భారతదేశంలోని తీర ప్రాంతాలు సీఫుడ్‌కి పేరుగాంచినవి. మన దేశంలో సముద్రపు ఆహారానికి సంబంధించిన అనేక ఐకానిక్ కూరలు ఉన్నాయి. ప్రముఖ ఫుడ్, ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ఇంత వరకు బెస్ట్ వెజ్ కర్రీ, బెస్ట్ స్వీట్స్,బెస్ట్ రెస్టారెంట్స్ వంటి జాబితాను అందించింది.అలానే తాజాగా ప్రపంచంలోని 50 ఉత్తమ సీఫుడ్స్ డిష్‌ల జాబితాను విడుదల చేసింది.
భారతదేశంలోని తీరప్రాంతాలు మంచి రుచికరమైన సీఫుడ్‌లను అందించడంలో అపారమైన పాక నైపుణ్యం కలిగి ఉంది. ఇవి ఎల్లప్పుడు ది బెస్ట్ సముద్రపు ఆహార వంటకాలుగా నిలుస్తాయి. పైగా ప్రజల మనసును కూడా దోచుకుంటాయి. అయితే టేస్ట్ అట్లాస్ ఇచ్చిన ది బెస్ట్ సీ ఫుడ్ జాబితాలో మన భారతీయ సీఫుడ్ కర్రీకి స్థానం దక్కడం విశేషం.
జూలై 2024న విడుదల చేసిన ర్యాంకింగ్‌లలో మన భారతదేశంలోని బెంగాలీ రుచికరమైన వంటకం చింగ్రి మలై కర్రీ 31వ స్థానంలో నిలిచింది. ఇది మంచి ఘుమఘమలాడే రొయ్యల కర్రీ. దీన్ని కొబ్బరిపాలు, రొయ్యలు, గరం మాసాలాలు, ఆవాల నూనెతో తయారు చేస్తారు. దీని తయారీలో వేడి మిరపకాయలు, వెల్లుల్లి వేయించాలి, అల్లం పేస్టు, దాల్చిన చెక్కె, చక్కెర, ఏలుకులు చేర్చి.. చిక్కటి గ్రేవితో సర్వ్ చేశారు. ఇది దశల వారీగా ఓపికతో తయారు చేయాల్సిన రుచికరమైన వంటకం.
Comments
Please login to add a commentAdd a comment