భార్యకి సరైన గౌరవం ఇవ్వాలి.. ఖుష్బూ షాకింగ్ ట్వీట్ | Tamil Actress Kushboo Tweet On Jayam Ravi Indirectly | Sakshi
Sakshi News home page

Kushboo: పెళ్లి-భార్య గురించి చాంతాడంత ట్వీట్.. ఇప్పుడెందుకు?

Published Sun, Sep 22 2024 7:50 AM | Last Updated on Sun, Sep 22 2024 9:00 AM

Tamil Actress Kushboo Tweet On Jayam Ravi Indirectly

ఒకప్పటి హీరోయిన్, నటి ఖుష్బూ షాకింగ్ ట్వీట్ చేసింది. భార్యభర్తల అనుబంధం గురించి చాలా పెద్దగా రాసుకొచ్చింది. భర్త ఎలా ఉండాలి. భార్యని ఎలా చూసుకోవాలి అనే విషయాల్ని చాలా చక్కగా చెప్పింది. తలాతోక లేకుండా ఉన్న ఈ ట్వీట్ చూస్తే ఏం అర్థం కాదు. కానీ ఈ మధ్య జయం రవి విడాకులు తీసుకున్నాడు. తనకు కనీసం చెప్పుకుండా ఈ పనిచేశాడని అతడి భార్య ఆర్తి చెప్పుకొచ్చింది. సరిగ్గా ఇలాంటి టైంలో ఖుష్బూ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయిపోయింది.

ట్వీట్‌లో ఏముంది?
'తన కుటుంబాన్ని సమాజంలో ఉన్నతంగా ఉంచాలనుకునే వ్యక్తి.. ప్రేమించిన వారి అవసరాలు, కోరికలు తీర్చేందుకు ప్రయత్నిస్తాడు. పెళ్లి అనే బంధంలో ఎత్తుపల్లాలు సహజం. చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. అంతమాత్రాన బంధాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. ప్రేమ అనేది అప్పుడప్పుడు తగ్గొచ్చు. కానీ గౌరవం, మర్యాద చెక్కు చెదరకుండా ఉండాలి. పురుషుడు తన భార్యకి సరైన గౌరవం ఇవ్వాలి'

(ఇదీ చదవండి: కుమ్మేసిన లేడీస్‌.. ప్రైజ్‌మనీ డబుల్‌! అభయ్‌, మణికి వార్నింగ్‌)

'స్వార్థంతో ఉండే వ్యక్తి తన పనుల వల్ల మిగతా వాళ్ల మనసులు ఎలా బాధపడతాయనేది చూడలేడు. ఇలాంటి ప్రవర్తన వల్ల కుటుంబంలో కల్లోలం ఏర్పడుతుంది. జీవితం చాలా అందమైనది. కొన్నిసార్లు తీసుకునే నిర్ణయాల వల్ల పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. కానీ అప్పటికే ఆలస్యం కావొచ్చు. తన భార్యని గౌరవించలేని వ్యక్తి.. జీవితంలో ఎదగడు. నిన్ను ప్రేమించిన, తోడుగా నిలబడిన వ్యక్తిని అగౌరవపరచడం బాధాకరం. గౌరవం అనేది కుటుంబంలో ఉండాలి. ఈ విషయాన్ని మరిచిపోయిన వ్యక్తి ప్రేమ కంటే విలువైన బంధాన్ని, నిజమైన ఆనందాన్ని కోల్పోయినట్లే' అని ఖుష్బూ రాసుకొచ్చింది. ఇదంతా జయం రవిని ఉద్దేశించే పెట్టిందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

జయం రవి సంగతేంటి?
తమిళ స్టార్ జయం రవి చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు. 'పొన్నియిన్ సెల్వన్' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. 2009లో ఆర్తిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. కొన్నిరోజుల క్రితం విడాకులు ప్రకటన చేశాడు. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం అని చెప్పాడు. భార్య ఆర్తి మాత్రం తనకు తెలియకుండా ఇలా చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో ప్రేమనే విడాకులకు కారణమని అంటున్నారు. 

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌నే బూతులు తిడతావా? ఇంట్లో నుంచి వెళ్లిపో..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement