కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే తన భార్య ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జయం రవి విడాకుల తర్వాత తనపై వచ్చిన రూమర్స్‌పై తొలిసారి స్పందించారు. ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు.
జయం రవి మాట్లాడుతూ.. 'మేము పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాం. నేను బయట టీ తాగినా..ఏ చేసినా తెలిసిపోతుంది. ఎందుకంటే మేము సినిమా వ్యక్తులం. మమ్మల్ని ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. వారి అభిప్రాయాలు కూడా వెల్లడిస్తుంటారు. మేమైతే వాటిని అడ్డుకోలేం కదా. కొంతమంది పరిణితి చెందిన వారు ఇలాంటి రూమర్స్‌ను పట్టించుకోరు. పరిపక్వత లేని కొద్దిమంది మాత్రమే రూమర్స్ వ్యాప్తి చేయడం చేస్తుంటారు. కొంతమంది ఆ విషయంలో ఉన్న తీవ్రత అర్థం చేసుకోకుండా మాట్లాడతారు. కానీ నా గురించి నాకు పూర్తిగా తెలిసినప్పుడు ఇలాంటి వాటి గురించి తెలుసుకుని ఎందుకు బాధపడతాం' అని అన్నారు.
(ఇది చదవండి: మౌనంగా ఉన్నానంటే తప్పు చేసినట్లు కాదు: ఆర్తి)
కాగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే తన అనుమతి లేకుండానే విడాకుల ప్రకటన విడుదల చేశారని ఆయన భార్య ఆర్తి ఆరోపించింది. అయితే ఆమె మాటల్లో ఎలాంటి నిజం లేదని జయం రవి క్లారిటీ ఇచ్చారు. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment