Kali
-
1,101 మంది మహిళలు.. ఒకే రంగు చీరతో కాళీ పూజలు
రాంచీ: దేశంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో జార్ఖండ్‌లోని రాంచీలో వినూత్న రీతిలో వేడుకలు నిర్వహించారు. హర్ము రోడ్డులోని కాళీ పూజ కమిటీ కాళీ పూజను ఘనంగా నిర్వహించింది.అయితే ఈ కార్యక్రమంలో కాళీ పూజలో ఒక ప్రత్యేకత చోటుచేసుకుంది. పసుపు రంగు చీరలు ధరించిన 1,101 మంది మహిళలు కాళీమాతకు పూజలు నిర్వహించి, హారతులిచ్చారు. ఈ సందర్భంగా కాళీపూజ కమిటీ సభ్యుడు విక్కీ మాట్లాడుతూ గత ఐదేళ్లగా, ఇక్కడ కాళీ పూజలు జరుగుతున్నాయని తెలిపారు. ఇక్కడి మహిళలకు కాళీమాతపై అచంచలమైన నమ్మకం ఉందని, అమ్మవారికి పూజలు నిర్వహించి, సామూహికంగా హారతి ఇస్తారని అన్నారు.ప్రతి సంవత్సరం ఇదేవిధంగా అందరూ కలిసి హారతి నిర్వహిస్తామని కార్యక్రమంలో పాల్గొన్న సరితా దేవి తెలిపారు. ఈ కార్యక్రమం మనసుకు ప్రశాంతతను అందిస్తుందన్నారు. మహిళలు హారతి ఇచ్చినప్పుడు అద్భుతంగా కనిపిస్తుందని అన్నారు. కాళీపూజకు ముందే మా గెటప్‌ను సిద్ధం చేసుకుంటమన్నారు. తామంతా ఒక రంగులోని చీర ధరించడంతో పాటు మేకప్ కూడా ఒక విధంగా ఉండేలా చూసుకుంటామన్నారు. దైవం ముందు అందరూ సమానులే అనే సందేశాన్ని ఇచ్చేందుకే తాము ఒకే రంగు చీరలు ధరిస్తామన్నారు.ఇది కూడా చదవండి: కాళీ నిమజ్జనంలో రాళ్లదాడి -
కాళీ నిమజ్జనంలో రాళ్లదాడి
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని కోల్‌కతాలో కాళీమాత విగ్రహం నిమజ్జనంలో అల్లర్లు చోటుచేసుకున్నాయి. రాజాబజార్ పరిధిలోని నార్కెల్‌దంగ ప్రాంతంలో కాళీమాత విగ్రహాన్ని నిమజ్జనానికి తరలిస్తుండగా రాళ్ల దాడి జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలంలో ఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు.కాళీమాత విగ్రహం నిమజ్జనం ఊరేగింపుపై రాళ్లు రువ్విన ఘటన స్థానికంగా కలకలంరేపింది. అప్రమత్తమైన పోలీసులు ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు నిమజ్జనం సందర్భంగా ఎలాంటి రాళ్ల దాడి జరగలేదని కోల్‌కతా పోలీసులు సోషల్ మీడియా సైట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పార్కింగ్ విషయంలోవివాదం జరిగిందని, దీనిని బీజేపీ నేతలు రాళ్లదాడి ఘటనగా చెబుతున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.హిందువులు చేపట్టిన ఊరేగింపుపై మమతా బెనర్జీవర్గానికి చెందినవారు రాళ్లు రువ్వారని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఆరోపించారు. మమతా బెనర్జీ వెంటనే నిందితులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తక్షణమే పదవి నుండి వైదొలగాలని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ ఘటనపై బీజేపీ నేత సువేందు అధికారి మాట్లాడుతూ రాజాబజార్‌లో కాళి నిమజ్జనం ఊరేగింపుపై దాడి జరిగిందని, పోలీసులు భక్తులకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు.ఇది కూడా చదవండి: నేడు గంగోత్రి.. రేపు యమునోత్రి మూసివేత -
దేశంలోని ఐదు ప్రముఖ కాళీమాత మందిరాలు
కోల్‌కతా: దేశంలో దేవీ నవరాత్రుల వైభవం కొనసాగుతోంది. ఈ నవరాత్రులలో ఏడవ రోజున కాళికాదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. దుర్గాదేవి రూపం మహిళా సాధికారతకు చిహ్నంగా పరిగణిస్తారు. కాళికా రూపాన్ని పూజించడం ద్వారా శత్రుబాధ నివారణ అవుతుందని, దుఃఖాలు నశించిపోతాయని చెబుతుంటారు.దేశంలో పలు కాళీమాత ఆలయాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఆసక్తికర చరిత్రలు ఉన్నాయి. వీటిలో ఐదు దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.కాలిబడి(ఆగ్రా)ఆగ్రాలోని కాలిబడి కాళికా ఆలయం సుమారు 200 సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడ ఉన్న అద్భుత ఘాట్‌లోని నీరు ఎప్పటికీ ఎండిపోదని, అందులో క్రిమికీటకాలు పెరగవని స్థానికులు చెబుతుంటారు.జై మా శ్యామసుందరి(కోల్‌కతా)మరో కాళీ దేవాలయం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఉంది. దాని పేరు జై మా శ్యామసుందరి కాళీ మందిరం. ఈ ఆలయంలో కాళీదేవి సంచరిస్తుందని స్థానికులు చెబుతుంటారు. ప్రతీరోజూ ఉదయం ఆలయ తలుపు తెరిచినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయని అంటారు.కాళీఘాట్(పశ్చిమ బెంగాల్)మూడవ కాళీ దేవాలయం కూడా పశ్చిమ బెంగాల్లో ఉంది. కాళీఘాట్‌లోని ఈ కాళీ దేవాలయం 51 శక్తిపీఠాలలో ఒకటి. ఈ ఆలయంలో కాళీదేవి నాలుక బంగారంతో తయారు చేశారు.కాళీ ఖో(ఉత్తరప్రదేశ్)నాల్గవ ఆలయం ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్లో వింధ్య పర్వతంపై కాళీ ఖో పేరిట ఉంది. ఈ ఆలయం ధ్యాన సాధనకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అమ్మవారికి సమర్పించే ప్రసాదం మాయమవుతుండటం వెనక కారణం ఏమిటో నేటికీ వెల్లడి కాలేదని భక్తులు చెబుతుంటారు.మాతా బసయ్య(మొరెనా) ఐదవది ఉత్తరప్రదేశ్‌లోని మొరెనాలో ఉన్న మాతా బసయ్య ఆలయం. ఈ ఆలయం సుమారు 200 సంవత్సరాల క్రితం నాటిది. నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ద్వారా భక్తుల తాము కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఇది కూడా చదవండి: కైలాస్నాథ్... చరణాద్రి శిఖరం -
కలి మూవీకి కల్కి చిత్రంతో సంబంధం లేదు: డైరెక్టర్
యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా "కలి". ప్రముఖ కథా రచయిత కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్ సంస్థ బ్యానర్‌పై లీలా గౌతమ్ వర్మ నిర్మిస్తున్నారు. శివ శేషు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలను దర్శకుడు శివ శేషు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.జగపతి బాబును అనుకున్నాం..దర్శకుడు కావాలన్నది నా కోరిక. కొంతకాలం బిజినెస్ చేశాను గానీ తిరిగి నేను ఇష్టపడే చిత్ర పరిశ్రమకే వచ్చాను. కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్ గా పనిచేశాను. ఆ తర్వాత భాగమతి దర్శకుడు అశోక్ గారి దగ్గర, సప్తగిరి ఎక్స్ ప్రెస్ చిత్ర దర్శకుడు అరుణ్ పవార్ గారి దగ్గర పనిచేశాను. లాక్ డౌన్ టైమ్ లో కలి పేరుతో స్క్రిప్ట్ రెడీ చేశాను. జగపతి బాబు గారిని ఓ క్యారెక్టర్ కు అనుకున్నాం. కానీ ఎక్కడో సెట్ అవకపోవడంతో నరేష్ అగస్త్యను తీసుకున్నాంసినిమాలో సందేశంకలి కథ సిద్ధమయ్యాక ఏడాదిన్నర ప్రీ ప్రొడక్షన్, కాస్టింగ్ కు టైమ్ పట్టింది. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు అనే అంశాన్ని మా మూవీలో చెబుతున్నాం. ఓ సర్వే ప్రకారం ప్రపంచంలో 70 శాతం మంది ఏదో ఒక సందర్భంలో ఆత్మహత్య ఆలోచన చేస్తున్నారు. కలి చిత్రంలో అతి మంచితనంతో ఉన్న శివరామ్(ప్రిన్స్) సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. ఆ సమయంలో అతని ఇంటికి ఓ అపరిచిత వ్యక్తి(నరేష్ అగస్త్య) వస్తాడు. అతను వచ్చాక శివరామ్ లైఫ్ లో జరిగిన ఘటనలు ఏంటి అనేది ఈ చిత్ర కథాంశం.కలికి కల్కికి సంబంధం లేదుప్రియదర్శి బల్లి పాత్రకు డబ్బింగ్ చెప్పారు. అలాగే మహేశ్ విట్టా, అయ్యప్ప పి శర్మ ఇద్దరూ వాయిస్ ఓవర్స్ ఇచ్చారు. కలి సినిమాలో వీఎఫ్ఎక్స్కు మంచి ప్రాధాన్యత ఉంటుంది. క్వాలిటీగా వీఎఫ్ఎక్స్ చేశాం. కలి సినిమాకు కల్కి మూవీకి సంబంధం లేదు. మన పురాణాల్లోని కలి పురుషుడి పాత్రను స్ఫూర్తిగా తీసుకుని కలి మూవీ చేశాను అని చెప్పారు.చదవండి: నోటిదురుసు గురించి నువ్వే చెప్పాలి.. మంటల్లో చేయి పెట్టిన ఆదిత్య -
'అడిగేవాడు లేకపోయినా ఆఖరి కోరిక చెబుతున్నా'.. ఆసక్తిగా టీజర్!
ప్రిన్స్, నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం కలి. ఈ చిత్రాన్ని శివ సాషు డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్ బ్యానర్లో లీలా గౌతమ్ వర్మ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన కలి టీజర్ చూస్తే ఈ సినిమాను ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'అడిగేవాడు లేకపోయినా ఆఖరి కోరిక చెబుతున్నా.. నెక్ట్స్ లైఫ్ ఉంటుందో లేదో తెలియదు.. ఉంటే మాత్రం మనిషిగా పుట్టకూడదు.. మంచితనంతో అస్సలు పుట్టకూడదు.' అనే డైలాగ్‌లో టీజర్ ప్రారంభమైంది. టీజర్లో ట్విస్ట్‌లు, సన్నివేశాలు ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ చిత్రంలో నేహా కృష్ణన్, గౌతన్ రాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, సివిఎల్ నరసింహారావు, మణిచందన, మధు మణి, త్రినాధ కీలక పాత్రల్లో నటించారు. -
‘కలి’ టీజర్ ఇంట్రెస్టింగ్గా ఉంది: నాగ్ అశ్విన్
యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా "కలి". శివ శేషు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిలీజ్ చేశారు. "కలి" మూవీ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆకట్టుకుందని, ఒక కొత్త కాన్సెప్ట్ ను డైరెక్టర్ శివ శేషు తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నట్లు టీజర్ తో తెలుస్తోందని ఆయన అన్నారు. "కలి" మూవీ టీమ్ కు నాగ్ అశ్విన్ బెస్ట్ విశెస్ అందజేశారు.ఇక టీజర్ విషయానికొస్తే.. స్వార్థం నిండిన ఈ లోకంలో బతకలేక ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమవుతాడు శివరామ్ (ప్రిన్స్). ఉరి వేసుకునే సమయానికి అతని ఇంటికి ఓ అపరిచిత వ్యక్తి (నరేష్ అగస్త్య) వస్తాడు. శివరామ్ జీవితంలో జరిగిన విషయాలన్నీ ఆ వ్యక్తి చెబుతుంటాడు. తన జీవితంలో జరిగిన ఘటనలు ఆ అపరిచితుడికి ఎలా తెలిశాయని ఆశ్చర్యపోతాడు శివరామ్. పెళ్లి చేసుకుని సంతోషంగా భార్యతో ఉన్న శివరామ్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు?. అతని ఇంటికి వచ్చిన అపరిచితుడు ఎవరు?. అతనికి శివరామ్ జీవితంలో విషయాలన్నీ ఎలా తెలిశాయి?. కళ్లముందే శివరామ్ ఉంటే అతని పోలిక ఉన్న డెడ్ బాడీ ఎలా వచ్చింది? ఇలాంటి ఆసక్తికర అంశాలతో "కలి" టీజర్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. -
అనంత్ అంబానీ వాచ్..వామ్మో..! అంత ఖరీదా?
రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజం ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం ఈ నెల 12న జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వారి ఇంట జరిగే చివరి వివాహం కావడంతో అత్యంత విలాసవంతంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. ఆ ఈవెంట్లో ఆ కుటుంబ సభ్యులు ధరించిన ఆభరణాలు, కాస్ట్యూమ్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి కూడా. తాజాగా అలానే అనంత్ ధరించిన లగ్జరియస్ వాచ్ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. రాధిక మర్చంతో వివాహ నేపథ్యంలో అనంత్ ప్రముఖ దేవాలయాలను దర్శిస్తున్నారు. ఆ క్రమంలోనే మహారాష్ట్రలోని నేరల్‌లోని కృష్ణ కాళీ దేవాలయాన్ని దర్శించారు కాబోయే వరుడు అనంత్ అంబానీ. అమ్మవారి ఆశీర్వాదాన్ని కోరుతూ ఆలయంలో హవన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంత్ ధరించిన గడియారం అందరి దృష్టిని తెగ ఆకర్షించింది. దాని ధర తెలిస్తే కంగుతింటారు.అత్యంత అరుదైన వాచ్..అనంత్ అంబానీకి అద్భుతమైన వాచీలను సేకరించే అలవాటు ఉంది. వాటిలో ఖరీదైన పాటెక్ ఫిలిప్, రిచర్డ్ మిల్లే నుండి అరుదైన వాచీలు ఉన్నాయి. కృష్ణ కాళీ ఆలయ సందర్శన సమయంలో, అనంత్ రిచర్డ్ మిల్లే వాచీని పెట్టుకున్నారు. ఎరుపు రంగు కార్బన్ రిచర్డ్ మిల్లే వాచ్ (ఆర్ఎం 12-01 టూర్‌బిల్లాన్)ను ఆయన పెట్టుకున్నారు. దీని ధర ఏకంగా రూ. 6.91 కోట్లు. ఈ బ్రాండ్‌కి సంబంధించిన వాచ్‌లు చాలా పరిమితి పరిధిలోనే అందుబాటులో ఉంటాయి. ఇప్పటి వరకు ఈ బ్రాండ్‌కు సంబంధించినవి 18 వాచ్‌లు మాత్రమే రూపొందించారు. మన దేశంలో కొన్ని కుటుంబాలు కేవలం నెలకు ఆరు వేల రూపాయలతో జీవిస్తున్నారు. అనంత్ అంబానీ వాచీ ఖరీదు ఆరుకోట్ల 91 లక్షల రూపాయలు. అంటే మనదేశంలోని దారిద్య్రరేఖకు దిగువున ఉన్న రెండు గ్రామాలను అభివృద్ధి చెయ్యొచ్చు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) (చదవండి: పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొననున్న టీమ్ ఇండియా దుస్తులను డిజైన్ చేసేదేవరంటే..!) -
మరణం లేని వరం.. అయినా రాక్షస వీరుల్ని అంతం చేసిన ఆదిపరాశక్తి
శుంభ నిశుంభులు రాక్షస సోదరులు. శివుడి కోసం ఘోర తపస్సు చేశారు. పురుషుల చేతిలో మరణం లేకుండా వరం పొందారు. వరగర్వం తలకెక్కిన శుంభ నిశుంభులు ముల్లోకాలనూ పీడించసాగారు. దేవతలు సహా ముల్లోకాల జనాలందరూ ఆదిపరాశక్తి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. శుంభ నిశుంభులు స్వర్గంపై దండెత్తి, దేవతలను తరిమికొట్టారు. స్వర్గాన్ని ఆక్రమించుకున్నాక శుంభుడు తనను తాను త్రిలోకాధిపతిగా ప్రకటించుకున్నాడు. శుంభుడి ప్రాపకం కోసం కొందరు రాక్షస సేనానులు అతడి వద్ద ఆదిపరాశక్తి సౌందర్యాన్ని వైనవైనాలుగా వర్ణించారు. తనవంటి వీరుడు పెళ్లాడితే అలాంటి సౌందర్యరాశినే పెళ్లాడాలని తలచాడు శుంభుడు. శుంభ నిశుంభుల దాష్టీకాలను ఆలకించిన ఆదిపరాశక్తి క్రోధావేశంతో తన భ్రుకుటి ముడివేసింది. ఆమె లలాటం నుంచి కాళీ పుట్టుకొచ్చింది. కాళీ సమేతంగా జగజ్జనని శుంభ నిశుంభులు నివసించే పరిసరాలకు వెళ్లి, అక్కడ ఒక ఉద్యానవనానికి చేరుకుంది. అక్కడ ఆసీనురాలై, మధురగాత్రంతో సంగీతాలాపన చేయసాగింది. అనుచరుల ద్వారా శుంభుడికి ఈ సమాచారం తెలిసింది. ఎవరో దేవకన్య తనను వలచి వచ్చిందని తలచాడు. ఆమెకు తన బలపరాక్రమాలను వివరించి, ఆమెను సగౌరవంగా అంతఃపురానికి తోడ్కొని రమ్మంటూ సుగ్రీవుడనే మంత్రిని పంపాడు. సుగ్రీవుడు ఉద్యానవనంలోకి చేరే సమయానికి కాళీ సమేత అయిన ఆదిపరాశక్తి మధుపానం చేస్తూ కనిపించింది. ‘ఓ కాంతామణులారా! మీరెవరో తెలియదు. మీ సౌందర్యాన్ని తెలుసుకుని త్రిలోకాధిపతి అయిన మా ప్రభువు శుంభుడు నన్ను ఇక్కడకు పంపాడు. మీ అదృష్టం పండింది. మీరిద్దరూ శుంభుడి క్రీడాసౌధానికి విచ్చేసినట్లయితే, అర్ధసింహాసనాన్ని అధివసించి ముల్లోకాలనూ ఏలవచ్చు కదా’ అన్నాడు. ఆదిపరాశక్తి సుగ్రీవుడి వంక చిరునవ్వుతో చూసి, ‘మీ శుంభుడి బలపరాక్రమాలను నేను ఎరుగుదును. అయితే, నన్ను యుద్ధంలో గెలవగలిగిన వాడినే పెళ్లాడాలనే ప్రతినబూనాను. నా మాటను మీ నాయకుడికి తెలియజెప్పు’ అని అతడిని పంపేసింది. సుగ్రీవుడు శుంభునికి ఆదిపరాశక్తి మాట చెప్పాడు. అతడు ఆశ్చర్యచకితుడయ్యాడు. వాళ్లను ఈడ్చుకు రమ్మంటూ ధూమ్రలోచనుడనే వాడిని పంపాడు. కాళీ వాడిని హతమార్చింది. ఈసారి చండ ముండులనే వారిని సైన్యంతో పంపాడు. ధూమ్రలోచనుడిని చంపిన కాళీపై చండ ముండులు యుద్ధానికి దిగారు. ఎటు చూసినా తానే కనిపిస్తూ కాళీ రణరంగంలో వీరవిహారం చేసింది. రాక్షసవీరులను ఒక్కొక్కరినే అంతం చేసింది. చండ ముండుల శిరస్సులు ఖండించి, వారిని హతమార్చింది. చండ ముండుల చావు చూడగానే మిగిలిన రాక్షస సేనలు పలాయనమంత్రం పఠించాయి. చారులు ఈ సంగతిని శుంభుడికి చేరవేశారు. అమిత పరాక్రమవంతులైన చండ ముండులు హతులైన సంగతి విని శుంభుడు హతాశుడయ్యాడు. ఈసారి మహాభీకరుడైన రక్తబీజుడిని సైన్యంతో పంపాడు. రక్తబీజుడు రంకెలు వేస్తూ యుద్ధానికి వచ్చాడు. కాళీ రక్తబీజుడితో యుద్ధానికి తలపడింది. రణరంగమంతా ఎటు చూసినా తానే కనిపిస్తూ రాక్షస సేనలను దునుమాడసాగింది. రక్తబీజుడికి ఆయుధాలతో గాయాలు తగిలినప్పుడల్లా వాడి ఒంటి నుంచి నేలరాలే రక్తబిందువుల నుంచి రక్తబీజులు పుట్టుకురాసాగారు. కాళీ సహస్ర రూపాలతో సహస్రజిహ్వలు చాస్తూ విజృంభించింది. రక్తబీజుడు నెత్తుటిబొట్టు నేల రాలకముందే తన జిహ్వలతో తాగేస్తూ, భీకర యుద్ధం కొనసాగించింది, చివరకు వాడిని వధించింది. రక్తబీజుడి మరణవార్త తెలియగానే శుంభుడిలో ధైర్యం సడలింది. నిశుంభుడు అది గమనించి, ‘అన్నా! నేనుండగా నీకెందుకు విచారం? నేనే స్వయంగా ఆమెను బంధించి తెచ్చి, నీ ముందు ఉంచుతాను’ అని పలికి అట్టహాసంగా బయలుదేరాడు. ఆదిపరాశక్తి వాడిని యుద్ధంలో అంతమొందించింది. యుద్ధానికి పంపడానికి ఎవరూ మిగలకపోవడంతో చివరకు శుంభుడు తానే బయలుదేరాడు. ‘కాంతామణీ! నా అనుచరులను హతమార్చావని నీ మీద నాకు కినుక లేదు. రమణులకు రాణివాసం శోభిస్తుంది గాని, రణరంగం కాదు. నాతో రాణివాసానికి వస్తే, ముల్లోకాలను ఏలుకోగలవు. ఇక ఆలస్యం చేయక బయలుదేరు’ అన్నాడు. ‘ఓహో! నువ్వేనా శుంభుడవు? నా ప్రతిజ్ఞ తెలుసు కదా! నీ బలపరాక్రమాలు ఏమాత్రానివో ఒకసారి చూస్తాను, రా!’ అని పలికింది ఆదిపరాశక్తి. యుద్ధానికి సిద్ధపడ్డాడు శుంభుడు. కాళ్లు నేలకు తాటిస్తూ, భీకర సింహనాదం చేశాడు. ఆ ధ్వనికి దిక్కులు పిక్కటిల్లాయి. దేవతలు భయకంపితులయ్యారు. ఇంతలో శివుడు అక్కడకు వచ్చాడు. ఆదిపరాశక్తికి నవశక్తులను అందించాడు. ఆదిపరాశక్తి ఆదేశంతో కాళీ రణరంగంలో వీరవిహారం ప్రారంభించింది. తోడుగా నవశక్తులు సహస్రాది రూపాలతో రాక్షస సేనలను మట్టుపెట్టసాగారు. భీకర సంగ్రామంలో రణరంగమంతా కళేబరాల గుట్టలు పోగుపడ్డాయి. నెత్తుటేర్లు ప్రవహించాయి. కాళీ చివరకు శుంభుడిని దొరకబుచ్చుకుని వాడి చేతులు, కాళ్లు, తల నరికి పారేయడంతో వాడు నేలకూలాడు. రాక్షసులందరూ హతమారడంతో కాళీతో కలసి ఆదిపరాశక్తి రణరంగంలో విజయతాండవం చేసింది. దేవతలు వేనోళ్ల స్తుతులు చేస్తూ ప్రార్థించడంతో ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకుని, ప్రసన్నవదనంతో దేవతలను ఆశీర్వదించింది. -
మ్యాంగో మ్యాన్
ఒకే మామిడి చెట్టుకు 300 కాయలు కాస్తాయి. అయితే ఆ కాయలు ఒక్కోటి ఒక్కో రకం. ఒక కొమ్మకు రసాలైతే ఒక కొమ్మకు తోతాపురి.. ఇలా ప్రపంచంలో ఏ చెట్టూ కాయదు. దీనిని సాధ్యం చేసి ‘మ్యాంగో మేన్ ఆఫ్ ఇండియా’గా పేరు పొందాడు లక్నోకు చెందిన కలీముల్లా ఖాన్. జీవితం మొత్తాన్ని మామిడి సాగుకు అంకితం చేసిన కలీముల్లా మామిడి తోట ఒక దర్శనీయ స్థలం. ‘ప్రపంచంలో మామిడి పండు అంత అందమైన పండు మరొకటి లేదు’ అంటారు కలీముల్లా ఖాన్. ఆయనికిప్పుడు 80 దాటాయి. లక్నో నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే మలిహామాద్లో ఆయన మామిడి ఉద్యానవనం ఉంది. ‘ఇది ప్రపంచ మామిడి చెట్లకు కాలేజీ లాంటిది. ఎవరైనా మామిడి పండ్ల గురించి ఇక్కడ చదవాల్సిందే’ అంటాడాయన. మలిహాబాద్ ఉత్తరప్రదేశ్‌లో మామిడితోటలకు ప్రసిద్ధి. కలీముల్లా కుటుంబం కూడా మామిడి తోటల పెంపకంలో తాత తండ్రుల కాలం నుంచి ఉంది. ‘నేను సెవెన్త్ ఫెయిల్ అయ్యాను. మా ఊళ్లో పిల్లల్ని ఇళ్ల నుంచి కూడా బయటకు రానీయరు తల్లిదండ్రులు. అలా పెరిగాను. కొన్నాళ్లు ఆ పనీ ఈ పనీ చేసి మామిడి నర్సరీలో పని చేయడం మొదలుపెట్టాను. నాకు 18 ఏళ్ల వయసులో అంటు కట్టి మొదటి మామిడి మొక్కను నాటాను. కాని ఆ రోజు నుంచి భారీ వర్షం. దేవునికి ఇష్టం లేదనుకున్నాను. ఆ మొక్క బతకలేదు. కాని అంటు కట్టే విధానంతో కొత్త కొత్త మామిడి రకాలు సృష్టించాలన్న నా పిచ్చి పోలేదు. 1970లో నా పెళ్లయ్యింది. అప్పుడే ఈ మామిడి తోటలో ప్రయోగాలు మొదలెట్టాను’ అంటాడాయన. ఒకేచెట్టుకు 315 రకాలు ఒకేచెట్టు కొమ్మలకు రకరకాల పండ్ల అంటు కడుతూ చెట్టును విస్తరించడమే కాదు, దాని ప్రతికొమ్మకూ కొత్తరకం కాయలను సృష్టించాడు కలీముల్లా. ‘ఇన్ని రకాల కాయలు ఒకే చెట్టుకు కాసినప్పుడు మనుషులందరూ ఒకేరీతిన ఎందుకు కలిసి ఉండకూడదు’ అని ప్రశ్నిస్తాడాయన. ‘నేను సృష్టించిన ఒకరకం కాలాపహాడ్ పండును జుర్రుకుంటే మూడు రకాల రుచులు వస్తుంది’ అంటాడాయన. కొన్ని రకాల అంటు మామిళ్లకు కలీముల్లా ‘అమితాబ్, ‘సచిన్’, ‘నమో’ అనే పేర్లు పెట్టాడు. కరోనాలో సేవచేసి మరణించిన డాక్టర్లకు నివాళిగా ఒక మామిడిరకాన్ని సృష్టించి ‘డాక్టర్’వెరైటీ అని నామకరణం చేశాడు. కలీముల్లాకు 2008లో పద్మశ్రీ వచ్చింది. ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా నాకు 400 అవార్డులు ఉద్యానవన విభాగంలో వచ్చాయి. చాలా వాటిని మా పిల్లలు వెళ్లి తీసుకొస్తుంటారు అంటాడాయన. ‘నాకు మన దేశం అంటే ప్రేమ. అమెరికా నుంచి చాలామంది వచ్చి నా విధానాలు తెలుసుకుని వెళ్లారు. మన దేశం వాళ్లే నా వల్ల ఎక్కువ ప్రయోజనం పొందడం లేదని అనిపిస్తోంది. నా జ్ఞానాన్ని నా వాళ్లకు పంచాలనే నా తపన అని భావోద్వేగంతో అంటాడు కలీముల్లా. ‘మా తోటకు రండి. మామిడి తినిపోండి’ అని సదా ఆహ్వానిస్తుంటాడాయన. -
కాళీ మాతపై వ్యాఖ్యలు ఇష్యూ.. సీఎం మమత కామెంట్స్ ఇవే..
కోల్కత్తా: కాళీమాతను అవమానిస్తూ విదేశంలో ఒక డాక్యుమెంటరీ పోస్టర్ వెలిసిన వివాదం ముదిరిపోయి భారత్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పోస్టర్‌పై తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపీ మహువా మొయిత్రా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. తప్పులు అందరూ చేస్తారు. కానీ, వాటిని సరిదిద్దుకోగలరు. మేము కూడా పని చేస్తున్నప్పుడు తప్పులు చేస్తూనే ఉంటాం. కానీ, ఆ తర్వాత సరిదిద్దుకుంటాం. కొందరు మంచి పనిని సహించక అరుస్తుంటారు. ప్రతికూల ఆలోచనలు మన మెదడుకు మంచిది కాదు. అందుకే సానుకూల దృక్పథంతో ఆలోచించండి అని అన్నారు. ఇదిలా ఉండగా.. అంతకు ముందు ఎంపీ మొయిత్రా.. ‘నా దృష్టిలో కాళీ మాత మాంసం తినే, ఆల్కహాల్ స్వీకరించే వ్యక్తి’, ‘సిక్కింలో కాళీమాతకు విస్కీని కానుకగా సమర్పిస్తారు. అదే యూపీలో ఇది తీవ్రమైన దైవదూషణ’ చేస్తారని ఆమె అన్నారు. అదే బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో కాళీమాతను ఆరాధించే తారాపీఠ్ శక్తిపీఠం వద్ద సాధువులు ఎప్పుడూ ధూమపానం చేస్తూ కనిపిస్తారు. నా దృష్టిలో కాళీ మాత మాంసం తినే, ఆల్కహాల్ స్వీకరించే వ్యక్తి. నాతో సహా ప్రతి ఒక్కరికీ నచ్చిన దైవాన్ని నచ్చినట్లు ఆరాధించే హక్కుంది’ అని వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పెను దుమారం చోటుచేసుకుంది. బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. మొయిత్రా వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధంలేదని టీఎంసీ తర్వాత ట్వీట్‌చేసింది. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ నేతలు ఆమెపై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. టీఎంసీ ఎంపీ మొయిత్రా.. మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. దీంతో మధ్యప్రదేశ్ పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: హిందుత్వం ఎప్పటికీ భారతదేశంగా మారదు.. ‘కాళి’ లీనా ట్వీట్లు మరింత దుమారం -
Mahua Moitra: మాంసం తినే మద్యం తాగే దేవత
కోల్‌కతా: కాళీమాతను అవమా నిస్తూ విదేశంలో ఒక డాక్యుమెంటరీ పోస్టర్ వెలిసిన వివాదం ముదిరిన వేళ తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపీ మహువా మొయిత్రా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘నా దృష్టిలో కాళీ మాత మాంసం తినే, ఆల్కహాల్ స్వీకరించే వ్యక్తి’ అని మంగళవారం కోల్‌కతాలో ఇండియాటుడే సదస్సులో వ్యాఖ్యానించారు. ‘సిక్కింలో కాళీమాతకు విస్కీని కానుకగా సమర్పిస్తారు. అదే యూపీలో ఇది తీవ్రమైన దైవదూషణ. అదే బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో కాళీమాతను ఆరాధించే తారాపీఠ్ శక్తిపీఠం వద్ద సాధువులు ఎప్పుడూ ధూమపానం చేస్తూ కనిపిస్తారు. నా దృష్టిలో కాళీ మాత మాంసం తినే, ఆల్కహాల్ స్వీకరించే వ్యక్తి. నాతో సహా ప్రతి ఒక్కరికీ నచ్చిన దైవాన్ని నచ్చినట్లు ఆరాధించే హక్కుంది’ అని మొయి త్రా అన్నారు. మొయిత్రా వ్యాఖ్యలను పశ్చిమ బెంగాల్ అధికార టీఎంసీ అభి ప్రాయంగా భావించాలేమో అంటూ బీజేపీ విమర్శలు గుప్పించింది. మొయి త్రా వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధంలేదని టీఎంసీ తర్వాత ట్వీట్‌చేసింది. మణిమేఖలైపై కేసులు నమోదు కాళీమాత వేషధారణలో ఉన్న మహిళ సిగరెట్ తాగుతున్నట్లు చూపే డాక్యుమెంటరీ పోస్టర్‌ను ఆన్లైన్లో పోస్ట్చేసిన మధురైకి చెందిన దర్శకురాలు లీనా మణిమేఖలైపై 153ఏ, 295ఏ సెక్షన్ల కింద ఢిల్లీ పోలీసులు మంగళవారం కేసు నమోదుచేశారు. ‘కాళీ’పోస్టర్ ప్రొడ్యూసర్ ఆశా అసోసియేట్స్, ఎడిటర్ శ్రవణ్ ఓనచంద్, మణిమేఖలైపై లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. చదవండి: (కాంగ్రెస్‌లో చేరినవారికి టికెట్ల హామీ ఇవ్వట్లేదు) -
"ఈశ్వర్ అల్లా" అంటే ఇదేనేమో
పశ్చిమబెంగాల్: ఇటీవల కాలంలో మతాల పేర్లుతో కోట్లాడుకోవడాలు చూసి ఉంటాం. అలాగే మాట వరసకు ఏదైనా చిన్న మాట అంటే చాలు మా మతాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారంటూ పెద్ద ఎత్తున ఘర్షణకి దిగిపోతారు. అంతేందుకు ఒక ప్రాంతం లేదా గల్లీ మొత్తం ఒక మతంగా నివశిస్తారు. కానీ వాటిన్నింటకి విరుద్ధంగా ఒక ముస్లీం కుటుంబం హిందూ దేవుళ్ల విగ్రహాలను తయారు చేయడమే కాక అన్ని మతాలు ఒకటే భావనను కలిగిస్తున్నారు. (చదవండి: సార్ నా గర్ల్‌ఫ్రెండ్ సాక్స్ ఉతక లేదు.... కాబట్టి ఆఫీస్‌కి రాలేను) అసలు విషయంలోకి వెళ్లితే....పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మేదినీపూర్‌లో దాస్పూర్ గ్రామంలోనే ఇస్మాయిల్ కుటుంబం నలభై సంవత్సారాలుగా నివాసం ఉంటున్నారు. ఈ 61 ఏళ్ల ఇస్మాయిల్ వృత్తి రీత్యా విగ్రహాలు తయారు చేస్తాడు. అందులోనూ కాళీ విగ్రహాలు తయారు చేయడంలో సిద్ధహస్తుడు. అక్కడున్న గ్రామస్తులకు కాళివిగ్రహాలు కావాలంటే ఇస్మాయిల్కే ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాదు ఈ కాళిమాత విగ్రహాలను అతని భార్య , ఐదుగురు కుమార్తెలు కలిసి తయారు చేస్తారు. పైగా ఇస్మాయిల్‌కి తన తన కూతుళ్లను చదివించడం తనకు భారమే అయినప్పటికీ నా పిల్లలకి "ఈశ్వర్" "అల్లా" అనే ఇద్దరి దేవుళ్ల ఆశీస్సులు ఉంటాయి కాబట్టి వాళ్లు బాగా చదువుకుని మంచి జీవితాన్ని గడుపుతారని నమ్మకంగా చెబుతాడు. ఈ మేరకు ఇస్మాయిల్ మాట్లాడుతూ..." “నేను చిన్నప్పటి నుండి ఇదే చేస్తున్నాను. మా ఊరి గ్రామస్తులే కాక ఇతర ప్రాంతాల నుండి సైతం ప్రజలు విగ్రహాల కోసం నా వద్దకే వస్తారు. నేను పేదవాడిని కానీ అందరి దీవెనలతో నా కుటుంబాన్ని చక్కగా నడపగలుగుతున్నాను. అంతేకాదు నాకు విగ్రహాలు సిద్ధమైనప్పుడు చాలా గొప్పగా అనిపిస్తుంది." అని అన్నాడు. ఈ క్రమంలో ఆ గ్రామంలోని బీరేంద్ర రాయ్ అనే స్థానికుడు మాట్లాడుతూ....ఈ గ్రామంలోని ప్రతి హిందువు దేవతా విగ్రహన్ని ఇస్మాయిల్ తయారు చేస్తాడు. ఇది మాకు కొత్తేమి కాదు. అయినా మనమందరం కలిసి పెరిగాం, కలిసి ఉంటున్నాం, ఇదే మన సంస్కృతి" అని అన్నాడు. కానీ ఈ చిన్న గ్రామం నిజంగా మత సామరస్యాంగా ఎలా జీవించాలో ఎలా కొనసాగించాలో ఐక్యతగా జీవిస్తూ చూపించింది. ఈ మేరకు ఇస్మాయిల్ ప్రజలు ఐక్యత గురించి తెలుసుకునేలా ప్రపంచంలో ఇలాంటి దస్పూర్ గ్రామాలు మరిన్ని ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అని అన్నాడు. (చదవండి: ఎదురుగా కంగారుల సమూహం.. ఇప్పుడు నేనెలా ఆడాలి?) -
విజయ్‌ఆంటోనికి జంటగా అంజలి
తమిళసినిమా: విజయ్‌ఆంటోనికి జంటగా నటించడానికి నటి అంజలి రెడీ అవుతోంది. సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని ఏక కాలంలో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి కాళీ. ఇది ఇంతకు ముందు రజనీకాంత్ నటించిన హిట్ చిత్ర టైటిల్ అన్నది గమనార్హం. కాగా ఉదయనిధి స్టాలిన్ భార్య కృతిక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటోంది. కాగా ఇందులో విజయ్ ఆంటోనికి జంటగా నలుగురు కథానాయికలు నటిస్తున్నారు. వారిలో సునైనా, అమృతలు ఇప్పటికే ఎంపికయ్యారు. తాజాగా అంజలి, కన్నడ నటి శిల్పా మంజునాథ్‌లను ఎంపిక చేసినట్లు దర్శకురాలు కృతిక, ఉదయనిధిస్టాలిన్ తెలిపారు. ఆమె మాట్లాడుతూ కాళీ చిత్రంలో అంజిలి పాత్ర గురించి ఇప్పుడేమీ చెప్పననీ, అయితే ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందన్నారు. ఇక నటి శిల్పా మంజునాథ్‌ను ఎంపిక చేయడానికి కారణం ఆమె అన్కన్వెన్షినల్ లుక్ తనను చాలా ఆకర్షించిదన్నారు. ఓ వీడియో ఆల్బంలో ఆమెను చూసి రప్పించి ఫోటో సెషన్ చేసి తన చిత్రంలో పాత్రకు బాగుంటుందని ఎంపిక చేశానని తెలిపారు. చిత్రంలో నలుగురు హీరోయిన్లకు సమానంగా పాత్రలు ఉంటాయని చెప్పారు. కాళీ చిత్రం సస్పెన్స్, థ్రిల్లర్‌తో పాటు, రొమాన్స్ సన్నివేశాలతో గరంగరంగా ఉంటుందన్నారు. -
‘మహాకవి’ విశేషణం.. కాళిదాసుకే సార్థకం
–మహామహోపాధ్యాయ శ్రీరామశర్మ ‘కాళిదాసు శ్రౌతప్రతిభ’పై ప్రసంగం రాజమహేంద్రవరం కల్చరల్ : సాహితీజగత్తులో కవులు ఎందరున్నా, ‘మహాకవి’ అన్న పదం ఒక్క కాళిదాసుకే అన్వయిస్తుందని మహామహోపాధ్యాయ, వేదభాష్యవిభూషణ డాక్టర్ చిర్రావూరి శ్రీరామశర్మ పేర్కొన్నారు. నన్నయ వాజ్ఞ్మయ వేదిక ఆధ్వర్యంలో సోమవారం ఆదిత్య మహిళా కళాశాల ఆడిటోరియంలో ‘కాళిదాసు శ్రౌతప్రతిభ’ అనే అంశంపై శ్రీరామశర్మ ప్రసంగించారు. ముందుగా తన గురువులను సంస్మరించారు. ఒక సెకను కాలపరిమాణాన్ని లక్షా40వేల విభాగాలుగా భారతీయ జ్యోతిషశాస్త్రం విడగొట్టగలిగిందన్నారు. లోకవ్యవహారంలో జయంతి అంటే పుట్టినరోజుగా, వర్ధంతి అంటే మరణించిన రోజుగా భావిస్తున్నారని, కానీ వర్ధంతి అంటే పుట్టినరోజుగా, జయంతి అంటే ఇహలోకయాత్రను చాలించిన రోజుగా పరిగణించాలన్నారు. భర్తృహరి నీతిశతకంలోని ‘జయంతి తే సుకృతినో రససిద్ధః కవీశ్వరః’ శ్లోకాన్ని ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. ఉపమా కాళిదాసస్య అంటారు, కాళిదాసు ఉపమాలంకార విశేషాలను తెలుసుకోవాలంటే, శాస్త్రపరిజ్ఞానం ఉండాలన్నారు. కాళిదాసు కావ్యసౌందర్యాలను వర్ణిస్తూ సజ్జనుల సంపాదన మేఘం వంటిది, నిరుపయుక్తంగా ఉన్న సముద్రజలాలను మేఘం సూర్యకిరణాల ద్వారా గ్రహించి, వర్షధారలు కురిపించి, పుడమిని సస్యశ్యామలం చేస్తుందన్నారు. షట్శాస్త్రాలను చదివినవారికి సైతం కాళిదాసు రచించిన ‘రఘువంశం’ ఆదిగా గల కావ్యాలను చదివితే సందేహాలు కలుగుతాయన్నారు. వేదాలలో వివరించిన యజ్ఞప్రక్రియను శ్రౌతమంటారని, సుదక్షిణాదేవి గర్భం ధరించడాన్ని శమీగర్భంలో ఉన్న అగ్నిహోత్రంగా కాళిదాసు పేర్కొన్నాడని, శమి అంటే భూమి, రావిచెట్టు అనే అర్థాలు ఉన్నాయని చెప్పారు. కాంతాసమ్మితంగా కాళిదాసు అద్భుతమైన శ్రౌతరహస్యాలను వివరించాడన్నారు. తండ్రికి అసత్యదోషం అంటరాదనే రాముని వనవాసం ‘సాధారణంగా రామాయణం చెప్పుకునేటప్పుడు, శ్రీరాముడు పితృవాక్యాన్ని అనుసరించి అడవులకు తరలి వెళ్ళాడంటారు, ఇది సరైన అవగాహన కాదు, ‘నా మాట తోసిపుచ్చు, నన్ను బంధించి అయినా యువరాజ పదవిని చేపట్టమని దశరథుడు చెప్పినా శ్రీరాముడు ఈ మాటను అనుసరించడు, తండ్రికి అసత్యదోషం రాకూడదు, కైకకు ఇచ్చిన మాట తప్పితే ఆయనకు అసత్యదోషం కలుగుతుంది, ఈ దోషం నుంచి తండ్రిని కాపాడటానికే రాఘవుడు అడవులకు వెళ్ళాడు’ అని శ్రీరామశర్మ వివరించారు. వేదిక వ్యవస్థాపక కార్యదర్శి చింతలపాటి శర్మ తన తండ్రి వేంకట హనుమంతరావు, వరలక్ష్మి దంపతుల స్మారక పురస్కారాన్ని చిర్రావూరి దంపతులకు అందచేశారు. నిత్యవిద్యార్థి డాక్టర్ కర్రి రామారెడ్డి అధ్యక్షత వహించారు. సభాప్రారంభకుడు, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్.పి.గంగిరెడ్డి మాట్లాడుతూ కాళిదాసు సాహిత్యంలోని శ్రౌతధర్మాలను నేటి తరానికి తెలియచెప్పడం ద్వారా యువతను దురలవాట్లనుంచి దూరం చేయగలమన్నారు. గేయకవి జోరాశర్మ స్వాగత వచనాలు పలికారు. సరసకవి ఎస్వీ రాఘవేంద్రరావు వందన సమర్పణ చేశారు. ఓఎన్జీసీ విశ్రాంత జనరల్ మేనేజర్ గుంటూరు వెంకటేశ్వరరావు, విశ్రాంత ఆచార్యుడు డాక్టర్ బి.వి.ఎస్.మూర్తి, డాక్టర్ మేజర్ చల్లా సత్యవాణి, విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ అద్దేపల్లి సుగుణ, ఆదిత్య మహిళాకళాశాల ప్రిన్సిపాల్ ఫణికుమార్, సాహితీవేత్తలు హాజరయ్యారు. -
సంబరాలు... సరదాలు... ఓ సమస్య
నిజ జీవిత కథలను వైవిధ్యంగా తెరకెక్కించగల ప్రతిభాశాలి తమిళ దర్శకుడు బాల. ఆయన నిర్మించిన ‘చండివీరన్’ తెలుగులో ‘కాళి’ పేరుతో విడుదల కానుంది. అధర్వ, ఆనంది, లాల్ ముఖ్య పాత్రల్లో శర్కునమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎం.ఎం.ఆర్ తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ– ‘‘హృదయం’ అనే తెలుగు సినిమాతో మంచి హీరోగా పేరు తెచ్చుకున్నారు మురళి. ఆయన తనయుడు అధర్వ ‘కాళి’లో హీరోగా నటించడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు. ‘‘నీటి కోసం రెండు ఊర్ల మధ్య జరిగిన పోరాటమే ఈ చిత్రకథ. సంక్రాంతి సంబరాలు, పల్లెటూరి సరసాలు, సరదాలన్నీ ఉన్నాయి. ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని నిర్మాత చెప్పారు. ‘‘ఈ చిత్రంలో ‘ఎసేయ్ మావా...’ అనే పాట రాశా’’ అని డా. చల్లా భాగ్యలక్ష్మి అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: పి.జి.ముత్తయ్య, సంగీతం: ఎస్.ఎన్ .అరుణ గిరి, సమర్పణ: బాల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రఘు. -
నీటి కోసం పోరాటం!
వైవిధ్యమైన కథా చిత్రాల దర్శకుడు బాల నిర్మించిన తమిళ చిత్రం ‘చండివీరన్’. అధర్వ, ఆనంది, లాల్ ముఖ్యపాత్రల్లో సర్కుణమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘కాళి’ పేరుతో నిర్మాత ఎం.ఎం.ఆర్ తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘నీటి కోసం రెండు ఊళ్ల మధ్య జరిగిన పోరా టమే ఈ చిత్రకథ. పల్లెల్లో ఉండే సంక్రాంతి సంబరాలు, సరదాలు, సరసాలు ఉంటాయి. తొలి భాగం నవ్వులు పంచితే, రెండో భాగం ఉత్కంఠగా ఉంటుంది. అరుణగిరి పాటలు, సబేష్ మురళి నేపథ్య సంగీతం, పి.జి. ముత్తయ్య ఛాయాగ్రహణం హైలైట్. అధర్వ, ఆనందిల మధ్య కెమిస్ట్రీ బాగుం టుంది. కథ నచ్చి, తమిళంలో నిర్మించిన బాల తెలుగులో సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెలలో పాటలు, సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రఘు. -
కాళిగా రజనీకాంత్?
సూపర్‌స్టార్ రజనీకాంత్ మళ్ళీ మేకప్ వేసుకొంటున్నారు. గత ఏడాది విడుదలైన ‘లింగ’ చిత్రం తరువాత కెమేరా ముందుకు రాని ఆయన మరో వారంలో కొత్త పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తున్నారు. యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలోని ఈ సినిమా టైటిల్, ఇందులో రజనీ పాత్ర ఏమై ఉంటాయా అని కొద్దిరోజులుగా చర్చ జరుగుతోంది. ‘కాళి’ అనే పేరు పెడతారని ఇప్పుడు కోడంబాకమ్‌లో వినవస్తోంది. అన్నట్లు, రంజిత్ గత చిత్రమైన సూపర్‌హిట్ ‘మద్రాస్’లో కథానాయకుడు కార్తీ పోషించిన పాత్ర పేరు కూడా కాళీయే! ఆ సినిమాకు మొదట్లో ‘కాళి’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. తీరా చివరకు ‘మద్రాస్’ అని తుది టైటిల్ ఖరారు చేశారు. కాగా, 1980లలోనే రజనీకాంత్ ‘కాళి’ అనే సినిమాలో నటించారు. ఇప్పుడు అదే టైటిల్ రజనీ తాజా సినిమాకూ రిపీటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా, ఈ చిత్రంలో కథానాయిక ఎవరన్నది మరో సస్పెన్స్‌గా ఉంది. ఈ పాత్రకు విద్యాబాలన్, రాధికా ఆప్టే లాంటి పలువురిని అనుకున్నా, ఇప్పటి దాకా ఎవరూ ఖరారు కాలేదు. రజనీకాంత్‌తో పాటు ప్రకాశ్‌రాజ్, దినేశ్, కలై అరసన్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి అధికారిక వివరాల కోసం కొద్దిరోజులు ఆగాల్సిందే!