అనంత్‌ అంబానీ వాచ్‌..వామ్మో..! అంత ఖరీదా? | Anant Ambani Wears A Rare More Than Rs 6 Crore Watch For Temple Visit | Sakshi
Sakshi News home page

అనంత్‌ అంబానీ వాచ్‌..వామ్మో..! అంత ఖరీదా?

Published Tue, Jul 2 2024 11:08 AM | Last Updated on Tue, Jul 2 2024 11:32 AM

Anant Ambani Wears A Rare More Than Rs 6 Crore Watch For Temple Visit

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దిగ్గజం ముఖేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ వివాహం ఈ నెల 12న జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వారి ఇంట జరిగే చివరి వివాహం కావడంతో అత్యంత విలాసవంతంగా ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు జరిగాయి. ఆ ఈవెంట్‌లో ఆ కుటుంబ సభ్యులు ధరించిన ఆభరణాలు, కాస్ట్యూమ్స్‌ నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి కూడా. తాజాగా అలానే అనంత్‌ ధరించిన లగ్జరియస్‌ వాచ్‌ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. 

రాధిక మర్చంతో వివాహ నేపథ్యంలో అనంత్‌ ప్రముఖ దేవాలయాలను దర్శిస్తున్నారు. ఆ క్రమంలోనే మహారాష్ట్రలోని నేరల్‌లోని కృష్ణ కాళీ దేవాలయాన్ని దర్శించారు కాబోయే వరుడు అనంత్‌ అంబానీ. అమ్మవారి ఆశీర్వాదాన్ని కోరుతూ ఆలయంలో హవన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంత్ ధరించిన గడియారం అందరి దృష్టిని తెగ ఆకర్షించింది. దాని ధర తెలిస్తే కంగుతింటారు.

అత్యంత అరుదైన వాచ్‌..
అనంత్ అంబానీకి అద్భుతమైన వాచీలను సేకరించే అలవాటు ఉంది. వాటిలో ఖరీదైన పాటెక్ ఫిలిప్, రిచర్డ్ మిల్లే నుండి అరుదైన వాచీలు ఉన్నాయి. కృష్ణ కాళీ ఆలయ సందర్శన సమయంలో, అనంత్ రిచర్డ్ మిల్లే వాచీని పెట్టుకున్నారు. ఎరుపు రంగు కార్బన్ రిచర్డ్ మిల్లే వాచ్ (ఆర్ఎం 12-01 టూర్బిల్లాన్)ను ఆయన పెట్టుకున్నారు. దీని ధర ఏకంగా రూ. 6.91 కోట్లు. ఈ బ్రాండ్‌కి సంబంధించిన వాచ్‌లు చాలా పరిమితి పరిధిలోనే అందుబాటులో ఉంటాయి. 

ఇప్పటి వరకు ఈ బ్రాండ్‌కు సంబంధించినవి 18 వాచ్‌లు మాత్రమే రూపొందించారు. మన దేశంలో కొన్ని కుటుంబాలు కేవలం నెలకు ఆరు వేల రూపాయలతో జీవిస్తున్నారు. అనంత్ అంబానీ వాచీ ఖరీదు ఆరుకోట్ల 91 లక్షల రూపాయలు. అంటే మనదేశంలోని దారిద్య్రరేఖకు దిగువున ఉన్న రెండు గ్రామాలను అభివృద్ధి చెయ్యొచ్చు.

 

(చదవండి: పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొననున్న టీమ్‌ ఇండియా దుస్తులను డిజైన్‌ చేసేదేవరంటే..!)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement