ప్రజలనుద్ధేశించి మాట్లాడుతున్న డీకే అరుణ
సాక్షి,గద్వాల: ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగున్నరేళ్ల పాలన మొత్తం ఫాం హౌస్‌కే పరిమితం అయిందని మాజీమంత్రి డీకే అరుణ ధ్వజమెత్తారు. మంగళవారం స్థానిక డీకే బంగ్లాలో వివిధ గ్రామాలకు చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు, ముస్లిం మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారినుద్ధేశించి డీకే అరుణ మాట్లాడారు. ప్రగతి భవన్, ఫాం హౌస్‌లు తప్ప రాష్ట్ర ప్రజలను కలిసిన పాపాన పోలేదని విమర్శించారు. స్వార్థచింతన, నియంతృత్వ ధోరణితో సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ 2004, 2009 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేసిందన్నారు. 2018 ఎన్నికల ప్రణాళికలో ఇళ్లు లేని పేదలందరికీ రూ.5లక్షలు ఇస్తూ మొదటి ఏడాదిలోనే అర్హులైన వారందరికీ గృహాలు నిర్మించాలని నిర్ణయించామన్నారు.
గద్వాల ప్రజలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చే సిందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కాం గ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి టీఆర్‌ఎస్ నాయకులు వణుకుతున్నారని, అలవికాని హామీలిచ్చే గులాబీ పార్టీని భూస్థాపితం చేయా లని పిలుపునిచ్చారు. గద్వాలలో టీఆర్‌ఎస్ పార్టీ రాబందుల పార్టీగా మారిందని, అక్రమ వ్యాపారాలమీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదన్నారు. అనంతరం వెంకంపేట, చిప్పదొడ్డి, విఠలాపురం, దాసరపల్లి, జిల్లెడ బండ, కేటీదొడ్డి తదితర గ్రామాలకు చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్తల తో పాటు గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి డీకే అరుణ కాంగ్రెస్ కండువాలను కప్పి పా ర్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, పటేల్ ప్రభాకర్‌రెడ్డి, బల్గెర నారాయణరెడ్డి, పద్మారెడ్డి, సత్యారెడ్డి, రమేష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment