madhu yaski goud
-
‘మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమే’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్.. తన అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నాల్లో భాగంగానే జాతీయ పార్టీ అంటున్నాడు. కేసీఆర్.. తన కుటుంబంపై వచ్చిన అవినీతి కేసుల నుండి తప్పించుకునే పనిలో ఉన్నాడని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా, మధుయాష్కీ గురువారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను మోసం చేయడంలోనే భాగంగానే జాతీయ పార్టీ ప్రకటన అని కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టినా ఒరిగేదేమీ లేదు. కేసీఆర్ రాజకీయంగా వేసే అడుగులన్నీ బీజేపీకి ఉపయోగపడేలా ఉన్నాయి. జాతీయ పార్టీ అంటూ కేసీఆర్.. యూపీఏ భాగస్వామ్య పార్టీల నాయకులనే కలుస్తున్నాడు. బీజేపీకి మద్దతుగా ఉన్న పార్టీలను, నాయకులను కలవడం లేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లేకుండా ఎటువంటి రాజకీయ కూటమి సాధ్యం కాదు. కేసీఆర్ తన అవినీతిని కప్పి పుచ్చుకునే ప్రయత్నాల్లో భాగంగానే జాతీయ పార్టీ అంటున్నాడు. లిక్కర్ స్కామ్ నుంచి తప్పించుకునేందుకు బీజేపీకి కేసీఆర్ అంతర్గతంగా సహకరిస్తున్నాడు. తన కుటుంబంపై వచ్చిన అవినీతి కేసుల నుండి తప్పించుకునే పనిలో కేసీఆర్ బిజీగా ఉన్నాడు. టీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు అనే బీజేపీ ప్రచారం కూడా తెలంగాణలో కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టేందుకే చేస్తున్నారు. టీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు ఉండదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక కూడా బీజేపీ-టీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమే. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశాడు. జాతీయ స్థాయిలో కేసీఆర్‌ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. దేశంలో అత్యంత మోసపూరిత ముఖ్యమంత్రి కేసీఆర్ అని శరద్ పవార్ నాతో అన్నాడు. కేసీఆర్ ఎనిమిదేళ్ళ పాలనలో రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ నిజమైతే కేసీఆర్ అవినీతిపై ఇప్పటి వరకూ ఎందుకు చర్యలు లేవు. లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కుటుంబానికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు. చెట్లతో వేల కోట్లు సంపాదించిన వ్యక్తి కూడా లిక్కర్ స్కామ్‌లో ఉన్నాడు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి రేపో ఎల్లుండో అరెస్ట్ అవుతారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇల్లు కూల్చి.. ఎనిమిది ఏండ్ల తర్వాత విగ్రహం పెట్టారు. విగ్రహం పెట్టడానికి ఎనిమిది ఏండ్లు పట్టిందా..? కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం పెట్టాం అని కేటీఆర్ గొప్పగా చెప్పుకుంటున్నారు. తమ్ముడు తారక రామారావు.. స్టోరీ లు చెప్పడం మానుకో. తెలంగాణ ప్రజలు తిరుగు బాటుకి సిద్ధం అవ్వండి అంటూ వ్యాఖ్యలు చేశారు. -
ఘాటెక్కి.. చప్పబడ్డ విష్ణు విందు
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎల్పీ నేత పి.జనార్దన్‌రెడ్డి తనయుడు, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి అకస్మాత్తుగా సీనియర్ నాయకులను మంగళవారం తన ఇంటికి లంచ్‌కు పిలవడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. పదిరోజుల క్రితం విష్ణు సోదరి విజయారెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి విష్ణువర్ధన్‌రెడ్డి రాష్ట్ర పార్టీ పెద్దలపై ఆసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోని హైదరాబాద్‌లోని సీనియర్ నేతలతోపాటు ఇతర ముఖ్యులను కూడా భోజనానికి ఆహ్వానించారు. పనిలో పనిగా తన అసంతృప్తిని సీనియర్లతో పంచుకోవాలని భావించినట్లుగా ప్రచారం జరిగింది. అయితే పిలిచిన నేతలంతా లంచ్‌కు వెళ్తారా లేదా అని ఆసక్తిరేపుతున్న సమయంలో విష్ణు మీడియాతో మాట్లాడుతూ సాధారణంగానే ప్రతీ ఏటా సీనియర్ నేతలను భోజనానికి ఆహ్వానిస్తుంటానని, పార్టీలో ఎవరు చేరినా తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కూడా రావాలని కోరారని, అయితే వారిద్దరు ఢిల్లీలో ఉండటంతో రాలేమని చెప్పారని విష్ణు పేర్కొన్నారు. అదే సమయంలో ఢిల్లీలో రేవంత్ మీడియాతో మాట్లాడుతూ విష్ణు తనను భోజనానికి రావాలని కోరారని చెప్పారు. హైదరాబాద్‌లో తన అభిమానులు, కార్యకర్తలతో సభ పెట్టుకుంటానని అడిగారని, అందుకు తాను అనుమతిచ్చినట్టు వెల్లడించారు. ప్రకటన తర్వాత దిగిన నేతలు... అటు రేవంత్‌రెడ్డి, ఇటు విష్ణువర్ధన్ ప్రకటనలతో సీనియర్ నేతలంతా ఆయన గృహానికి వెళ్లడం ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్, గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ డాక్టర్ రోహిణ్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి చామల కిరణ్‌రెడ్డి, జహీరాబాద్ కాంగ్రెస్ నేత మదన్మోహన్రావు, బెల్లయ్య నాయక్ తదితర నేతలు దోమల్‌గూడలోని విష్ణువర్థన్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. అసమ్మతి అనుకునేలోపు... విష్ణు ఆహ్వానించిన జాబితాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి లేరని చాలామంది నేతలు వెళ్లేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. చేరికలపై ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని, దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయాలని నేతలు భావించారు. అసమ్మతి గ్రూపును నడిపిద్దామని భావించిన నేతలకు తీరా విష్ణు ఇచ్చిన స్పష్టతతో మింగుడుపడకుండా అయినట్టు చర్చ జరుగుతోంది. కాగా, విందు అనంతరం వీహెచ్ మాట్లాడుతూ ఒకప్పుడు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశానని, ఆయనను సోనియాగాంధీ నియమించినందున ఆయన నాయకత్వాన్ని బలపరుస్తానని, అదే సమయంలో రేవంత్‌రెడ్డి కూడా అందర్నీ కలుపుకొని వెళ్లాలని సూచించారు. పీజేఆర్ కుమారుడు విష్ణువర్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉంటారని, ఈరోజు లంచ్ మీటింగ్‌తో అందరి అపోహలు తొలగిపోయాయని ఆయన తెలిపారు. తన సమస్యపై కేంద్ర నాయకత్వంతోనే మాట్లాడుతానన్నారు. -
అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి
హైదరాబాద్: దేశ భద్రతకు వెన్నుముకలా నిలిచిన మిలటరీని ప్రైవేటీకరించే సన్నాహాల్లో భాగంగా తీసుకువస్తున్న అగ్నిఫథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ డిమాంఢ్ చేశారు. సికింద్రాబాద్ లో జరిగిన యువకుల ఆందోళనల్లో భాగంగా పోలీసులు కాల్పుల్లో రాకేష్ అనే యువకుడు మరణించడం అత్యంత దిగ్భ్రాంతిని కలిగించిందని, రాకేష్ మరణానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రాకేష్ కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని వెంటనే ప్రకటించాలన్నారు. మధు యాష్కీ గౌడ్ ఇంకా ఏమన్నారంటే.. ➖ఒన్ ర్యాంక్ ఒన్ ఫెన్షన్ పథకానికి మంగళం పాడేలా నో ర్యాంక్.. నో ఫెన్షన్ పథకం అమలు చేయడంలో భాగంగా అగ్నిపథ్ కేంద్రం తీసుకువస్తోంది. మిలట్రీని ప్రైవేటీకరించడంతో పాటు, సైనిక విభాగాల్లో జీతభత్యాలు, ఇతర ఖర్చలు తగ్గించుకోవాలన్న దుర్మార్గమైన ఆలోచనతోన కేంద్రం ఈ పథకం తీసుకువస్తోంది. దీనిని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. ➖కరోనా కాలంనుంచి ఆర్మీలో రిక్రూట్ మెంట్ కోసం యువత ఎదురుచూస్తోంది. రెగ్యులర్ రిక్రూట్ మెంట్ చేయకుండా కాంట్రాక్ట్ ప్రాతిపదికన అగ్నిపథ్ పేరుతో రిక్రూట్ మెంట్లు చేసేందుకు కేంద్రం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ➖సికింద్రాబాద్ లో శాంతియుతంగా నిరసన చేస్తున్న యువతపై పోలీసులు లాఠీఛార్జీ, కాల్పులు జరపడం అత్యంత అమానుషం. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. ➖కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా యువకుల సహనాన్ని ఇంకా పరీక్షించకుండా వెంటనే రిక్రూట్ మెంట్ మొదలు పెట్టాలి. -
బీజేపీ-టీఆర్ఎస్ కుమ్మకై రైతులను హింస పెడుతున్నాయ్: మధు యాష్కీ
సాక్షి, ఖమ్మం: వరంగల్ పట్టణం మే 6నలో కిసాన్ సంఘర్షణ పోరాట సభ జరగనుందని ఆ కార్యక్రమానికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా హాజరు అవుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ తెలిపారు. ఆయన మంగళవారం ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం మంత్రి గుండాగా మారి, కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి వేధింపులు తట్టుకోలేక నగరంలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిద్ర పోతున్నడా ? అని ప్రశ్నించారు. రౌడీ మంత్రిని తక్షణమే కేబినెట్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి అయిన తారక రామారావు అండ చూసుకుని స్థానిక మంత్రి అజయ్ కుమార్ రెచ్చి పోతున్నాడని దుయ్యబట్టారు. బీజేపీ-మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే.. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ సభ్యుల ఆస్తులపై సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త.. రాష్ట్రం వచ్చాక రాబందుల సమితిగా మారిందని, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం మిల్లర్లతో కుమ్మక్కై వేల కోట్ల రూపాయలను దోపిడీ చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ-టీఎర్ఎస్ పార్టీలు కుమ్మకై రైతులను హింస పెడుతున్నాయని అన్నారు. ఢిల్లీ రాజధానిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసింది ధర్నా కాదు.. డ్రామా అని ఎద్దేవా చేశారు. సమస్యలు పరిష్కరించాల్సిన ప్రధానమంత్రి మనుషులు హైదరాబాద్‌లో ధర్నా చేస్తారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో ఏసీలు, కూలర్లు పెట్టుకుని డ్రామా చేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపరీతంగా ధరలు పెంచుతూ సామాన్యులను హింసకు గురి చేస్తున్నారని విమర్శించారు. -
కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్.. ఆ డబ్బు ఏమైందో చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో విశ్వనగరం.. విష నగరంగా మారిందని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ అన్నారు. గాంధీ భవన్లో శుక్రవారం మధు యాష్కీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్‌కి అడ్డాగా మారింది. ఏడేళ్ల తెలంగాణ టీఆర్ఎస్ పాలనలో విశ్వనగరం.. విష నగరంగా మారింది. 50 ఏండ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని అంటున్నావు కేటీఆర్.. ఐటీకి హైదరాబాద్‌ని హబ్‌గా చేసింది. నీ హయంలో హైదరాబాద్ డ్రగ్స్‌కి క్యాపిటల్ సిటీగా మారింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్.. సోనియా వల్లే స్వరాష్ట్రం వచ్చింది. ఏడేళ్లలో విద్యార్థులను మత్తుకు బానిసగా మార్చేశారు.. హైదరాబాద్‌ను విష నగరం చేశారు. రాష్ట్రంలో అన్ని ఛార్జీలు పెంచుతూ జనాన్ని ఏప్రిల్ ఫూల్ చేశారు. విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఆసుపత్రుల్లో రోగులను ఎలుకలు కొరుకుతుంటే సిగ్గుగా అనిపించడం లేదా?. కేసీఆర్‌కు పంటి నొప్పి వస్తే ఢిల్లీకి పోతారు.. టెస్టుల కోసం యశోద ఆసుపత్రికి వెళ్తారు. ప్రత్యేక విమానానికి పెట్టిన ఖర్చుతో ఒక ఐసీయూ ఏర్పాటు చేయొచ్చు. ప్రతీ గింజా కొంటా అని చెప్పిన కేసీఆర్... కల్లబొల్లి మాటలు ఆపి కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని కొనాలి. రైతులను నట్టేట ముంచి రైస్ మిల్లర్లతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కుమ్మక్కు అయ్యారు. నిజామాబాద్‌లో రైస్ మిల్లర్లతో కల్వకుంట్ల కవిత కుమ్మక్కు అయ్యింది. బీజేపీకి చిత్తశుద్ది ఉంటే సీబీఐతో విచారణ జరిపించాలి. ఆత్మహత్య చేసుకున్న రైతులకు డబ్బులు ఇస్తా అని కవిత కోట్లు వసూలు చేసింది. ఆ డబ్బులు ఏమయ్యాయో చెప్పాలి. పోలీసులు ట్రాఫిక్ చాలన్ల పేరుతో 250 కోట్లు వసూలు చేశారు. పబ్బుల కట్టడిని ఎందుకు పట్టించుకోవడం లేదు. కమిషనర్ సీవీ ఆనంద్ నిజాయితీ గల అధికారి.. ప్రభుత్వం ఒత్తిడికి లొంగకుండా పబ్‌లలో డ్రగ్స్ మాఫియాను కట్టడి చేయాలి. కేసీఆర్ తెలంగాణను మత్తులో ముంచతూ విద్యుత్ ఛార్జీలు పెంచారు. నిరుద్యోగులను టీఆర్ఎస్ ప్రభుత్వం నిండా ముంచింది. అటు భద్రాచలం రాముడికి కేసీఆర్ టోపీ పెట్టాడు. భద్రాద్రి రాముడికి పట్టు బట్టలు కోసం కూడా డబ్బులు ఇవ్వడం లేదు. అధికారంలో ఉన్నవాళ్లు చేయాల్సింది ఆందోళన కాదు.. పరిష్కారం చూపాలి. కొట్లాడి తెలంగాణ తెచ్చిన అని చెప్పుకునే కేసీఆర్.. నువ్వు అంత మొనగాడివి అయితే కేంద్రం చేత వడ్లు ఎందుకు కొనిపించడం లేదు’’ అని ప్రశ్నించారు. ఇది చదవండి: కమలంలో ముసలం.. పార్టీలో గ్రూపు రాజకీయాలు.. -
రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకోవడం అప్రజాస్వామికం: మధు యాష్కీ
సాక్షి, హైదరాబాద్: ఎర్రవల్లిలో కిసాన్ కాంగ్రెస్ నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకోవడం అప్రజాస్వామికమని కాంగ్రెస్ లీడర్ మధు యాష్కీ గౌడ్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రచ్చబండ కార్యక్రమానికి వెళుతున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకోవడం రాజ్యంగ హక్కులను కాలరాయడమని పేర్కొన్నారు. రచ్చబండ కార్యక్రమానికి వెళుతున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి వర్యులు మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబును గృహనిర్భంధంలో తీసుకోవాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం.. ప్రతి పక్ష పార్టీల భావ ప్రకటన స్వేచ్చా, నిరసన తెలిపే హక్కులను కాలరాస్తుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజాస్వామిక వాదులు, తెలంగాణ పోరాట యోధులు, కవులు, కళాకారులు, మేధావులు, తప్పక స్పందించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్న నిరసనలను.. పోలీసుల ఇనుప కంచెలు ఆపలేవన్నారు. ఉక్కు పాదాల కింద భావవ్యక్తీకరణ ఆపే ప్రయత్నం చేస్తే.. కాంగ్రెస్ శ్రేణులు వాటిని తిప్పికొడతారన్నారు. చరిత్రలో వరివేయొద్దని పిలుపునిచ్చిన చేతగానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని విమర్శించారు. రైతులకు మేలు చేయాల్సిన ముఖ్యమంత్రి వరి వేస్తే.. ఉరేనని చెప్పటం బాధాకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని.. రైతుల కోసం పోరాటాలు, ఉద్యమాలు చేసేందుకు యావత్ కాంగ్రెస్ నాయకత్వం సిద్ధంగా ఉంటుందన్నారు. రైతులేవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని.. టీఆర్ఎస్ ప్రభుత్వం.. వరి ధాన్యం కొనేవరకు పోరాటాలు చేస్తామని మధుయాష్కీ గౌడ్ స్పష్టం చేశారు. చదవండి: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అరెస్ట్ -
కేసీఆర్ ముఖ్యమంత్రా.. వాసాలమర్రి సర్పంచా?
సాక్షి, హైదరాబాద్: కేసీ ఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రో లేక వాసాలమర్రి గ్రామానికి సర్పంచో చెప్పాలని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ విమర్శించారు. ఆత్మగౌరవంతో బతకాల్సిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు ఉద్యోగాలు కల్పించి ఉంటే సీఎం ఇచ్చే రూ.10 లక్షల అవసరం ఎందుకు ఉండేదని అన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన ప్రచార కమిటీ కో కన్వీనర్ అజ్మతుల్లా హుస్సేనీ, టీపీసీసీ వీవర్స్ సెల్ చైర్మన్ శ్రీనివాస్‌తో కలసి మీడియాతో మాట్లాడుతూ ఆత్మగౌరవం, విద్యా, ఉద్యోగాలు, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అ యిందని అన్నారు. నయా నిజాంలా పాలిస్తు న్న కేసీఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఈ నెల 9న దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా నిర్వహిస్తోందని చెప్పారు. హుజూరాబాద్ ఎ న్నికల కోసమే కేసీఆర్, దళితబంధు డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో టీపీసీసీ వీవర్స్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. -
త్యాగాల తెలంగాణను కాపాడుకుందాం
ధర్పల్లి: కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ కృషితో వచ్చిన త్యాగాల తెలంగాణను కాపాడుకుందామని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. ధర్పల్లి గాంధీచౌక్‌లో ఆదివారం రాత్రి నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కిగౌడ్‌కు మద్దతుగా ఎన్నికల రోడ్ షోలో గద్దర్ పాల్గొని మాట్లాడారు. ఎందరో తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారి ఆశయాలను నిలబెట్టుకోవాలన్నారు. పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కిగౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి సాధించిందన్నారు. తాను పదేళ్లు ఎంపీగా జిల్లాకు ఎంతో అభివృద్ధి చేశానన్నారు. తెలంగాణ సాధన కోసం పార్లమెంట్లో గళం విప్పి సోనియాగాంధీని ఒప్పించి తెలంగాణ తెప్పించానని అన్నారు. కాంగ్రెస్ పార్టీని బపరిచి రాహుల్‌గాంధీని ప్రధాని చేసుకుంటేనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ కర్క గంగారెడ్డి, నాయకులు లాలాగౌడ్, రమేశ్‌గౌడ్, బాలనర్సయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
‘కల్వకుంట్ల’ పాలనకు కాలం చెల్లింది
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో ‘కల్వకుంట్ల’ కుటుంబ పాలనకు కాలం చెల్లిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మధుయాష్కీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళి చూస్తుంటే ప్రజా కూటమి విజయం ఖాయమని స్పష్టమవుతోందన్నారు. శనివారం గాంధీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ దాడులకు పాల్పడిందని ఆరోపించారు. పోలింగ్ రోజున రోహిత్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డిపై దాడి ఇందులో భాగమేనన్నారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళుతుండగా తనపై మెట్పల్లి వద్ద జరిగింది సాధారణ దాడి కాదని, తనను హతమార్చే కుట్ర అని ఆరోపించారు.పక్కా ప్రణాళిక ప్రకారం దాడి చేశారన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం వీస్తోందని, ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో నాలుగింటిలో కాంగ్రెస్ విజయం ఖాయ మని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో సైతం ప్రజలు ‘ప్రజాకూటమి’వైపు మొగ్గు చూపారన్నారు. తాము ఎగ్జిట్ పోల్ సర్వేలను విశ్వసించబోమని, గతంలో చాలా ఎన్నికల విషయంలో ఆ సర్వేలు తప్పని తేలిందని గుర్తు చేశారు. లగడపాటి సర్వేపై కేసీఆర్, కేటీఆర్‌లకు వణుకుపుడుతోందన్నారు. ఆయన సర్వే తమకు అనుకూలంగా వచ్చినప్పుడు టీఆర్ఎస్ నేతలు ఎగిరెగిరి గంతులేసి, వ్యతిరేకంగా వస్తే విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రగతి భవన్‌ను ఖాళీ చేయాల్సిందే: కుసుమ కుమార్ ఇక సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌ను ఖాళీ చేయాల్సిందేనని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమ కుమార్ అన్నారు. తెలంగాణలో ప్రజాకూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ మీడియా తెలంగాణ ప్రజల నాడిని పసిగట్టడంలో విఫలమైందన్నారు. వంశీచంద్‌రెడ్డిని పరామర్శించిన ఉత్తమ్ హైదరాబాద్: ప్రత్యర్థుల దాడిలో గాయపడి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కల్వకుర్తి ప్రజాకూటమి అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం పరామర్శించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నిమ్స్ ఆస్పత్రిలో కల్వకుర్తి ప్రజాకూటమి అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిని పరామర్శిస్తున్న ఉత్తమ్ -
‘పథకం ప్రకారమే నాపై హత్యాయత్నం’
హైదరాబాద్: నాపై జరిగిన దాడి హత్యాయత్నమేనని, పథకం ప్రకారమే హత్యాయత్నానికి టీఆర్ఎస్ నాయకులు పాల్పడ్డారని కాంగ్రెస్ నేత మధు యాష్కి ఆరోపించారు. హైదరాబాద్‌లో మధు యాష్కి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రలోభాలకు ప్రజలు లొంగలేదని అన్నారు. కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి, దాడులకు పాల్పడి అణచివేద్దామని అనుకున్నా ప్రజలు వెనుదిరగలేదన్నారు. టీఆర్ఎస్ ఓటమి భయంతోనే దాడులకు పాల్పడిందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబ పాలనకు కాలం చెల్లిందని వ్యాక్యానించారు. సోనియా ప్రచారం తర్వాత కూటమికి ఊపు వచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయని, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ 4 రాష్ట్రాల్లో కచ్చితంగా విజయం సాధించబోతోందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఎప్పుడూ సర్వేలను విశ్వసించదని తెలిపారు. ఎన్నికల్లో ప్రజల నాడి తమకు అనుకూలంగా ఉంది.. ప్రజా కూటమి అధికారంలోకి రాబోతోందని అభిప్రాయపడ్డారు. లగడపాటి తెలంగాణ విలన్ అన్న కేటీఆర్ ఆయనతో ఎందుకు చాటింగ్ చేశారని ప్రశ్నించారు. లగడపాటి సర్వే టీఆర్ఎస్కు అనుకూలంగా వచ్చినపుడు ఎగిరి గంతేయలేదా అని అడిగారు. ఇప్పుడు ఎందుకు ఆయనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్ని డబ్బులు ఖర్చు చేసిన ప్రజలు తలొగ్గలేదని వ్యాఖ్యానించారు. -
‘టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు’ : మధుయాష్కీగౌడ్
సాక్షి, నిజామాబాద్ అర్బన్: తెలంగాణ ఫైబర్ గ్రిడ్‌లో భారీ అవినీతి చోటు చేసుకుందని, కేసీఆర్ తన కుటుంబ సభ్యుల పేరిట భారీ అవినీతికి పాల్పడ్డారని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్ మండిపడ్డారు. ఆదివారం నిజామాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఫైబర్‌గ్రిడ్‌లో మూడు సంస్థలకు కాంట్రాక్టు అప్పగించారని, అందులో కేటీఆర్ కుటుంబీకులే ఉన్నారన్నారు. తన ఫ్యా మిలీకే కాంట్రాక్టు అప్పగించి కోట్లల్లో అవినీతికి పాల్పడ్డారన్నారు. జాగృతి పేరిట, బతుకమ్మ పేరిట ఇతర రాష్ట్రా ల్లో సైతం డబ్బులు వసూలు చేసిందన్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం అంకిరెడ్డిపల్లె వద్ద జైరాంరెడ్డికి వంద ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్‌గా మార్చి ఆ యనకు అప్పగించారని, ఇందుకుగాను ఎక్స్పో కంపెనీ క వితకు భారీగా ముడుపులు అందించారన్నారు. కేసీఆర్ తన ఫౌమ్‌హౌస్‌లో వందలాది బోర్లు వేయగా చుట్టు పక్కల రైతు లు నీరు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. మహాకూటమి నిశ్శబ్ధ విప్లవంగా వస్తుందని, క చ్చితంగా అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్‌కే పట్టంకట్టనున్నారని పేర్కొన్నారు. -
