బిజ్వారంలో మాట్లాడుతున్న డీకే అరుణ
సాక్షి, మల్దకల్ (గద్వాల): తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తానని, నిరుపేద దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేసిన కేసీఆర్ మాయమాటలను తెలంగాణ ప్రజలు మరోసారి నమ్మే స్థితిలో లేరని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్, నాగర్‌కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మెల్యే అభ్యర్థి డీకే అరుణ అన్నారు.
గురువారం మండలంలోని మేకలసోంపల్లి, బిజ్వారం, దాసర్‌పల్లి, ఉలిగేపల్లి, నేతువానిపల్లి, అడివిరావుల్‌చెర్వు, మంగంపేట, సద్దలోనిపల్లి, పెద్దొడ్డి, మద్దలబండ, మద్దలబండ పెద్దతండా, మద్దలబండ చిన్నతండా, మల్దకల్ గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొని మాట్లాడారు.
నాలుగున్నరేళ్లలో కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు హామీలు గుప్పిస్తున్నారని, ప్రజలు ఆయన మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మెనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్నారు.
కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విక్రమసింహారెడ్డి, డాక్టర్ రఘనాథ్‌రెడ్డి జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు అరుణ, నాయకులు నారాయణరెడ్డి, సత్యారెడ్డి, రాముడు, మురళీధర్‌రెడ్డి, సూర్యగౌడ్, చంద్రశేఖర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, నరేందర్, గోపాల్, తిమ్మప్ప, రాజశేఖర్‌రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment