సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: దొరల ప్రభుత్వం కావాలో, ప్రజా ప్రభుత్వం కావాలో తెలంగాణ సమాజం తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంద ని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజా నీకానికి – దొరలకు మధ్య జరిగే పోరాటమన్నారు. బుధవారం ఆయన ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ మలి విడత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిం చారు. మూడు రోజుల పాటు సాగే ఈ ప్రచారం తొలి రోజు దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాల్లో జరిగింది. ఈ సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట, మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు, అమరచింతల్లో రోడ్డు షోలు, మక్తల్, నారాయణపేట నియోజకవర్గ కేంద్రాల్లో సభలు జరిగాయి.
ఈ కార్యక్రమాల్లో ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి భట్టి ప్రసంగించారు. రాష్ట్రం ఏర్పడే నాటికి మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల కుప్పగా మారిందని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో రూ.6 లక్షల కోట్ల నిధులు, రూ.లక్ష కోట్ల అప్పు తీసుకొచ్చి ఏం చేశారో ప్రజలకు లెక్క చెప్పాలన్నా రు. ఈ నాలుగున్నరేళ్లలో ఒక పరిశ్రమైనా తీసుకొచ్చా రా, ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా అని ప్రశ్నిం చారు. తన పాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేకనే సీఎం కేసీఆర్ విపక్షాలపై బూతుపురాణం చదువుతున్నారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలో పీపుల్స్ గవర్నమెంట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చిందని, ఇప్పుడు కూడా అలాంటి పాలనే మళ్లీ రాబోతోందని అన్నారు.
నలుగురు దొంగల కోసమా: విజయశాంతి
ప్రాణాలకు తెగించి తెచ్చుకున్న తెలంగాణ నలుగురు దొంగల కోసమా? లేక ప్రజల కోసమా? అని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ప్రశ్నించారు. 2014లో చేసిన చిన్న తప్పుకు నాలుగున్నరేళ్లు ప్రజ లు నరకం అనుభవించారన్నారు. ఈసారి కూడా కేసీఆర్ మాయమాటలు నమ్మి మోసపోతే ప్రజల చేతికి చిప్పే గతవుతుందన్నారు. కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికి టీఆర్‌ఎస్– బీజేపీ మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకొని కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. రాష్ట్రం లో 20 లక్షల ఓట్లు గల్లంతైతే బీజేపీ నేతలు పల్లెత్తు మాట కూడా మాట్లాడటం లేదన్నారు. రాష్ట్రంలో పర్యటిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా.. ఓట్ల గల్లంతుపై మాట్లాడాలని, లేకపోతే ఆ రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరినట్లు భావించాల్సి వస్తుందన్నారు. కేసీఆర్ దగ్గర బాగా డబ్బులున్నాయ ని.. వచ్చే ఎన్నికల్లో విచ్చలవిడిగా పంపిణీ చేస్తే, అవి తీసుకొని ఓటు కాంగ్రెస్‌కు వేయాలని కోరారు.
బాబు వద్ద ఉన్నప్పుడు గుర్తులేదా: డీకే అరుణ
చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చి ఉంటే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసేవారా అని మాజీ మంత్రి డీకే అరుణ ప్రశ్నించారు. చంద్రబాబు వద్ద ఉన్నప్పు డు కేసీఆర్‌కు తెలంగాణ గుర్తుకురాలేదా అని నిలదీ శారు. కేసీఆర్ మాదిరిగా అవకాశవాద రాజకీయాలు చేయడం కాంగ్రెస్ నైజం కాదన్నారు. గతంలోనే కాంగ్రెస్ నేత మల్లికార్జున్ నాయకత్వంలో తెలంగాణ కోసం పోరాడామని, 48 మంది ఎమ్మెల్యేలు తెలంగాణకోసం సంతకం చేసిన విషయం గుర్తించుకోవాలని అన్నారు. కేసీఆర్ మాయమాటలు నమ్మి తెలంగాణ ప్రజానీకం మరోసారి మోసపోవద్దని కోరారు. పాలమూరు ఆత్మగౌరవం కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యాలని ప్రజలను కోరారు.
రోడ్డు షోలో మాట్లాడుతున్న భట్టి విక్రమార్క.
చిత్రంలో విజయశాంతి, డీకే అరుణ
Comments
Please login to add a commentAdd a comment