14 స్థానాలకు ఇంత సమయమా?: పొన్నం
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై మాట్లాడుతున్న టీఆర్ఎస్.. సొంత పార్టీ సంగతి చూసుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. మంగళ వారం ఢిల్లీలో మాట్లాడుతూ.. గత రెండు మూడు రోజులుగా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఏదంటూ టీఆర్ఎస్ మాట్లాడుతోందని, ఆ పార్టీ ఇంకా ప్రకటించాల్సి ఉన్న 14 స్థానాలపై 60 రోజులుగా కసరత్తు ఎందుకు చేస్తోందని ప్రశ్నిం చారు. ‘మీరు ముందు మీ ఇంటి సంగతి చూసుకోండి. ప్రకటించిన 40 స్థానాల్లో అసమ్మతిని చూసుకోండి. ఎంతసేపూ పొరుగింట్లో ఏం జరుగుతోంది? మహాకూటమి గురించి ఇతరత్రా మాట్లాడే కంటే నాలుగున్నరేళ్లుగా తెలంగాణను ఎలా మోసం చేశారో, ఎలా అప్పులపాలు చేశారో, అబద్ధాలతో కాలం గడిపారో చెప్పండి. ప్రజాస్వామ్యం నిలబడాలని, నియంతృత్వ ప్రభుత్వం గద్దె దిగాలన్న ఏకైక లక్ష్యంతో మేం పనిచేస్తున్నాం. అనేక చర్చలు, సంప్రదింపులు, నేతల ఐకమత్యం ద్వారా జాబితాపై కసరత్తు జరుగుతోంది. ముందు చెప్పినట్లుగానే జాబి తా వెలువడుతుంది’ అని పేర్కొన్నారు. ప్రజాకూటమిలో సమన్యాయం ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్ సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటవుతున్న ప్రజాకూటమిలో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్ అన్నారు. దళితులు, బడుగు బలహీన వర్గాల నేతలు కూడా సీఎం స్థానంలో ఉంటారని చెప్పారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐల ప్రజాకూటమికి, టీఆర్ఎస్–బీజేపీల నేతృత్వంలోని మాయాకూటమి కి మధ్య జరుగుతున్నాయన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో యాష్కీ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజాకూటమి విజయం సాధించడం ఖాయమన్నారు. డిసెంబర్ 11 తర్వాత కేసీఆర్‌కు రాజకీయ సన్యాసమేనన్నారు. రాజకీయ సన్యాసం తీసుకుంటారో, సన్నాసుల్లో కలసిపోతారో ఆయనే తేల్చుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అవినీతి కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రగతిభవన్‌ను ప్రజలకేనని చెప్పారు. గల్ఫ్ కార్మికులకు కాంగ్రెస్‌తోనే మేలు జరుగుతుందని యాష్కీ అన్నారు. ఈ నెల 9న దుబాయ్‌లో జరగనున్న గల్ఫ్ కార్మికుల సభకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, షబ్బీర్ అలీ, తాను పాల్గొంటున్నట్టు తెలిపారు. -
‘డిసెంబర్లో ఎన్నికలు.. కేసీఆర్‌కు భయం’
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల తేదీలతో కేసీఆర్‌కు దిమ్మతిరిగిందని.. రెండు పెగ్గులు ఎక్కువేసుకుని నిద్రపోక తప్పదని నిజామాబాద్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్ ఎద్దేవా చేశారు. శనివారం ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈసీతో కేసీఆర్‌తో కుమ్మకై నవంబర్లోనే ఎన్నికలు నిర్వహించాలని తీవ్రంగా ప్రయత్నించారని, కానీ ఆనూహ్యంగా డిసెంబర్లో ఎన్నికలు జరుగునున్నాయని ఆయన తెలిపారు. కేసీఆర్ జ్యోతిష్యుం బాగా నమ్ముతారని, నవంబర్‌లో ఎన్నికలు జరిగితేనే టీఆర్ఎస్ గెలుస్తుందని జ్యోతిష్యుడు ఆయనకు చెప్పారని వ్యాఖ్యానించారు. డిసెంబర్లో ఎన్నికలు రావడంతో కేసీఆర్‌కు భయం మొదలైందని అన్నారు. ఎన్నికలు ముందుగా నిర్వహించి ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు కేసీఆర్ ప్రయత్నించారని, ఆయన ఎత్తులు ఫలించలేదని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీని కేసీఆర్ అనూహ్యంగా రద్దు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీతో పాటు, రాష్ట్ర ప్రజానీకమంతా కొంత ఆందోళన చెందిందని అన్నారు. కానీ అసెంబ్లీ రద్దు చేయడంతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని.. ముందుగానే కేసీఆర్ పాలన నుంచి ప్రజలకు విముక్తి లంభించిందని మధుయాష్కీ పేర్కొన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవదని కేసీఆర్‌కు అర్ధమైందని, అందుకే మతిభ్రమించి నోటికి వచ్చినట్లు పచ్చి భూతులు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ నెల చివరిలో రాహుల్ గాంధీతో బహిరంగ సభను నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నవంబర్‌లో సోనియా గాంధీ తెలంగాణలో పర్యటిస్తారని అన్నారు. -
కులాలను చీల్చి లబ్ది పొందాలని చూస్తున్నారు
-
‘హామీలు చూశాం.. మోసాలు చూశాం.. ఇక చాలు’
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ డ్రగ్స్‌కి క్యాపిటల్‌గా మారిందని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కి ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెడ్డి, గౌడ్ల వర్గాలు రాజకీయంగా ఇబ్బందిగా మారుతారని ఆ వర్గాలను కేసీఆర్ వేధిస్తున్నారని విమర్శించారు. బడుగులు అంతా ఏకమై కేసీఆర్‌కు బుద్ది చెప్పాలన్నారు. కల్లు గీతకార్మికుల సమస్యలను మేనిఫెస్టోలో చేర్చుతామన్నారు. అందరిని మోసం చేస్తున్న పాపాత్ముని పాలన త్వరలోనే అంతం కాబోతుందని మధుయాష్కి పేర్కొన్నారు. కులాలను చీల్చి లబ్ది పొందాలని చూస్తున్నారు : డీకే అరుణ కేసీఆర్ కులాలను చీల్చి లబ్ది పొందాలని చూస్తున్నారని తాజా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ విమర్శించారు. అన్నికులాల భవనాలకు వందల జీవోలు వచ్చాయి కానీ భవనాలను నిర్మించలేదన్నారు. టీఆర్ఎస్ భవనాలకు ప్రతి జిల్లాలో భూములు దొరికుతాయి కానీ కుల సంఘాలకు భూములు దొరకడం లేదా అని ప్రశ్నించారు. గద్వాలలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌కి కేటాయించిన భూమి ప్రభుత్వానిదని, అక్కడ ఆఫీస్ కట్టనిచ్చేది లేదన్నారు. టీఆర్ఎస్ నాయకుల ఇసుక దందాలో ఒక్కరోజులో వచ్చే ఆదాయంతో భవనం కట్టుకోవచ్చని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హామీలను చూశాం..మోసాలను చూశాం.. ఇక చాలు అంతా కలిసి కాంగ్రెస్‌కి అండగా ఉండాలని కోరారు. గీత కార్మీకులకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. -
‘కర్ణాటకలో తెలుగు ఓట్లు మావే’
సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలకుగానూ కర్ణాటక ఇన్‌ఛార్జ్‌లుగా పనిచేస్తున్న తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావులు స్పందించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగువారి ఓట్లు కాంగ్రెస్ పార్టీకే పడుతాయని మధుయాష్కీ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడే అవకాశం లేదని కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించి తీరుతుందని తెలిపారు. రాష్ట్రంలో మరోసారి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తారన్నారు. 2019లో రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలో జరగనున్న ఎన్నికలపై కర్ణాటక ఫలితాలు ప్రభావం చూపుతాయని, ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కీలకమని పేర్కొన్నారు. 'కర్ణాటక రాష్ట్ర జనాభా దాదాపు ఆరు కోట్లు, వీరిలో తెలుగు ప్రజలు కోటికి పైగా ఉన్నారు. తెలుగువారి ఓట్లు మా పార్టీకి కలిసొచ్చే అంశం, వారు కాంగ్రెస్‌కే ఓటు వేస్తారని' పేర్కొన్నారు. 2004, 2009 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన మధుయాష్కీ ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ విధానాల చాలా నష్టపోయారు: మురళీధర్ రావు కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు ఎన్నికలపై స్పందిస్తూ... కర్ణాటకలో తెలుగు ప్రజలు బీజేపీపై నమ్ముతారని, వారి ఓట్లు తమ పార్టీకే వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ కన్నడ ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పోయింది. ఇక్కడి ప్రజలు కాంగ్రెస్‌ను పూర్తిగా విస్మరించారు. కాంగ్రెస్ విధానాల వల్ల కన్నడ ప్రజలు చాలా నష్టపోయారు. వారి చర్యల వల్ల ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పూర్తిగా నష్టపోయింది’ అని వివరించారు. -
ప్రతిష్టాత్మక పోరు
* సిట్టింగ్ ఎంపీకి గట్టిపోటీ * స్పీడ్ పెరిగిన కారు... పట్టు బిగిస్తున్న కమలం * ఆసక్తికరంగా మారిన నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక నిజామాబాద్ నుంచి బి. నారాయణరెడ్డి: నిజామాబాద్ లోక్‌సభ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. రెండు దఫాలుగా గెలిచిన సిట్టింగ్ ఎంపీ (కాంగ్రెస్) మధుయూష్కీ గౌడ్ ఎదురీదుతున్నారు. ఇటు కమలం...అటు కారు నుంచి గట్టి పోటీ ని ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తవువుతోంది. ఎంపీగా గెలిచాక నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని వివుర్శలున్నారుు. బీజేపీతో పొత్తు వల్ల తెలుగుదేశం పోటీచేయుకపోవడం కూడా మధుయూష్కీకి పరిస్థితులు ప్రతికూలంగానే వూరాయునే చెప్పవచ్చు. టీడీపీలో కింది స్థారుు క్యాడర్ చాలా వరకు టీఆర్ఎస్ పట్ల ఆసక్తిచూపుతోంది. నియోజకవర్గ పరిధిలోని బాల్కొండ, కోరుట్ల, నిజామాబాద్ అర్బన్ వంటి అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో కాంగ్రెస్ పరిస్థితి గడ్డుగానే ఉంది. ఇక్కడి అభ్యర్థులతో సవున్వయులోపం, అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా క్రాస్ ఓటింగ్ భయుం ఆయునను వెన్నాడుతోంది. కవిత రాకతో వూరిన సమీకరణాలు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత లోక్‌సభ బరిలోకి దిగడంతో ఇక్కడి రాజకీయు పరిణాలు అనూహ్యంగా వూరిపోయూరుు. పైగా కూతురి గెలుపు కోసం కేసీఆర్ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. ప్రజల్లో పట్టున్న బాజిరెడ్డి గోవర్దన్ వంటి నాయకుల్ని టీఆర్ఎస్లో చేర్చుకుని లోక్‌సభ సీటు పరిధిలోని అసెంబ్లీ స్థానంలో పోటీకి దింపడం ద్వారా ప్రత్యర్థుల స్పీడ్ తగ్గించగలిగారు. తెలంగాణ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనడం, తెలంగాణ జాగృతి సంస్థ పేరిట తెలంగాణ సంస్కృతి- సంప్రదాయూలను జనంలోకి తీసుకువెళ్లడం ద్వారా కవిత వుహిళలకు దగ్గరవ్వడం ఎన్నికల్లో కలిసివచ్చే అంశం. బలంగా ఉన్న బీజేపీ బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ గట్టిపోటీ ఇస్తున్నారు. పైగా, నిజామాబాద్ పట్టణంలో బీజేపీకి బాగా పట్టు ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా అందరితో ఉన్న వుంచి సంబంధాలు ఆయునకు ఓట్ల రూపంలో కలిసివచ్చే అవకాశాలు ఉన్నారుు. నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ సీటుకు బీజేపీ నుంచి పోటీలో ఉన్న సూర్యనారాయణ గుప్తా బలమైన అభ్యర్థి. ఇతర అసెంబ్లీ సెగ్మెంట్ల లో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. బీజేపీ పుంజుకునే స్థారుుని బట్టి అభ్యర్థుల గెలుపు ఓటవుులు ఉంటారుు. -
రచ్చబండ!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఈసారి రచ్చబండ సభలను మండల కేంద్రాలు, పట్టణాలకే పరిమితం చేశారు. షెడ్యూలు ప్రకారం ఇప్పటివరకు 43కుపైగా సభలు పూర్తికావాల్సి ఉండగా ప్రజల నుంచి ఏర్పడుతున్న ఆటంకాల కారణంగా 12 సభలనే నిర్వహించారు. బోధన్ నియోజకవర్గంలో రచ్చబండ పూర్తికాగా, ఎల్లారెడ్డిలో మూడు, బాల్కొండలో ఒకటి, ఆర్మూర్‌లో మూడు సభలను నిర్వహిం చారు. ఆర్మూర్ నియోజకవర ్గంలోని ఆర్మూర్ పట్టణం, నంది పేట, మక్లూర్లో బుధవారం రచ్చబండ సభలు జరిగాయి. ఈ సభ ల్లో ఎంపీ మధుయాష్కీగౌడ్, ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ, కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, స్థానిక ప్రజాప్రతి నిధులు పాల్గొన్నారు. రచ్చబండ వేదికపై అలంకరించిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫొటో ఉండడంపై ఆర్మూర్ సభలో బీజేపీ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. సీఎం సందేశాన్ని కూడా సభలో చదవనివ్వకుండా జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. సీమాంధ్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కిరణ్ ఫొటోలుగానీ, సందేశం కాని ఉండకూడదని హెచ్చరించారు. ఈ సభలో సీపీఎం కార్యకర్తలు ఇళ్ల స్థలాల కోసం ఆందోళన నిర్వహించగా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లో నిర్బంధించారు. నందిపేట, మాక్లూర్‌లో మాత్రం రచ్చబండ సభలు సజావుగా సాగాయి. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమాన్ని సార్వత్రిక ఎన్నికలకు ముందు నిర్వహిస్తోందనివిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గత రచ్చబండ సభల్లో అర్హులైన లబ్ధిదారులు వివిధ పథకాల కోసం దరఖాస్తులు చేసుకోగా ఇప్పటి ప్రభుత్వం పరి ష్కారం చూపలేదని పేర్కొంటున్నాయి. మూడో విడత సభలలో గతంలోని దరఖాస్తులకు మంజూరు ఇవ్వడంతో పా టు, కొత్త దరఖాస్తులను స్వీకరించాలని సీపీ ఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. సభలలో సీఎం సందేశాన్ని చదవనివ్వబోమని, వేదికపై ఫ్లెక్సీలో సీఎం ఫొటోను ఉంచనివ్వబోమని టీఆర్ఎస్, బీజేపీ స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీ మాత్రం ఈ విషయంపై ఆచి తూచి అడుగులు వేస్తున్నాయి. పక్కనున్న కరీంనగర్ జిల్లా లో ఎంపీ పొన్నం ప్రభాకర్‌తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు రచ్చబండలో సీఎం ఫొటోతో పాటు సందేశం లేకుండా చర్యలు చేపడుతుండగా జిల్లాలో ఎంపీ మధుయాష్కీగౌడ్ స్పందించకపోవడంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు.