలో 1.71 శాతం ఉన్నారు. ► అత్యధిక ఓటర్లు కలిగిన టాప్–5 నియోజకవర్గాల్లో మొదటిస్థానంలో మల్కాజిగిరి ఉండగా, ఐదో స్థానంలో చేవెళ్ల నిలిచింది. ఈ రెండు నియోజకవర్గాల్లోనే సుమారు 56 లక్షల ఓటర్లు ఉన్నారు. ► అత్యల్పంగా పోలైన ఓట్ల శాతం నమోదైన 10 నియోజకవర్గాల్లో తెలంగాణలోని సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాలు ఉన్నాయి. ► లింగ నిష్పత్తి క్రమంగా మెరుగుపడుతోంది. అత్యధికంగా పుదుచ్చేరిలో ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 1,118 మంది మహిళా ఓటర్లు ఉండగా, ఏపీలో 1,018మంది, తెలంగాణలో 990 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. -
‘అట్లాస్’ మళ్లీ వస్తుందా..?
న్యూఢిల్లీ: అట్లాస్ సైకిల్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. దశాబ్దాలుగా లక్షలాది భారతీయుల కుటుంబాలకు సైకిళ్లను అందించిన ఈ కంపెనీ ఇప్పుడు నిధుల్లేక అల్లాడిపోతోంది. కార్యకలాపాల నిర్వహణకు చిల్లిగవ్వకూడా లేని పరిస్థితి ఏర్పడడంతో దేశ రాజధాని సమీపంలోని సాహిదాబాద్లో ఉన్న చివరి ప్లాంట్‌ను కూడా అట్లాస్ సైకిల్స్ మూసివేసింది. ప్రపంచ సైకిల్ దినోత్సవం అయిన జూన్ 3నే కంపెనీ ప్లాంట్ మూతపడడం యాదృచ్ఛికం. అయితే, ప్లాంట్ మూసివేత తాత్కాలికమేనని కంపెనీ సీఈవో ఎన్పీ సింగ్ రాణా ప్రకటించారు. తాము అనుకున్నట్టుగా కంపెనీ వద్ద మిగులు భూమిని విక్రయించి రూ.50 కోట్లు సమీకరించగలిగితే.. కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. అట్లాస్ సైకిల్స్ సాహిదాబాద్ ప్లాంట్‌లో 431 మంది కార్మికులు పనిచేస్తుండగా.. ఇప్పుడు వారు ఉపాధి కోల్పోయారు. నష్టాల వల్లే..: అట్లాస్ సైకిల్స్‌ను నష్టాలే ముంచేశాయి. 2014 నుంచి ఈ కంపెనీ వ్యాపార కార్యకలాపాలపై నష్టాలను ఎదుర్కొంటోంది. దీంతో 2014 డిసెంబర్లో మలన్పూర్ ప్లాంట్‌కు కంపెనీ తాళాలు వేసేసింది. ముఖ్యంగా గత రెండేళ్ల కాలంలో నష్టాలు మరింత అధికమయ్యాయి. ఫలితంగా 2018 ఫిబ్రవరిలో హరియాణాలోని సోనిపట్ ప్లాంట్‌ను కూడా కంపెనీ మూసేసింది. సోనిపట్ ప్లాంట్ కంపెనీకి మొదటిది. 1951లో దీన్ని జానకిదాస్ కపూర్ ప్రారంభించారు. 1965 నాటికి అట్లాస్ సైకిల్స్ దేశంలోనే అతిపెద్ద సైకిళ్ల తయారీ కంపెనీగా అవతరించింది. విదేశాలకూ కార్యకలాపాలను విస్తరించడం ద్వారా 40 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ప్రపంచంలోనే ప్రముఖ సైకిళ్ల కంపెనీల్లో ఒకటిగా గుర్తింపు సంపాదించుకుంది. 1982లో ఏషియన్ గేమ్స్‌కు సైకిళ్లను సరఫరా చేసింది. తిరిగి వస్తాం..: కంపెనీ సీఈవో రాణా మాత్రం ప్లాంట్ మూసివేత తాత్కాలికమేనని స్పష్టం చేశారు. ‘‘ప్లాంట్‌ను మూసివేయలేదు. దీనిపై ఎంతో తప్పుడు సమాచారం నెలకొని ఉంది. ప్లాంట్‌ను తిరిగి ప్రారంభిస్తాం. ఉద్యోగులను కూడా తొలగించలేదు. తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేశామంతే. మిగులు భూమి విక్రయానికి అనుమతించాల్సిందిగా ఎన్సీఎల్టీకి దరఖాస్తు చేసుకున్నాం. అనుమతి వచ్చిన వెంటనే భూ విక్రయాన్ని చేపట్టి, నిధులు అందిన వెంటనే ప్లాంట్‌ను తిరిగి తెరుస్తాం. కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ సమస్య లేదు. 70 ఏళ్ల బ్రాండ్ మాది. తిరిగి నిలదొక్కుకుంటాం’’ అని రాణా వివరించారు. -
ఏడు గుర్రాల జోడీ
బాల్యానికి బ్రాండెడ్ వెర్షన్ అట్లాస్ సైకిల్ యవ్వనానికి.. ఏడు గుర్రాల జోడీ! బతుకు బాధ్యతల్లో.. బ్యాలెన్స్ తప్పనివ్వని.. హ్యాండిల్. డెబ్బై ఏళ్ల అలసటతో ఇప్పుడు గోడకు వాలింది. చక్రాలు తిరగడం ఆగినంత త్రాన జ్ఞాపకాలు ‘ట్రింగ్’మనడం మానేస్తాయా! ‘‘కష్టంగా ఉంది. రోజు గడిచేటట్లుగా లేదు. డబ్బిచ్చేవాళ్లు లేరు. ముడి సామాను కొనడానికి కూడా కటకటగా ఉంది. బండిని నడపలేం.’’ – జూన్ మూడున ఢిల్లీ శివార్లలోని సాహిబాబాద్‌లో ఒక సైకిల్ ఫ్యాక్టరీ బయట గేటుపై కనిపించిన నోటీసు. రెండుముక్కల్లో ఈ నోటీసుకు అర్థం.. ‘అట్లాస్ మూసివేత’! ర్యాలీ, హీరో, హెర్క్యులస్, హంబర్, బి.ఎస్.ఎ.. తరానికొక సైకిల్ ఉంటుంది ప్రతి ఇంట్లో. అన్ని తరాలనూ వారసత్వంగా మోసుకుంటూ వస్తున్న దేశవాళీ సైకిల్ ‘అట్లాస్’ ఒక్కటే. తొక్కే సైకిల్‌గా మాత్రమే అట్లాస్‌ను మిగతా సైకిళ్లతో పోల్చలేం. బాధ్యతల్ని భుజానికెత్తుకున్న ఇంటిపెద్ద అట్లాస్. సైకిల్‌మీద కనిపించే గుర్తు కూడా అదే. భూగోళాన్ని మోస్తుంటాడు కండలు పొంగిన దృఢకాయుడైన మనిషి. స్వతంత్ర భారతదేశపు తొలినాళ్ల బతుకు చక్రం అట్లాస్. అట్లాస్ మీద ఆఫీస్‌కి. అట్లాస్ మీద కాలేజ్‌కి, అట్లాస్ మీద నాన్న వెనుక సీట్లో బజారుకు. ఇప్పుడు పెద్దవాళ్లుగా ఉన్న ప్రతి ఒక్కరి బాల్యానికి బ్రాండెడ్ వెర్షన్.. అట్లాస్. పెడల్ తొక్కిన కాళ్లు, బెల్లుని ‘ట్రింగ్’ మనిపించిన బొటనవేళ్లు, హ్యాండిల్‌ని తిప్పిన చేతులు ఎప్పటికీ యాక్టివేట్ అవుతూనే ఉంటాయి.. గోడకు వాల్చిన అట్లాస్నో, అటకమీద ఉన్న అట్లాస్నో చూసినప్పుడు! యవ్వనానికి కూడా ఒక బ్రాండెడ్ జోడీ అట్లాస్. ముందుకు వంగి దమ్ము తీసుకుంటూ డబుల్స్ త్రిబుల్స్ కొట్టడం, రేస్‌లు కట్టడం.. కాలం కలిసొస్తే కనుక స్నేహితురాలిని క్యారేజీపై సైడుకు కూర్చోబెట్టుకుని గాలివాటున.. ‘నువ్వంటే నాకిష్టమనీ అన్నది ప్రేమా..’ అని ఆ అమ్మాయి అన్నట్లు ఊహించుకోవడం.. ఇవన్నీ రెండు చక్రాలపై భూభ్రమణం చేసినట్లే ఉండేవి. చదువులై, ప్రేమలై, పెళ్లిళ్లయి, జీవితపు పరుగుల్లో పడ్డాక.. సైకిల్‌చైన్ పడినప్పుడు గానీ గుర్తుకు వచ్చేది కాదు.. కొంచెం పరుగులు ఆపాలని. రాజమౌళి ‘మర్యాద రామన్న’ సినిమాలోలా సైకిళ్లకు (ఆ సినిమాలో ఒక సైకిలే మాట్లాడుతుంది) మాటలొస్తే.. ఏ బ్రాండూ చెప్పలేనన్ని కథల్ని చెబుతుంది అట్లాస్. లూజ్ అయిన నట్టు, టైట్ అయిన బ్రేకు, పంక్చర్ అయిన టైరు, వంకర తిరిగిన హ్యాండిల్, ఒరిగిన స్టాండు, విరిగిన ఊచ.. ప్రతి పార్ట్‌లోనూ పార్ట్–వన్, పార్ట్–టు సీక్వెళ్ల జీవితపు క్షణాలు ఉంటాయి. రయ్యిన మనం తొక్కడమే కాదు.. మొరాయించి మన భుజాలకెక్కి ఎండలో, వానలో మనల్ని ‘చల్ ఛల్ గుర్రం’ అని తోలి, అట్లాస్ తనని నడిపించుకున్న సందర్భమూ అపురూప జ్ఞాపకమే. యాభైలలో సైకిల్ యుగం మొదలైంది. వట్టి సైకిల్ యుగం కాదు. అట్లాస్ సైకిల్ యుగం. నెహ్రూ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం రెండో టెర్మ్ నాటికే ఢిల్లీ రోడ్ల మీదకి వచ్చేసింది అట్లాస్. పెద్ద ఆహ్వానం మీద ఎక్కడికైనా వెళ్లడం కన్నా, అట్లాస్ మీద వెళ్లడం పెద్ద గొప్ప అయింది ఆ సైకిలొచ్చిన కొత్తల్లో! గవర్నమెంట్ సైకిల్లా ఉండేది. ఇండియాలో కలిసిపోతానని కశ్మీర్ ఓటు వేసినప్పుడు ఆ ఫలితాలను అట్లాసే ఇంటింటికీ వెళ్లి పేపర్‌గా వేసింది. ఇందిరాగాంధీ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలు అయినప్పుడు అట్లాసే కార్యకర్తల పూలగుచ్ఛాలకు వాహనం అయింది. శ్రీమతి గాంధీ ప్రధాని అయ్యేనాటికే అట్లాస్ దేశవిదేశాల్లో ప్రముఖ సైకిల్ కంపెనీ. ఆ తర్వాత ప్రత్యేక అతిథిగా అట్లాస్ ఫ్యాక్టరీని శ్రీమతి గాంధీ సందర్శించారు కూడా! జానకీదాస్ కపూర్ కంపెనీ యజమాని. అప్పటికి ఆయన లేరు. ఆయన వారసులు జయదేవ్ కపూర్, జగదీశ్ కపూర్ శ్రీమతి గాంధీకి ఫ్యాక్టరీ అంతా తిప్పి చూపించారు. అట్లాస్ సైకిల్ ఫ్యాక్టరీలో ఇందిరా గాంధీ చిన్న షెడ్డులో 1951లో హర్యానాలో ప్రారంభం అయిన అట్లాస్ సరిగ్గా పన్నెండు నెలల్లో ఇరవై ఐదు ఎకరాల్లో పెద్దఫ్యాక్టరీగా విస్తరించింది. తొలి ఏడాది 12 వేల సైకిళ్లను మార్కెట్లోకి పంపింది. ఎనిమిదో ఏడాది ఫారిన్‌కి సైకిళ్లను ఎక్స్పోర్ట్ చేసింది. తర్వాత ఇరవై ఏళ్లకు తొలి రేసింగ్ సైకిల్ని తయారు చేసింది. 1982లో ఢిల్లీలో జరిగిన ఏషియన్ గేమ్స్‌కి అధికారిక సైకిళ్లు అట్లాస్వే! తర్వాత మరో ఇరవై ఏళ్లు దేశంలో అట్లాస్దే హవా. అప్పటికే బయటి కంపెనీలు ఇండియాలో కట్లు కొట్టడం, ముందు టైర్‌ను పైకి లేపి వెనక టైర్‌తో తమ బ్రాండ్లను ప్రదర్శించడం మొదలైంది. అట్లాస్ కూడా గట్టి పోటీని ఇస్తూనే వచ్చింది. ఎంటీబీ (మౌంట్ బైక్), లేడీస్, జూనియర్, కిడ్స్, రోడ్‌స్టర్స్, అక్వాఫైర్, రోర్, అల్టిమేట్, పీక్ వంటి బ్రాండ్లతో దీటుగా నిలిచింది. నెహ్రూతో అట్లాస్ సంస్థ వ్యవస్థాపకులు జానకీదాస్ కపూర్ కానీ పోటీ పడలేకపోయింది. 2004 నాటికి తన బ్రాండ్లను నిలుపుకోడానికి సునీల్ శెట్టి, సానియా మీర్జా అవసరం అయ్యారు అట్లాస్‌కి. ఆ ఇద్దరు బ్రాండ్ అంబాసిడర్లు కూడా ఏమీ ప్రభావం చూపలేకపోయారు. ఈసారి ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రాను ఆయుధంగా ప్రయోగించింది అట్లాస్. ఆ అస్త్రమూ ఫలించలేదు. చివరికి 2014లో మధ్యప్రదేశ్‌లోని మలన్పూర్ ప్లాంటును మూసేసింది. 2018లో హర్యానాలోని సోనేపట్ యూనిట్లో పని ఆగిపోయింది. రెండు రోజుల క్రితం ఢిల్లీ శివార్లలోని సాహిబాబాద్ ఫ్యాక్టరీ గేటుకు నోటీసు పడింది. డెబ్బయ్ ఏళ్లుగా నడుస్తున్న సైకిల్ చక్రాలు తిరగడం ఆగిపోయాయి. మనిషిలాంటిదే.. మనిషిని మోసి, నడిపి, తిప్పి, పరుగెత్తించిన సైకిల్ కూడా. మనిషి నడక ఆగిపోయినప్పుడు జ్ఞాపకాలు తిరగడం మొదలౌతుంది. ఆ జ్ఞాపకాలలో మనిషెప్పుడూ తిరుగుతూనే ఉంటాడు. అలాగే అట్లాస్ సైకిల్ అట్లాస్ సైకిల్‌పై పల్లెల్లో తిరుగుతున్న అమర్త్యాసేన్ (పూర్వపు ఫొటో) నోబెల్ మ్యూజియంలో అమర్త్యాసేన్ అట్లాస్! స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లోని ‘నోబెల్ మ్యూజియం’లో అమూల్యమైన వస్తు జ్ఞాపకాలు ఉంటాయి. అవన్నీ నోబెల్ బహుమతి గ్రహీతలవి, నోబెల్ వ్యవస్థాపకుడు ఆల్ఫ్రెడ్ నోబెల్‌వి. మ్యూజియం భవంతిలో ఇనుప కమ్మీలకు వేలాడదీసిన నలుపు రంగు అట్లాస్ సైకిల్ ఒకటి సందర్శకులకు కనిపిస్తూ ఉంటుంది! ఆ సైకిల్ మన నోబెల్ గ్రహీత అమర్త్యా సేన్ వాడినది! పశ్చిమ బెంగాల్‌లోని మారు మూల ప్రాంతాల్లో పేదరికాన్ని, అసమానతల్ని అధ్యయం చేసేందుకు ఆ సైకిల్ మీదనే అమర్త్య ఊళ్లన్నీ తిరిగారు. నోబెల్ మ్యూజియంలో అమర్త్యాసేన్ అట్లాస్ సైకిల్ -
ప్రముఖ వ్యాపారి భార్య అనుమానాస్పద మృతి కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సైకిల్ తయారీదారు అట్లాస్ సైకిల్స్ అధినేత సంజయ్ కపూర్ భార్య నటాష్ కపూర్ (57) అనుమానాస్పద మరణం కలకలం రేపింది. మంగళవారం మధ్యాహ్నం సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయినట్టు గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. జీవితం మీద విరక్తితో ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్థిక సంక్షోభం కూడా ఆత్మహత్యకు కారణమని అధికారులు భావిస్తున్నారు. ఢిల్లీ ఔరంగజేబు మార్గంలోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయినట్టుగా బుదవారం తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి, వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం అనంతరం నటాషా మృతదేహాన్ని ఆమె కుటుంబానికి అప్పగించారు. లోధి రోడ్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మధ్యాహ్న భోజనానికి డైనింగ్ హాల్‌కు తల్లి రాకపోవడంతో నటాషా కుమారుడు సిద్ధాంత్ కపూర్ ఆమెకు ఫోన్ చేశారు. తల్లి నుంచి ఎలాంటి స్పందనరాకవడంతో ఆమె గదికివెళ్లి చూశాడు. అక్కడ ఆమె సీలింగ్ ఫ్యాన్‌ను వేలాడుతూ కనిపించడంతో షాక్‌కు గురైన అతను కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. మరోవైపు ఈ సమయంలో కొడుకు, కుమార్తె ఇంట్లోనే వుండగా, భర్త సంజయ్ కపూర్ ఇంట్లో లేనట్టు తెలుస్తోంది. -
నైసర్గిక స్వరూపాన్ని తెలిపే ఐసీఈశాట్2
వాషింగ్టన్: ధ్రువాల్లో మంచు దుప్పటి ఎంత మేరకు ఉంది? సముద్ర నీటిమట్టమెంత? కార్చిచ్చు ఎక్కడి దాకా వ్యాపించింది? వరద ప్రవాహాల ఎత్తెంత? అడవుల విస్తీర్ణ శాతం ఎంత మేరకు తగ్గింది? పట్టణ విస్తీర్ణం, రిజర్వాయర్లలో నీటిమట్టం ఎంత? ఇలాంటి నైసర్గిక ప్రశ్నలకు సమాధానాలివ్వడానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సిద్ధమవుతోంది. భూమి నైసర్గికస్వరూపాన్ని కచ్చిత కొలతలతో చెప్పేందుకు ఐస్, క్లౌడ్ అండ్ ల్యాండ్ ఎలివేషన్ శాటిలైట్ (ఐసీఈశాట్–2)ను తయారుచేసింది. దీన్ని సెప్టెంబర్ 12న కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. శాటిలైట్‌లో నూతన సాంకేతికతతో టోపోగ్రాఫిక్ లేజర్ అల్టిమీటర్ సిస్టమ్ (ఏటీఎల్ఏఎస్)ను అమర్చారు. ఏటీఎల్ఏఎస్ అనుక్షణం మండుతూ వేల కోట్ల పోటాన్లను భూగోళంపై పడేలా చేస్తుంది. అవి పరావర్తనం చెంది ఆయా చోట్లలోని పర్వతం, మంచు, ఇలా ప్రతీదాని స్వరూప, స్వభావాలను తెలుపుతుంది. ఉదాహరణకు, పర్వతాన్ని తాకి పరావర్తనం చెందిన పోటాన్ల సాయంతో పర్వతం కచ్చితమైన ఎత్తు తెలుస్తుంది. -
చీకటి ప్రపంచపటం!
వాషింగ్టన్: ఇప్పటిదాకా భూగోళంపై పగటిపూట కనిపించే వివిధ ప్రాంతాలను గుర్తిస్తూనే ప్రపంచపటాలు(అట్లాస్‌లు) రూపొందాయి. గూగుల్ ఎర్త్లోనూ పగటి ఫొటోల ఆధారంగానే ప్రపంచపటాన్ని పొందుపర్చారు. అయితే.. రాత్రిపూట కనిపించే భూమిపై కూడా ఆయా దేశాలను, నగరాలను గుర్తిస్తూ సరికొత్త చీకటి అట్లాస్‌ను రూపొందించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కొత్త ప్రాజెక్టును చేపట్టింది. ఇందుకుగాను ‘ద గేట్‌వే టు ఆస్ట్రోనాట్ ఫొటోగ్రఫీ ఆఫ్ ఎర్త్’ వెబ్సైట్ ద్వారా లక్షలాది ఫొటోలను ప్రజలకు అందుబాటులో ఉంచింది. 1960ల నుంచీ ఇటీవలి దాకా వ్యోమగాములు తీసిన 18 లక్షల ఫొటోలను ఈ వెబ్సైట్లో ఉంచింది. ఎవరి నగరాన్ని వారు గుర్తించడం తేలిక కాబట్టి.. ప్రజలందరూ ఈ ఫొటోలను పరిశీలించి తమతమ ప్రదేశాలను గుర్తించాలని నాసా పిలుపునిచ్చింది. ఈ వెబ్‌సైట్‌లోని ఫొటోల్లో 13 లక్షల ఫొటోలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీశారు. వీటిలో 30 శాతం ఫొటోలు రాత్రిపూట తీసినవి ఉన్నాయి. ఇప్పటిదాకా వందలాది మంది వలంటీర్లు 20 వేల ఫొటోలను విశ్లేషించి, ఆయా ప్రదేశాలను గుర్తించారట. ఈ చీకటి అట్లాస్‌ను ప్రజలకు, మీడియాకు, శాస్త్రవేత్తలకు అందుబాటులో ఉంచుతామని, ప్రపంచవ్యాప్తంగా ఇంధన వినియోగం, కాలుష్యం, వాతావరణంలో రసాయనాల వంటి అనేక అంశాలపై పరిశోధనలకు ఇది ఉపయోగపడుతుందని నాసా పేర్కొంది.