aarati
-
1,101 మంది మహిళలు.. ఒకే రంగు చీరతో కాళీ పూజలు
రాంచీ: దేశంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో జార్ఖండ్‌లోని రాంచీలో వినూత్న రీతిలో వేడుకలు నిర్వహించారు. హర్ము రోడ్డులోని కాళీ పూజ కమిటీ కాళీ పూజను ఘనంగా నిర్వహించింది.అయితే ఈ కార్యక్రమంలో కాళీ పూజలో ఒక ప్రత్యేకత చోటుచేసుకుంది. పసుపు రంగు చీరలు ధరించిన 1,101 మంది మహిళలు కాళీమాతకు పూజలు నిర్వహించి, హారతులిచ్చారు. ఈ సందర్భంగా కాళీపూజ కమిటీ సభ్యుడు విక్కీ మాట్లాడుతూ గత ఐదేళ్లగా, ఇక్కడ కాళీ పూజలు జరుగుతున్నాయని తెలిపారు. ఇక్కడి మహిళలకు కాళీమాతపై అచంచలమైన నమ్మకం ఉందని, అమ్మవారికి పూజలు నిర్వహించి, సామూహికంగా హారతి ఇస్తారని అన్నారు.ప్రతి సంవత్సరం ఇదేవిధంగా అందరూ కలిసి హారతి నిర్వహిస్తామని కార్యక్రమంలో పాల్గొన్న సరితా దేవి తెలిపారు. ఈ కార్యక్రమం మనసుకు ప్రశాంతతను అందిస్తుందన్నారు. మహిళలు హారతి ఇచ్చినప్పుడు అద్భుతంగా కనిపిస్తుందని అన్నారు. కాళీపూజకు ముందే మా గెటప్‌ను సిద్ధం చేసుకుంటమన్నారు. తామంతా ఒక రంగులోని చీర ధరించడంతో పాటు మేకప్ కూడా ఒక విధంగా ఉండేలా చూసుకుంటామన్నారు. దైవం ముందు అందరూ సమానులే అనే సందేశాన్ని ఇచ్చేందుకే తాము ఒకే రంగు చీరలు ధరిస్తామన్నారు.ఇది కూడా చదవండి: కాళీ నిమజ్జనంలో రాళ్లదాడి -
Aarti Kumar Rao: ప్రయాణ దారులలో.. ప్రకృతి గీతాలతో..
థార్‌లోని ఇసుక దిబ్బల గుండె సవ్వడి విన్నది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని పర్వతశ్రేణులతో ఆత్మీయ స్నేహం చేసింది. అస్పాంలోని వరద మైదానాలలో అంతర్లీనంగా ప్రవహిస్తున్న కనీళ్లను చూసింది. కేరళ, గోవా తీరాలలో ఎన్నో కథలు విన్నది. కొద్దిమందికి ప్రయాణం ప్రయాణం కోసం మాత్రమే కాదు. ఆనందమార్గం మాత్రమే కాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక అన్వేషణ. తన అన్వేషణలో అందం నుంచి విధ్వంసం వరకు ప్రకృతికి సంబంధించి ఎన్నో కోణాలను కళ్లారా చూసింది బెంగళూరుకు చెందిన ఎన్విరాన్మెంటల్ ఫొటోగ్రాఫర్, రైటర్, ఆర్టిస్ట్ ఆరతి కుమార్ రావు....రాజస్థాన్‌లో ఒక చిన్న గ్రామానికి చెందిన చత్తర్‌సింగ్ గుక్కెడు నీటి కోసం పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పశ్చిమబెంగాల్లో ఒక బ్యారేజ్ నిర్మాణం వల్ల నిర్వాసితుడు అయిన తర్కిల్ భాయి నిలదొక్కుకోవడానికి పడ్డ కష్టాలు తక్కువేమీ కాదు. సుందర్బన్ప్రాంతానికి చెందిన ఆశిత్ మండల్ వేట మానుకొని వ్యవసాయం వైపు రావడానికి ఎంతో కథ ఉంది. బంగ్లాదేశ్‌లోని మత్స్యకార్మికుడి పిల్లాడిని సముద్రపు దొంగలు కిడ్నాప్ చేస్తే ఆ తండ్రి గుండెలు బాదుకుంటూ ఏడ్చే దృశ్యం ఎప్పటికీ మరవలేనిది.ఒకటా... రెండా ఆరతి కుమార్ ఎన్నెన్ని జీవితాలను చూసింది! ఆ దృశ్యాలు ఊరకే ΄ోలేదు. అక్షరాలై పుస్తకంలోకి ప్రవహించాయి. ఛాయాచిత్రాలై కళ్లకు కట్టాయి. ఒక్కసారి గతంలోకి వెళితే... ‘ఉద్యోగం మానేస్తున్నావట ఎందుకు?’ అనే ప్రశ్నకు ఆరతి కుమార్ నోట వినిపించిన మాట అక్కడ ఉన్నవాళ్లను ఆశ్చర్యానికి గురి చేసింది.‘ప్రకృతి గురించి రాయాలనుకుంటున్నాను. అందుకే ఉద్యోగం మానేస్తున్నాను’ అని చెప్పింది ఆమె. యూనివర్శిటీ ఆఫ్ పుణెలో ఎంఎస్సీ, థండర్ బర్డ్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్మెంట్–ఆరిజోనాలో ఎంబీఏ, ఆరిజోనా యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసిన ఆరతి అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ఇన్‌టెల్‌లో ఉద్యోగం చేసింది. కొంత కాలం తరువాత తనకు ఉద్యోగం కరెక్ట్ కాదు అనుకుంది. సంచారానికే ప్రాధాన్యత ఇచ్చింది.బ్రహ్మపుత్ర నది పరివాహకప్రాంతాలకు సంబంధించిన అనుభవాలను బ్లాగ్‌లో రాసింది. పంజాబ్ నుంచి రాజస్థాన్ వరకు ఎన్నోప్రాంతాలు తిరిగిన ఆరతి ‘మార్జిన్‌ల్యాండ్స్: ఇండియన్ ల్యాండ్‌స్కేప్స్ ఆన్ ది బ్రింక్’ పేరుతో రాసిన పుస్తకానికి మంచి పేరు వచ్చింది. ప్రకృతి అందాలే కాదు వివిధ రూ΄ాల్లో కొనసాగుతున్న పురా జ్ఞానం వరకు ఎన్నో అంశాల ప్రస్తావన ఈ పుస్తకంలో కనిపిస్తుంది. ప్రకృతికి సంబంధించిన అందం నుంచి వైవిధ్యం వరకు, వైవిధ్యం నుంచి వైరుధ్యం వరకు తన ప్రయాణాలలో ఎన్నో విషయాలను తెలుసుకుంది. తాను తెలుసుకున్న విషయాలను అక్షరాలు, ఛాయాచిత్రాలతో ప్రజలకు చేరువ చేస్తోంది ఆరతి కుమార్ రావు.భూమాత మాట్లాడుతోంది విందామా!ఆరతి కుమార్ రావు రాసిన‘మార్జిన్‌ల్యాండ్స్’ పుస్తకం కాలక్షేప పుస్తకం కాదు. కళ్లు తెరిపించే పుస్తకం. ఇది మనల్ని మనదైన జల సంస్కృతిని, వివిధ సాంస్కృతిక కళారూ΄ాలను పరిచయం చేస్తుంది.– ‘ప్రకృతి దృశ్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం తగినంత సమయాన్ని తప్పకుండా వెచ్చించాలి. దానిలో జీవించాలి. దానితో ఏకం కావాలి’ అంటుంది ఆరతి.– ఈ పుస్తకం ద్వారా మన సంస్కృతిలోని అద్భుతాలను మాత్రమే కాదు తెలిసో తెలియకో మనం అనుసరిస్తున్న హానికరమైన విధానాలు, ప్రకృతి విపత్తుల గురించి తెలియజేస్తుంది.– ‘మన సంప్రదాయ జ్ఞానంలో భూమిని వినండి అనే మాట ఉంది. భూమాత చెప్పే మాటలు వింటే ఏం చేయకూడదో, ఏం చేయాలో తెలుస్తుంది’ అంటుంది ఆరతి కుమార్ రావు.ఇవి చదవండి: Aruna Roy: 'ఈ పయనం సామాజికం'! -
స్టార్ హీరో విడాకుల రూమర్స్.. హింట్ ఇచ్చిన భార్య?
మరో స్టార్ హీరో విడాకులు తీసుకోబోతున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఈ మధ్య ఇండస్ట్రీలో పెళ్లి కంటే విడాకులు అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. మిగతా వాళ్ల గురించి పక్కనబెడితే తమిళ స్టార్ హీరో జయం రవి విడాకుల న్యూస్ గత కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు దానికి తగ్గట్లు ఇతడి భార్య చేసిన ఓ పని ఇప్పుడు చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)ప్రముఖ ఎడిటర్ మోహన్ కొడుకే జయం రవి. చాలా ఏళ్ల నుంచి తమిళంలో హీరోగా చేస్తున్నాడు. ఈ మధ్య 'పొన్నియిన్ సెల్వన్' లాంటి పాన్ ఇండియా మూవీలోనూ కీలక పాత్ర చేశాడు. ఇతడు ఆరతి అనే అమ్మాయిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇన్నేళ్లుగా బాగానే ఉన్నారు గానీ ఈ మధ్య ఎందుకో కలతలు వచ్చినట్లు ఉన్నాయి.మనస్పర్థల్ని తొలగించుకోవాలనుకున్నారు గానీ వర్కౌట్ కాలేదని, దీంతో గత కొన్నాళ్ల నుంచి జయం రవి, ఆరతి విడివిడిగా ఉంటున్నారని కోలీవుడ్ మీడియాలో టాక్. ఇప్పుడు దీన్ని నిజం చేసేలా భర్తతో ఉన్న ఫొటోల్ని ఆరతి ఇన్ స్టా నుంచి తీసేసింది. దీంతో విడాకుల వార్త నిజమేనని పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్లయింది. దీనిపై ఇద్దరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే తప్పితే అసలు విషయం బయటపడదు.(ఇదీ చదవండి: పెళ్లి రూమర్స్.. క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్ నివేతా థామస్) View this post on Instagram A post shared by Aarti Ravi (@aarti.ravi) -
Arati Kadav: సాఫ్ట్వేర్ టు సైన్స్–ఫిక్షన్ డైరెక్టర్
మల్టీ టాలెంట్ అంటే మాటలు కాదు. ఎంచుకున్న రంగాల్లో సమాన ప్రతిభ చాటాలి. తేడా జరిగితే అన్నిట్లో ‘జీరో’ తప్ప ఏమీ మిగలదు. సాఫ్ట్వేర్ ఇంజినీర్, రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా తన ప్రతిభను చాటుకున్న ఆరతి కదవ్ గురించి.... చిన్నప్పటి నుంచి ఆరతికి ఫాంటసీ జానర్ అంటే ఇష్టం. ‘పంచతంత్ర’ ‘మహాభారత’ కథల పుస్తకాలు చదువుతున్నప్పుడు వాటికి తన ఊహాలోకంలో తనదైన ఫాంటసీ జోడించేది. ఆ తరువాత సైన్స్–ఫిక్షన్ తన ఆసక్తిగా మారింది. ‘ఈ జీవితానికి అర్థం ఏమిటి? పుట్టడం, గిట్టడమేనా ఇంకేదైనా పరమావధి ఉందా?’ ఇలాంటి ప్రశ్నలతో చావుపుట్టుకల గురించి ఎన్నో కోణాలలో ఆలోచించేది. మరణానంతర జీవితం గురించి కథలు రాసేది. సైన్స్–ఫిక్షన్ ఫిల్మ్‌మేకర్‌గా ఆరతి గుర్తింపు తెచ్చుకోవడానికి ఈ ఊహలే పునాదిగా ఉపయోగపడ్డాయి. డైరెక్టర్‌గా తనకు ఎంతో పేరు తెచ్చిన ఫిలసాఫికల్ సైన్స్ ఫిక్షన్, బ్లాక్‌కామెడీ ఫిల్మ్ ‘కార్గో’కు ముందు రోబోలను దృష్టిలో పెట్టుకొని ‘టైమ్ మెషిన్’ అనే షార్ట్ ఫిల్మ్ తీసింది ఆరతి. ఈ చిన్న చిత్రం తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. మన పురాణాలలో నుంచి ఊహాజనితమైన కథలతో హాలీవుడ్ స్థాయిలో సినిమాలు తీయాలనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకునేలా చేసింది., మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన ఆరతి కదవ్ అమెరికాలో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పనిచేసింది. సాంకేతిక విషయాలకు తప్ప కాల్పనిక ఊహలకు బుర్రలో కాసింత చోటు దొరకనంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ‘ఫాంటసీ’ కోసం కొంత స్థలం రిజర్వ్ చేసుకునేది. కొంతకాలం తరువాత ఉద్యోగాన్ని వదిలి ఫిల్మ్ డైరెక్షన్ కోర్సులో చేరింది. కాల్పనిక విషయాల మీద ఆసక్తి ఆరతిని సైన్స్‌కు దూరం చేయలేదు. సందర్భాన్ని బట్టి శాస్త్రీయ విషయాలపై రచనలు చేస్తుంటుంది. చిత్రరంగంలో కృత్రిమ మేథ(ఏఐ)కి సంబంధించి ‘విల్ ఏఐ మీన్ ది డెత్ ఆఫ్ క్రియేటివిటీ’ పేరుతో రాసిన వ్యాసానికి మంచి స్పందన వచ్చింది. రచయిత్రిగా కలం పట్టినప్పుడు తనలోని సాఫ్ట్వేర్ ఇంజినీర్ బయటకు వచ్చి ‘రిసెర్చ్’ చేయమంటూ సలహా ఇస్తుంది. దీంతో ఊహలకు విరామం ఇచ్చి తాను ఏ సబ్జెక్ట్ గురించి అయితే రాస్తుందో ఆ సబ్జెక్ట్‌కు సంబంధించిన వ్యక్తులతో మాట్లాడి సాధికారమైన సమాచారాన్ని పోగు చేస్తుంది. దీని ఆధారంగా మళ్లీ రచన చేస్తుంది. డైరెక్టర్‌గా ఉన్నప్పుడు తనలోని రచయిత్రి బయటకు వచ్చి సీన్–డైలాగ్‌లను ఇంకా ఎలా మెరుగుపెట్టవచ్చో సలహా ఇస్తుంది. ఇక ప్రొడ్యూసర్‌గా ఉన్నప్పుడు బడ్టెట్‌ను సమర్థవంతంగా వాడుకోవాలనే విషయంలో సలహాలు ఇవ్వడానికి తనలోని సాప్ట్వేర్ ఇంజినీర్, రైటర్, డైరెక్టర్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ‘కార్గో’ సినిమా అయిదుగురు నిర్మాతలలో ఆరతి ఒకరు. ‘నేర్చుకున్న విద్య ఏదీ వృథా పోదు’ అని చెప్పడానికి ఆరతి బహుముఖ ప్రజ్ఞ సాక్ష్యంగా నిలుస్తుంది. -
‘మా దేవుడు నువ్వేనయ్యా’.. మంత్రికి హారతి, పూజలు!
బతికుండగా.. అందులో ఓ మంత్రిగారికి హారతి అందిస్తూ పూజలు చేస్తున్నాడు ఓ వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్‌మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి చంద్రాపూర్‌లో ఓ బార్ ఓనర్. ఫొటోలో హారతి అందుకుంటోంది మహారాష్ట్ర గార్డియన్ మినిస్టర్ విజయ్ వాడెట్టివర్. జిల్లా వ్యాప్తంగా మద్య నిషేధం ఎత్తేయడంతో కృతజ్ఞతగా అలా పూజలు చేస్తున్నాడట. ముంబై: మహరాష్ట్రలో చంద్రాపూర్‌తో పాటు వార్ధా, గడ్చిరోలి జిల్లాలో 2015, ఏప్రిల్ నెల అప్పటి ఫడ్నవిస్ సర్కార్ లిక్కర్ బ్యాన్ విధించి.. లైసెన్స్‌లు కూడా వెనక్కి తీసుకుంది. అప్పటి నుంచి ఈ మూడు జిల్లాల్లో మద్య నిషేధం అమలు అవుతోంది. ఇక ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని 2018లో రిటైర్డ్ అధికారి రామనాథ్ నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది మహారాష్ట్ర సర్కార్. అయితే.. మద్యం అమ్మకాల నిషేధం వల్ల క్రైమ్ రేట్ తగ్గకపోగా.. నకిలీ మద్యం అమ్మకాలు పెరిగాయని ఈ ఏడాది మే నెలలో ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ ఆధారంగా మద్య నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు శివసేన సర్కార్ పోయిన వారం ప్రకటించింది. ఇక కమిటీకి మద్య నిషేధం ఎత్తేయాలని సూచించిన వాళ్లలో చంద్రాపూర్ జిల్లా గార్డియన్ మంత్రి (మొత్తం 36 మంది గార్డియన్ మంత్రుల హోదాలో జిల్లాలకు పర్యవేక్షకులుగా ఉన్నారు) విజయ్ వాడెట్టివర్ కూడా ఉన్నారు. అందుకే అలా హారతి ఇస్తున్నాడట ఆ బార్ ఓనర్. ‘మాకు ఆయన దేవుడే. మా బతుకు తెరువును మళ్లీ మాకు ఇప్పించాడు. అందుకే ఈ పూజలు’ అని చెప్తున్నాడు ఆ వ్యక్తి. ఇదిలా ఉంటే ఈ ఐదేళ్లలో మద్య నిషేదంతో చంద్రాపూర్ నుంచి సుమారు 1,600 కోట్ల రూపాయల్ని మహా సర్కార్ నష్టపోయింది. Maharashtra: Owner of a bar & restaurant in Chandrapur, performs 'aarti' of a photo of district's Guardian Minister Vijay Wadettiwar, as the six-yr-old liquor ban here was lifted by state govt last week He says, "For us he is God. Whoever helps us earn a livelihood, is our God." pic.twitter.com/YikN32AEWb — ANI (@ANI) July 10, 2021 -
హారతి గైకోనుమా..