Khusbu
-
భార్యకి సరైన గౌరవం ఇవ్వాలి.. ఖుష్బూ షాకింగ్ ట్వీట్
ఒకప్పటి హీరోయిన్, నటి ఖుష్బూ షాకింగ్ ట్వీట్ చేసింది. భార్యభర్తల అనుబంధం గురించి చాలా పెద్దగా రాసుకొచ్చింది. భర్త ఎలా ఉండాలి. భార్యని ఎలా చూసుకోవాలి అనే విషయాల్ని చాలా చక్కగా చెప్పింది. తలాతోక లేకుండా ఉన్న ఈ ట్వీట్ చూస్తే ఏం అర్థం కాదు. కానీ ఈ మధ్య జయం రవి విడాకులు తీసుకున్నాడు. తనకు కనీసం చెప్పుకుండా ఈ పనిచేశాడని అతడి భార్య ఆర్తి చెప్పుకొచ్చింది. సరిగ్గా ఇలాంటి టైంలో ఖుష్బూ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయిపోయింది.ట్వీట్లో ఏముంది?'తన కుటుంబాన్ని సమాజంలో ఉన్నతంగా ఉంచాలనుకునే వ్యక్తి.. ప్రేమించిన వారి అవసరాలు, కోరికలు తీర్చేందుకు ప్రయత్నిస్తాడు. పెళ్లి అనే బంధంలో ఎత్తుపల్లాలు సహజం. చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. అంతమాత్రాన బంధాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. ప్రేమ అనేది అప్పుడప్పుడు తగ్గొచ్చు. కానీ గౌరవం, మర్యాద చెక్కు చెదరకుండా ఉండాలి. పురుషుడు తన భార్యకి సరైన గౌరవం ఇవ్వాలి'(ఇదీ చదవండి: కుమ్మేసిన లేడీస్.. ప్రైజ్‌మనీ డబుల్! అభయ్, మణికి వార్నింగ్)'స్వార్థంతో ఉండే వ్యక్తి తన పనుల వల్ల మిగతా వాళ్ల మనసులు ఎలా బాధపడతాయనేది చూడలేడు. ఇలాంటి ప్రవర్తన వల్ల కుటుంబంలో కల్లోలం ఏర్పడుతుంది. జీవితం చాలా అందమైనది. కొన్నిసార్లు తీసుకునే నిర్ణయాల వల్ల పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. కానీ అప్పటికే ఆలస్యం కావొచ్చు. తన భార్యని గౌరవించలేని వ్యక్తి.. జీవితంలో ఎదగడు. నిన్ను ప్రేమించిన, తోడుగా నిలబడిన వ్యక్తిని అగౌరవపరచడం బాధాకరం. గౌరవం అనేది కుటుంబంలో ఉండాలి. ఈ విషయాన్ని మరిచిపోయిన వ్యక్తి ప్రేమ కంటే విలువైన బంధాన్ని, నిజమైన ఆనందాన్ని కోల్పోయినట్లే' అని ఖుష్బూ రాసుకొచ్చింది. ఇదంతా జయం రవిని ఉద్దేశించే పెట్టిందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.జయం రవి సంగతేంటి?తమిళ స్టార్ జయం రవి చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు. 'పొన్నియిన్ సెల్వన్' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. 2009లో ఆర్తిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. కొన్నిరోజుల క్రితం విడాకులు ప్రకటన చేశాడు. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం అని చెప్పాడు. భార్య ఆర్తి మాత్రం తనకు తెలియకుండా ఇలా చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో ప్రేమనే విడాకులకు కారణమని అంటున్నారు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్‌నే బూతులు తిడతావా? ఇంట్లో నుంచి వెళ్లిపో..)A true man stands tall, putting his family above all else. His needs, whims, desires, and freedoms all come second to the ones who love him unconditionally. In the journey of life, every marriage faces its ups and downs, and yes, mistakes happen. But these missteps never grant a…— KhushbuSundar (@khushsundar) September 21, 2024 -
గాయపడ్డ సీనియర్ నటి ఖుష్బూ.. పోస్ట్ వైరల్
ఒకప్పటి హీరోయిన్ ఖుష్బూ గాయపడింది. మోకాలికి కట్టుతో కనిపించింది. ఈ విషయాన్ని చెబుతూ సోషల్ మీడియాలో ఓ ఫొటోని పోస్ట్ చేసింది. అయితే గాయానికి కారణాలేంటి? ఏం ప్రమాదం జరిగింది? అనే దాని గురించి బయటపెట్టలేదు. ప్రస్తుతం కోలుకుంటున్నానని మాత్రం చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్-8లోకి రాజ్ తరుణ్? ఎట్టకేలకు ఓ క్లారిటీ)వెంకటేశ్ 'కలియుగ పాండవులు' మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఖుష్బూ.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో 200కి పైగా సినిమాలు చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు క్యారెక్టర్ ఆర్టిస్ట్, టీవీ సీరియల్ చేసింది. ప్రస్తుతం రియాలిటీ షోలకు జడ్జిగా చేస్తోంది. దీనితో పాటు పాలిటిక్స్‌లో కాస్త బిజీ. మరోవైపు భర్త సుందర్‌తో కలిసి సినిమాలు నిర్మిస్తోంది. అలాంటిది ఇప్పుడు ఈమె కాలికి గాయం కావడంతో ఏమైందా అని ఫ్యాన్స్ అడుగుతున్నారు.(ఇదీ చదవండి: కారు ప్రమాదం.. నెలలోనే కోలుకున్న 'ప్రేమలు' నటుడు) View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
త్రిష, చిరంజీవిపై కేసు.. మళ్లీ రచ్చ చేస్తున్న మన్సూర్..!
తమిళ చిత్రసీమలో ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ కొద్దిరోజుల క్రితం జరిగిన మీడియా సమావేశంలో నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీని తరువాత, నటి త్రిష తన సోషల్ మీడియా పేజీలో మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలను తప్పుబట్టింది. 'మహిళలను కించపరిచే విధంగా మన్సూర్ అలీఖాన్ మాట్లాడాడు. ఆయనతో మళ్లీ నటించను. అతనిపై చర్యలు తీసుకోవాలని పోస్ట్ చేశారు. దీని తరువాత, నటి ఖుష్బూ, చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో నటుడు మన్సూర్ అలీ ఖాన్‌పై తమ నిరసనను వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: నటుడు నరేశ్‌కు దక్కిన అరుదైన గౌరవం.. లెఫ్టినెంట్ కల్నల్‌గా గుర్తింపు) అయితే తానేమీ తప్పుగా మాట్లాడలేదని మన్సూర్ అలీఖాన్ వివరణ ఇచ్చారు. మరోవైపు నటుడు మన్సూర్ అలీఖాన్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదు లేఖ పంపింది. దీంతో చెన్నై పోలీసులు మన్సూర్ అలీఖాన్‌పై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. నటుడు మన్సూర్ అలీఖాన్ అదృశ్యమయ్యారనే వార్తల నేపథ్యంలో, దానిని ఖండిస్తూ ఆడియోను విడుదల చేశారు. అనంతరం నవంబర్ 23న మన్సూర్ అలీఖాన్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంలో, త్రిష గురించి మాట్లాడినందుకు క్షమాపణలు చెబుతూ మన్సూర్ అలీఖాన్ ఒక ప్రకటన విడుదల చేశాడు. ఆ ప్రకటనలో, 'నా తోటి నటి త్రిష, దయచేసి నన్ను క్షమించండి' అని చెప్పాడు. ఈ నేపథ్యంలో నటి త్రిష తన సోషల్ మీడియా పేజీలో 'తప్పు చేయడం మానవుడి సహజం, క్షమించడం అనేది దైవం చూసుకుంటుంది' అని పోస్ట్ చేసింది.దీంతో ఈ గొడవ ముగిసింది అనుకుంటే.. తాజాగా మళ్లీ మన్సూర్ తెరపైకి వచ్చాడు. ఆ ముగ్గురిపై కేసు ఖుష్బు, త్రిష, చిరంజీవిలపై పరువునష్టం, పరిహారం, క్రిమినల్, సివిల్ దావా, ముందస్తు అల్లర్లు, నగరంలో 10 రోజులపాటు ప్రజా శాంతికి విఘాతం కలిగించడం, ఇతరులను రెచ్చగొట్టడం వంటి అన్ని కేటగిరీల కింద కేసు నమోదు చేయబోతున్నట్లు నటుడు మన్సూర్ అలీఖాన్ ప్రకటించారు. తన లాయర్ గురు ధనంజయన్ ద్వారా రేపు కోర్టులో కేసు వేయబోతున్నట్లు తెలిపారు. వారి ముగ్గురికి నోటీసులు జారీ చేస్తానని ఆయన ప్రకటించాడు. (ఇదీ చదవండి: బిగ్ బాస్ వల్ల రచ్చ.. వనిత విజయ్‌కుమార్‌పై దాడి) నవంబర్ 11న విలేకరుల సమావేశంలో తాను మాట్లాడిన ‘నిజమైన వీడియో’ని వారికి పంపించానని మన్సూర్ తెలిపాడు. సరిగ్గా వారం తర్వాత నవంబర్ 19న జరిగిన ఈ వీడియోనే తన ప్రసంగానికి ముందు, తర్వాత కొందరు ఎడిట్ చేసి త్రిషను అసభ్యకరంగా మాట్లాడినట్లు చిత్రీకరించారన్నారు. ఈ కేసులో తాను నిజమైన వీడియోను పంపానని, మరికొన్ని ఆధారాలతో రేపు కేసు నమోదు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. ముగిసిపోయిన గొడవను మళ్లీ మన్సూర్ తెరపైకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. -
రాహుల్ ఫారిన్ ట్రిప్.. కుష్బు కామెంట్స్
న్యూఢిల్లీ : కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాజధానిలో రైతులు ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలన్ని రైతులకు మద్దతుగా నిలుస్తున్నాయి. కేంద్రం-రైతుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీరు పార్టీ శ్రేణులను ఇరకాటంలో పడేసింది. వ్యక్తగత పర్యటన నిమిత్తం రాహుల్ విదేశాలకు వెళ్లారు. ఆదివారం ఖతార్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఇటలీలోని మిలన్కు బయలుదేరారు. ఈ నేపథ్యంలో రాహుల్ పర్యటనపై బీజేపీ విమర్శలు చేస్తోంది. రైతుల పట్ల కాంగ్రెస్ నాయకుడి ప్రేమ ఏపాటిదో స్పష్టంగా తెలుస్తోంది అంటూ వ్యంగాస్త్రాలు సంధిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ నాయకురాలు కుష్బు రాహుల్ విదేశీ పర్యటనపై మండి పడ్డారు. ఈ మేరకు కుష్బు ‘రైతుల ఉద్యమం గురించి ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. కానీ ప్రస్తుతం రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారు? కొద్ది రోజుల పాటు సెలవు తీసుకుంటున్నారా.. నిజమా..? మీకు రైతుల పట్ల ఎంతో బాధ్యత ఉన్నట్లు మాట్లాడతారు.. అదే నిజమైతే మీరు వారితో కలిసి వీధుల్లో ఉండాలి కానీ.. ఇలా విదేశాల్లో ఎంజాయ్ చేయడం ఏంటి?’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాక ‘రాహుల్ గాంధీ నుంచి నేను ఇంతకు మించి ఇంకేమైనా ఆశించగలనా.. ఖచ్చితంగా కాదు. అసలు నేను ఆయన వ్యక్తిగత విదేశి పర్యటన వార్త గురించే ఎదురు చూస్తున్నాను. ఆయన మాటలన్ని ఉత్తి డ్రామా. కొత్తగా ఏం లేదు.. అంతా పాతదే’ అంటూ ట్విట్టర్ వేదికగా కుష్బు రాహుల్ తీరును ఎండగట్టారు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రకారం ప్రస్తుతం రాహుల్ గాంధీ వ్యక్తిగత పర్యటన నిమిత్తం కొద్ది రోజుల పాటు విదేశాల్లో గడిపేందుకు వెళ్లారు. So much of noise was made for farmers protest by the opp, where is #RG now? Short holiday? Seriously? If you are so concerned about the farmers, you should have been out there on the streets with them n not holidaying. #RGTumSeNaHoPaayega @CTRavi_BJP @BJP4India @blsanthosh — KhushbuSundar ❤️ (@khushsundar) December 27, 2020 Oh! Did I expect #RG do anything else? Definitely not. In fact I was looking forward to the news of his travel for a short holiday. All talks and only drama. Nothing new. Same old story. — KhushbuSundar ❤️ (@khushsundar) December 27, 2020 -
సినీ నటి, బీజేపీ నేత కుష్బూ అరెస్టు
సాక్షి, చెన్నై: సినీ నటి, బీజేపీ నేత కుష్బూను చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేశారు. వీసీకే అధినేత తిరుమావళవన్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కుష్బూ నేతృత్వంలోని బీజేపీ నేతలు మంగళవారం నిరసన నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో చెన్నై నుండి చిదంబరంకు ప్రయాణిస్తుండగా ముత్తుకాడు సమీపంలో వీరిని అడ్డుకొని అరెస్టు చేశారు. కుష్బూతోపాటు మరికొంత మంది మహిళానేతలు, ఇతరలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమావళవన్ ఇటీవల యూట్యూబ్ ఛానెల్లో మనుస్మృతి, మహిళల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కుష్బూ ఆరోపించారు. ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేశామన్నారు. తన చివరి శ్వాస వరకు మహిళల గౌరవాన్ని కాపాడేందుకు పోరాడతానని కుష్బూ ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహిళల భద్రతకే ప్రాధాన్యత ఇస్తారని, తామూ ఆ మార్గంలోనే పయనిస్తామని స్పష్టం చేశారు. కొంతమంది శక్తుల అకృత్యాలను సహించేది లేదని ఆమె ప్రకటించారు. Arrested.. been taken in police van. we will fight till our last breath for the dignity of women. H'ble PM @narendramodi ji has always spoken about the safety of women and we walk on his path. We will never bow down to the atrocities of few elements out there. BHARAT MATA KI JAI! pic.twitter.com/71CKjFewri — KhushbuSundar ❤️ (@khushsundar) October 27, 2020 -
కారులో ఐదుగురికే స్థానం : డీకే అరుణ
సాక్షి, ధరూరు (గద్వాల): కారులో కేవలం ఐదుగురికే స్థానం ఉందని, కేసీఆర్, కేటీఆర్, సంతోష్‌రావు, కవిత, హరీష్‌రావుకే సరిపోయిందని, సామాన్యులకు స్థానంలేదని సినీనటి, ఏఐసీసీ అధికార ప్రతినిధి ఖుష్బూ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మండలంలోని ఖమ్మంపాడు, ఉప్పేరులో గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణ చేపట్టిన న్నికల ప్రచారంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అలంభించిన ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి కేసీఆర్ కుటంబ పాలన తీరును ఎండగట్టారు. రూ.350కోట్లతో తన ఫాంహౌస్, ప్రగతి భవన్ కట్టుకున్నారన్నారు. రాష్ట్రంలో మిగులు బడ్జెట్‌ను లోటు బడ్జెట్‌గా చేసిన కేసీఆర్‌ను గద్దెదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో 100సీట్లకు పైగా గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. డిసెంబరు 7న కాంగ్రెస్‌కు ఓటు వేసి, 9వ తేదీన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదినం ఉంది కాబట్టి ఆమె రుణం తీర్చుకోవాలన్నారు. అంతకుమందు మండలంలో పర్యటించిన ఖుష్బూకు అడుగడుగునా జననీరాజనాలు పలికారు. బోరూలే, షాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మిర్జాపురం రాంచంద్రారెడ్డి, నర్సన్‌దొడ్డి కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, సరళమ్మ, హన్మంతురెడ్డి, శంకర్, గంజిపేట రాములు, తదితరులు పాల్గొన్నారు. -
జెంటిల్ మెన్ పవన్ కళ్యాణ్ కు థాంక్స్
సాక్షి, సినిమా : త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపొందిన 'అజ్ఞాతవాసి' చిత్రంలో సీనియర్ హీరోయిన్ ఖుష్బూ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖుష్బూ స్వయంగా చిత్ర యూనిట్ కు స్పెషల్ థాంక్స్ తెలియజేశారు. తను ఇలాంటి వైవిధ్యమైన పాత్రలకోసమే ఇన్నాళ్లు ఎదురుచూశానని ట్వీట్ చేసింది. 'ఇలాంటి మంచి పాత్రలు చేసేందుకే ఇన్నాళ్లు వెయిట్ చేశాను. నాపై ఇంత నమ్మకం ఉంచిన త్రివిక్రమ్ కు థ్యాంక్స్. పక్కా జెంటిల్ మేన్ పవన్ కల్యాణ్ కు, హారిక-హాసిని బ్యానర్ కు ధన్యవాదాలు.' తన అజ్ఞాతవాసి పోస్టర్ ను ఖుష్బూ ట్వీట్ చేసింది. రేపు జరిగే ఆడియో లాంచ్ లో ఆమె క్యారెక్టర్ పై మరింత క్లారిటీ రానుంది. 'అత్తారింటికి దారేది' సినిమాలో నదియా పాత్రను త్రివిక్రమ్ ఎంత పవర్ ఫుల్ గా తీర్చిదిద్దారో, ఈ సినిమాలో ఖుష్బూ పాత్రను అదే స్థాయిలో మలిచారని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 19వ తేదీన ఆడియో వేడుక జరుపుకుని, వచ్చేనెల 10వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కీర్తి సురేశ్ అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఖుష్బూతోపాటు ఆది పినిశెట్టి కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. I am glad I waited this long..Wanted to do something really worth giving my time to..thank you #Trivikram for having faith in me n your smiles..thank you @PawanKalyan for being a through gentleman n giving me the space to be me..n thank you @haarikahassine for being such a gem.❤ pic.twitter.com/4R37MdC27z — khushbusundar (@khushsundar) 17 December 2017 -
స్టాలిన్‌తో ఎలాంటి విబేధాలు లేవు
సాక్షి, చెన్నై: డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా నటి ఖుష్బు ప్రచారానికి సిద్ధం అయ్యారు. ఏప్రిల్ ఐదో తేదీ నుంచి నిర్విరామంగా 17 రోజుల పాటు ఆమె ప్రచారం సాగ నుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం ఆమె ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం కోసం తాను సిద్ధం అయ్యానని, అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టే విధంగా తన ప్రచార ప్రసంగాలు ఉంటాయని వివరించారు. అయితే, ప్రచారంలో ఎక్కడా డీఎండీకే అధినేత విజయకాంత్, సమత్తువ మక్కల్ కట్చి నేత శరత్‌కుమార్‌ను విమర్శించనని ప్రకటించారు. పార్టీ ముఖ్యం: తాను డీఎంకేలో కార్యకర్తను, నాయకురాలిని కావున తనకు పార్టీ ముఖ్యం అని స్పష్టం చేశారు. డీఎంకేకు అనుకూలంగానే తాను వ్యవహరిస్తుంటానని పేర్కొన్నారు. వదంతులను పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. పుకార్లు పుట్టించే వాళ్లు పుట్టిస్తూనే ఉంటారని, వాటి గురించి ఆలోచించడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని వ్యంగ్యాస్త్రం సంధించారు. పార్టీ వర్గాలతో ఎలాంటి అభిప్రాయ బేధాలు తనకు లేదని స్పష్టం చేశారు. స్టాలిన్‌తో అసలు ఎలాంటి విబేధాలు లేవు అని, అంతా మీడియా సృష్టేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వేళ పార్టీలో తనకు ఇబ్బందులు కలిగి ఉంటే, ఎప్పుడో పార్టీని వీడేదాన్ని అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పిల్లల కోసం : తన ఇద్దరు పిల్లల కోసం సినిమాలకు దూరంగా ఉన్నానని, వారితో ఎక్కువ సమయం గడపాలన్నదే తన అభిమతంగా పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాలు లేనప్పుడు పిల్లలతో సరదాగా గడుపుతానని, అంత మాత్రాన పార్టీకి దూరంగా ఉన్నట్టు కాదన్నారు. పార్టీ కోసం కష్టపడేందుకు తాను సిద్ధం అని, తాను సరైన అభ్యర్థి కాదు కాబట్టే, తనకు ఎన్నికల్లో సీటు ఇవ్వలేదని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తన సేవల్ని ప్రచారానికి పార్టీ ఉపయోగించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఎన్నికల్లో డీఎంకే ప్రగతిని, అన్నాడీఎంకే వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రసంగాలు చేయనున్నానని వివరించారు. డీఎంకే చేసిందేమిటో, అన్నాడీఎంకే చేసిందేమిటో ప్రజలకు వివరించడమే కాదు, ఎవరైనా చర్చకు వచ్చినా తేల్చుకునేందుకు తాను సిద్ధం అని సవాల్ చేశారు. వ్యక్తిగత విమర్శలు చేయను: ప్రచారంలో ఎవరి మీదా వ్యక్తిగత విమర్శలను తాను చేయనని స్పష్టం చేశారు. వ్యక్తిగత విమర్శలకు డీఎంకే దూరం అన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రధానంగా డీఎండీకే అధినేత విజయకాంత్, సమత్తువమక్కల్ కట్చినేత శరత్‌కుమార్ రాజకీయ పార్టీలకు అధినాయకులైనా, డీఎంకేకు ప్రత్యర్థులుగా ఉన్నా, వారిని మాత్రం విమర్శించనని స్పష్టం చేశారు. సినీ కుటుంబం నుంచి వచ్చిన వాళ్లతో తనకు ఎలాంటి వ్యక్తిగత విబేధాలు లేవు అని, తామంతా ఒకే కుటుంబం అని, అందువల్లే వారిని మాత్రం విమర్శించనని పేర్కొన్నారు. నటి నగ్మా తన కన్నా సీనియర్ అని, ఆమెను ముద్దాడే విధంగా వ్యవహరించిన నాయకుడి చెంప పగలగొట్టి ఉండాలని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆ స్థానంలో తాను ఉండి ఉంటే, ఆ వ్యక్తి చెంప పగిలి ఉండేదన్నారు. ఇలాంటి పరిస్థితి తమకు ఇంత వరకు ఎదురు కాలేదని, ఎదురు కాదు కూడా అని ధీమా వ్యక్తం చేశారు. డీఎంకేలో మహిళకు భద్రత, రక్షణ ఉందని చివరి ప్రశ్నకు సమాధానం ఇచ్చి ముగించారు.