మరో స్టార్ హీరో విడాకులు తీసుకోబోతున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఈ మధ్య ఇండస్ట్రీలో పెళ్లి కంటే విడాకులు అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. మిగతా వాళ్ల గురించి పక్కనబెడితే తమిళ స్టార్ హీరో జయం రవి విడాకుల న్యూస్ గత కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు దానికి తగ్గట్లు ఇతడి భార్య చేసిన ఓ పని ఇప్పుడు చర్చనీయాంశమైంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)
ప్రముఖ ఎడిటర్ మోహన్ కొడుకే జయం రవి. చాలా ఏళ్ల నుంచి తమిళంలో హీరోగా చేస్తున్నాడు. ఈ మధ్య 'పొన్నియిన్ సెల్వన్' లాంటి పాన్ ఇండియా మూవీలోనూ కీలక పాత్ర చేశాడు. ఇతడు ఆరతి అనే అమ్మాయిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇన్నేళ్లుగా బాగానే ఉన్నారు గానీ ఈ మధ్య ఎందుకో కలతలు వచ్చినట్లు ఉన్నాయి.
మనస్పర్థల్ని తొలగించుకోవాలనుకున్నారు గానీ వర్కౌట్ కాలేదని, దీంతో గత కొన్నాళ్ల నుంచి జయం రవి, ఆరతి విడివిడిగా ఉంటున్నారని కోలీవుడ్ మీడియాలో టాక్. ఇప్పుడు దీన్ని నిజం చేసేలా భర్తతో ఉన్న ఫొటోల్ని ఆరతి ఇన్ స్టా నుంచి తీసేసింది. దీంతో విడాకుల వార్త నిజమేనని పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్లయింది. దీనిపై ఇద్దరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే తప్పితే అసలు విషయం బయటపడదు.
(ఇదీ చదవండి: పెళ్లి రూమర్స్.. క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్ నివేతా థామస్)
Comments
Please login to add a commentAdd a comment