సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ డ్రగ్స్‌కి క్యాపిటల్‌గా మారిందని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కి ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెడ్డి, గౌడ్ల వర్గాలు రాజకీయంగా ఇబ్బందిగా మారుతారని ఆ వర్గాలను కేసీఆర్ వేధిస్తున్నారని విమర్శించారు. బడుగులు అంతా ఏకమై కేసీఆర్‌కు బుద్ది చెప్పాలన్నారు. కల్లు గీతకార్మికుల సమస్యలను మేనిఫెస్టోలో చేర్చుతామన్నారు. అందరిని మోసం చేస్తున్న పాపాత్ముని పాలన త్వరలోనే అంతం కాబోతుందని మధుయాష్కి పేర్కొన్నారు.
కులాలను చీల్చి లబ్ది పొందాలని చూస్తున్నారు : డీకే అరుణ
కేసీఆర్ కులాలను చీల్చి లబ్ది పొందాలని చూస్తున్నారని తాజా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ విమర్శించారు. అన్నికులాల భవనాలకు వందల జీవోలు వచ్చాయి కానీ భవనాలను నిర్మించలేదన్నారు. టీఆర్‌ఎస్ భవనాలకు ప్రతి జిల్లాలో భూములు దొరికుతాయి కానీ కుల సంఘాలకు భూములు దొరకడం లేదా అని ప్రశ్నించారు. గద్వాలలో టీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్‌కి కేటాయించిన భూమి ప్రభుత్వానిదని, అక్కడ ఆఫీస్ కట్టనిచ్చేది లేదన్నారు. టీఆర్‌ఎస్ నాయకుల ఇసుక దందాలో ఒక్కరోజులో వచ్చే ఆదాయంతో భవనం కట్టుకోవచ్చని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హామీలను చూశాం..మోసాలను చూశాం.. ఇక చాలు అంతా కలిసి కాంగ్రెస్‌కి అండగా ఉండాలని కోరారు. గీత కార్మీకులకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment