కారులో ఐదుగురికే స్థానం : డీకే అరుణ | The Anti-People Policies Adopted by The TRS Government | Sakshi
Sakshi News home page

కారులో ఐదుగురికే స్థానం : డీకే అరుణ

Published Sat, Dec 1 2018 8:34 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

The Anti-People Policies Adopted by The TRS Government - Sakshi

ఖష్బూకి బొకేని అందజేస్తున్న డీకే అరుణ

సాక్షి, ధరూరు (గద్వాల): కారులో కేవలం ఐదుగురికే స్థానం ఉందని, కేసీఆర్, కేటీఆర్, సంతోష్‌రావు, కవిత, హరీష్‌రావుకే సరిపోయిందని, సామాన్యులకు స్థానంలేదని సినీనటి, ఏఐసీసీ అధికార ప్రతినిధి ఖుష్బూ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మండలంలోని ఖమ్మంపాడు, ఉప్పేరులో గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి డీకే అరుణ చేపట్టిన న్నికల ప్రచారంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అలంభించిన ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి కేసీఆర్‌ కుటంబ పాలన తీరును ఎండగట్టారు. రూ.350కోట్లతో తన ఫాంహౌస్, ప్రగతి భవన్‌ కట్టుకున్నారన్నారు. రాష్ట్రంలో మిగులు బడ్జెట్‌ను లోటు బడ్జెట్‌గా చేసిన కేసీఆర్‌ను గద్దెదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

రాష్ట్రంలో 100సీట్లకు పైగా గెలిచి కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. డిసెంబరు 7న కాంగ్రెస్‌కు ఓటు వేసి, 9వ తేదీన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదినం ఉంది కాబట్టి ఆమె రుణం తీర్చుకోవాలన్నారు. అంతకుమందు మండలంలో పర్యటించిన ఖుష్బూకు అడుగడుగునా జననీరాజనాలు పలికారు. బోరూలే, షాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మిర్జాపురం రాంచంద్రారెడ్డి, నర్సన్‌దొడ్డి కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, సరళమ్మ, హన్మంతురెడ్డి, శంకర్, గంజిపేట రాములు, తదితరులు పాల్గొన్నారు. 
  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement