విడాకులకు గుడ్‌బై చెప్పి మళ్లీ కలవనున్న జయం రవి, ఆర్తి..? | Will Jayam Ravi And Aarti Withdraw Their Divorce Decision? Know Why This Rumour Trending In Social Media | Sakshi
Sakshi News home page

విడాకులకు గుడ్‌బై చెప్పి మళ్లీ కలవనున్న జయం రవి, ఆర్తి..?

Published Thu, Nov 28 2024 4:02 PM | Last Updated on Thu, Nov 28 2024 4:25 PM

Jayam Ravi And Aarti Withdraw Their Divorce Decision

కోలీవుడ్‌ నటుడు జయం రవి  ఇటీవల విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన మళ్లీ తన భార్య ఆర్తితో కలిసి జీవించనున్నాడంటూ కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నెట్టింట  ఇదే చర్చ జరుగుతుంది. కొన్నాళ్ల పాటు డేటింగ్ తర్వాత 2009లో పెళ్లి చేసుకున్న జయం రవి, ఆర్తి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. సుమారు 15 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఈ జోడీ పలు విభేదాలు రావడంతో విడాకుల నోటీసుల వరకు వెళ్లింది.

జయం రవి, ఆర్తి విడాకుల కేసు చెన్నై మూడో కుటుంబ న్యాయస్థానంలో జడ్జి తేన్‌మొళి విచారణ చేశారు. సయోధ్య కేంద్రంలో మధ్యవర్తిత్వానికి హాజరు కావాలని  దంపతులను ఆదేశించారు. అక్కడ జయం రవి, ఆర్తి ఇద్దరూ వ్యక్తిగతంగా హాజరయ్యారు. మధ్యవర్తితో పాటు ఒక గంటకు పైగా సాగిన చర్చలో వారిద్దరూ కూడా సానుకూలంగా మాట్లాడినట్లు సమాచారం. ఎలాంటి ఆందోళన లేకుండా తమ అభిప్రాయాలను వారు పంచుకున్నారట.  పిల్లల కోసం అయినా కలిసి ఉండాలని మధ్యవర్తి ఇచ్చిన కౌన్సిలింగ్‌తో వారు కాస్త ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. దీంతో మళ్లీ వారిద్దరూ కలుస్తారంటూ కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి.

ఘీ ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలలో ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు జయం రవి మొదటసారి ప్రకటించాడు. అయితే, విడాకుల విషయంలో తన ప్రమేయం లేదని ఆర్తి తన సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. తన అనుమతి లేకుండానే ఇలాంటి ప్రకటనలు చేయడం ఏంటి అంటూ జయం రవి నిర్ణయాన్ని తప్పుపట్టింది. కానీ, లాయర్‌ ద్వారా  ఆర్తికి విడాకుల నోటీసు పంపించానని జయం రవి చెప్పుకొచ్చాడు. ఈ విషయం ఆమె తండ్రికీ కూడా తెలుసని ఆ సమయంలో తెలిపాడు. ఇరు కుటుంబాల పెద్దలు చర్చించుకున్న తర్వాతే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అన్నాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement