రాంచీ: దేశంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో జార్ఖండ్‌లోని రాంచీలో వినూత్న రీతిలో వేడుకలు నిర్వహించారు. హర్ము రోడ్డులోని కాళీ పూజ కమిటీ కాళీ పూజను ఘనంగా నిర్వహించింది.
అయితే ఈ కార్యక్రమంలో కాళీ పూజలో ఒక ప్రత్యేకత చోటుచేసుకుంది. పసుపు రంగు చీరలు ధరించిన 1,101 మంది మహిళలు కాళీమాతకు పూజలు నిర్వహించి, హారతులిచ్చారు. ఈ సందర్భంగా కాళీపూజ కమిటీ సభ్యుడు విక్కీ మాట్లాడుతూ గత ఐదేళ్లగా, ఇక్కడ కాళీ పూజలు జరుగుతున్నాయని తెలిపారు. ఇక్కడి మహిళలకు కాళీమాతపై అచంచలమైన నమ్మకం ఉందని, అమ్మవారికి పూజలు నిర్వహించి, సామూహికంగా హారతి ఇస్తారని అన్నారు.
ప్రతి సంవత్సరం ఇదేవిధంగా అందరూ కలిసి హారతి నిర్వహిస్తామని కార్యక్రమంలో పాల్గొన్న సరితా దేవి తెలిపారు. ఈ కార్యక్రమం మనసుకు ప్రశాంతతను అందిస్తుందన్నారు. మహిళలు హారతి ఇచ్చినప్పుడు అద్భుతంగా కనిపిస్తుందని అన్నారు. కాళీపూజకు ముందే మా గెటప్‌ను సిద్ధం చేసుకుంటమన్నారు. తామంతా ఒక రంగులోని చీర ధరించడంతో పాటు మేకప్ కూడా ఒక విధంగా ఉండేలా చూసుకుంటామన్నారు. దైవం ముందు అందరూ సమానులే అనే సందేశాన్ని ఇచ్చేందుకే తాము ఒకే రంగు చీరలు ధరిస్తామన్నారు.
ఇది కూడా చదవండి: కాళీ నిమజ్జనంలో రాళ్లదాడి
Comments
Please login to add a commentAdd a comment